మీ ఫోన్ ఆన్ అవటం లేదా..?

|

హార్డ్‌వేర్ లేదా సాఫ్ట్‌వేర్ లోపాలు తలెత్తినపుడు ఆండ్రాయిడ్ ఫోన్ ఆన్ అవకుండా మెరాయిస్తుంటుంది. సమస్య ఫోన్ హార్డ్‌వేర్‌లో ఉన్నట్లయితే మీకు మీరుగా పరిష్కరించుకోవటం కష్టతరమవుతుంది.

మీ ఫోన్ ఆన్ అవటం లేదా..?

సమస్య ఫోన్ సాఫ్ట్‌వేర్‌లో ఉన్నట్లయితే కొన్ని ట్రిక్స్‌ను అప్లై చేయటం ద్వారా ఫోన్‌ను తిరిగి ఆన్ చేయవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం...

Read More : మీకు తెలియకుండా మీ ఫేస్‌బుక్ అకౌంట్‌ను ఇంకొకరు వాడుతున్నారా..?

స్టెప్ 1

స్టెప్ 1

బ్యాటరీ డెడ్ అయినట్లయితే మీ ఫోన్ టర్నాఫ్ అయినట్లయితే, "empty battery"తో ఉన్న మీ ఫోన్ ను 10 నుంచి 15 నిమిషాల పాటు క్విక్ చార్జ్ చేయండి. ఆ తరువాత ఫోన్ ఆన్ చేసి చూడండి. సమస్య డెడ్ బ్యాటరీ కారణంగా ఏర్పడినట్లయితే వెంటనే సద్దుమణిగిపోతుంది.

స్టెప్ 2

స్టెప్ 2

మీ ఫోన్ హ్యాంగ్ అయిందన్న విషయాన్ని ఖచ్చితంగా నిర్థారించుకున్న తరువాత ముందుగా చేయవల్సిన పని ఫోన్‌ను స్విచాఫ్ చేయండి. ఫోన్ స్విచాఫ్‌కు సహకరించని పక్షంలో బ్యాటరీని తొలగించండి. ఓ నిమిషం తరువాత బ్యాటరీని ఎదా స్థానంలో ఉంచి ఫోన్‌ను రీస్టార్ట్ చేయండి. చాలా సందర్భాల్లో ఈ ట్రిక్ పనిచేస్తుంది. మీ ఫోన్ తరచూ హ్యాంగింగ్ సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే లోపం ఫోన్ సాఫ్ట్‌వేర్‌లో ఉన్నట్టు గుర్తించండి. ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేయండి.

స్టెప్ 3
 

స్టెప్ 3

మీ ఫోన్‌లో నాన్ రిమూవబుల్ బ్యాటరీ ఉన్నట్లయితే, పవర్ బటన్ పై లాంగ్ ప్రెస్ ఇవ్వండి. 30 సెకన్లు అంతకన్నా ఎక్కువ సేపు పవర్ బటన్‌‍ను హోల్డ్ చేసి ఉంచటం వల్ల బ్యాటరీ నుంచి ఫోన్‌కు వెళ్లే పవర్ పూర్తిగా కట్ అవుతుంది. కొద్ది సెకన్ల తరువాత ఫోన్‌ను రీస్టార్ట్ చేయండి. సమస్య పరిష్కారం కావొచ్చు.

స్టెప్ 4

స్టెప్ 4

రికవరీ మోడ్‌లో ఫ్యాక్టరీ రీసెట్‌ను నిర్వహించటం ద్వారా మీ ఆండ్రాయిడ్ డివైస్ సేఫ్ మోడ్‌లో రీబూట్ అవుతుంది. తద్వారా ఫోన్ అవ్వొచ్చు. ఫోన్ బటన్‌లను ఏకకాలంలో హోల్డ్ చేసి ఉంచటం ద్వారా ఫ్యాక్టరీ రీసెట్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

స్టెప్ 5

స్టెప్ 5


మీ ఫోన్ సాఫ్ట్‌వేర్ పూర్తిగా దెబ్బతిన్నట్లయితే ఫ్యాక్టరీ రీసెట్ ప్రక్రియ సజావుగా సాగదు. కాబట్టి, మీ ఫోన్ తయారీదారు ప్రొవైడ్ చేసిన ఆండ్రాయిడ్ ఫిర్మ్‌వేర్‌ను తిరిగి మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవల్సి ఉంటుంది.

స్టెప్ 6

స్టెప్ 6

పనికొస్తాయి కదా అని అనేక రకాల యాప్‌లను ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేస్తుంటాం. ఈ యాప్‌లు డివైస్‌లో ఎక్కువ స్టోరేజ్ స్పేస్‌ను ఆక్రమించేసి ఫోన్ వేగాన్ని పూర్తిగా తగ్గించి వేస్తాయి. ఫోన్‌లు హ్యాంగ్ అవటానికి కూడా ప్రధాన కారణం ఇవే. కాబట్టి మీ ఫోన్‌ను ఎప్పటికప్పుడు సురక్షితంగానూ అదే సమయంలో క్లీన్‌‍గా ఉంచేందుకు ప్రయత్నం చేయండి.

Best Mobiles in India

English summary
What to do if your Android phone won't turn on..?, Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X