మొబైల్ నెట్‌వర్క్ సిగ్నల్స్‌, వాటి అర్థాలు

E, 3G, H, H+, G అనే ఆల్ఫాన్యూమరిక్ కోడ్స్ మొబైల్ నెట్‌వర్క్‌కు సంబంధించి సిగ్నల్ స్టామినాను సూచిస్తాయి.

|

మీరు గమనించినట్లయితే మన ఫోన్ ఇంటర్నెట్ వేగం ప్రాంతాన్ని బట్టి మారిపోతుంటుంది. పట్టణాల్లో ఒకరకంగా, గ్రామీణ ప్రాంతాల్లో ఒకరకంగా సిగ్నల్ క్వాలిటీ కనిపిస్తుంది. E, 3G, H, H+, G అనే ఆల్ఫాన్యూమరిక్ కోడ్స్ మొబైల్ నెట్‌వర్క్‌కు సంబంధించి సిగ్నల్ స్టామినాను సూచిస్తాయి. ఈ సింబల్స్ వెనుక దాగి ఉన్న అర్థాలను ఇప్పుడు తెలుసుకుందాం..

2జీ ఇంటర్నెట్

2జీ ఇంటర్నెట్

వైర్‌లెస్ కమ్యూనిషన్ ప్రసారాలకు ఉపయోగించిన రెండవ తరం టెక్నాలజీనే 2జీ నెట్‌వర్క్‌గా పిలుస్తారు. ఎస్ఎంఎస్, ఎంఎంఎస్ వంటి డేటా సర్వీసులను ఈ నెట్‌‌వర్క్ మొబైల్ ఫోన్‌లకు అందిస్తుంది. 2జీ నెట్‌వర్క్ గరిష్ట వేగం సెకనుకు 50 kilobitsగా ఉంటుంది. ఈ స్పీడులో ఇంటర్నెట్ బ్రౌజింగ్ చాలా నెమ్మదిగా ఉంటుంది.

 G లేదా GPRS

G లేదా GPRS

G లేదా GPRSను 2.5జీ అని కూడా పిలుస్తారు జీపీఆర్ఎస్ (జనరల్ ప్యాకెట్ రేడియ్ సర్వీస్)ను 2.5జీ అని కూడా పిలవటం జరుగుతోంది. ఈ నెట్‌వర్క్ స్పీడ్ సెకనుకు 114 కేబీపీఎస్ వరకు ఉంటుంది. ఈ స్పీడ్‌లో వెబ్ పేజీలు చాలా నెమ్మదిగా ఓపెన్ అవుతాయి. ఇన్‌స్టెంట్ మెసేజింగ్ వేగంగా ఉంటుంది.

E or EDGE EDGE
 

E or EDGE EDGE

E or EDGE EDGE (ఎన్‌హాన్సుడ్ డేటా రేట్స్ ఫర్ జీఎస్ఎమ్ ఎవల్యూషన్) నెట్‌వర్క్, ఇతర నెట్‌వర్క్‌లతో పోలిస్తే 3 రెట్లు వేగంగా స్పందిస్తుంది. ఈ నెట్‌వర్క్ సపోర్ట్ స్పీడ్ సెకనుకు 217కేబీపీఎస్‌గా ఉంటుంది. నిరుత్సాహపరిచే విషయం ఎంటంటే ఈ స్పీడులో తక్కువ రిసల్యూషన్ వీడియోలు సైతం ఓపెన్ అవ్వవు.

 3G

3G

3జీ నెట్‌వర్క్ అనేది యూనివర్శల్ మొబైల్ టెలీకమ్యూనికేషన్స్ సర్వీస్ స్టాండర్డ్స్ ఆధారంగా డిజైన్ కాబడింది. ఈ నెట్‌వర్క్ స్పీడ్ సెకనుకు 384 కేబీపీఎస్‌గా ఉంటుంది. ఈ స్పీడులో ఆన్‌లైన్ వీడియోలతో పాటు మ్యూజిక్ స్ట్రీమింగ్‌ను అంతరాయం లేకుండా ఆస్వాదించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించబడుతోన్న నెట్‌వర్క్‌‌లలో 3జీ ఒకటి.

H స్టాండర్డ్ అంటే..?

H స్టాండర్డ్ అంటే..?

 H స్టాండర్డ్ అనేది HSPA+ (హైస్పీడ్ ప్యాకెట్ యాక్సెస్) ఆధారంగా స్పందిస్తుంది. ఈ నెట్‌వర్క్ స్పీడ్ 7.2 ఎంబీపీఎస్‌గా ఉంటుంది. ఈ నెట్‌వర్క్ స్పీడులో యూట్యూబ్ వీడియోలతో పాటు వెబ్ బ్రౌజింగ్‌ను హైక్వాలిటీతో ఆస్వాదించవచ్చు. సినిమాలను సైతం అలవోకగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

4G LTE

4G LTE

4G LTE ప్రస్తుత అందుబాటులో ఉన్న అన్ని మొబైల్ నెట్‌వర్క్‌లలో 4G LTEతీ ఫాస్టెస్ట్ నెట్‌వర్క్‌‌గా చెప్పుకోవచ్చు. 4G నెట్‌వర్క్ గరిష్ట వేగం సెకనుకు 1Gbpsగా ఉంటుంది. భవిష్యత్‌లో 1Tbpsను సపోర్ట్ చేసే అవకాశం. ఈ నెట్‌వర్క్ స్పీడులో హైక్వాలిటీ వెబ్‌బ్రౌజింగ్‌ను ఆస్వాదించవచ్చు.

Best Mobiles in India

English summary
What does it mean by G, E, H, 3G, 4G LTE network symbol on Mobile Signal. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X