గూగుల్ మ్యాప్స్ టైం లైన్ అంటే ఏమిటి?

Posted By: Madhavi Lagishetty

గూగుల్ బ్రౌజింగ్...ఇది ఒక హిస్టరీ అని చెప్పవచ్చు. ఎందుకంటే మనకు కావాల్సిన ప్రతి విషయాన్ని గూగుల్ ద్వారా తెలుసుకుంటాం. అంతేకాదు గూగుల్ మ్యాప్స్ ద్వారా ప్రతి స్థలాన్ని ఈజీగా ట్రాక్ చేయవచ్చు. గూగుల్ మ్యాప్ లో యువర్ టైంలైన్ అని పిలిచే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ ద్వారా వినియోగదారులు సందర్శించే లొకేషన్స్ మరియు వేదికలతో సహా వారు ఏదైనా సరే చూసేందుకు ఛాన్స్ ఉంటుంది.

గూగుల్ మ్యాప్స్ టైం లైన్ అంటే ఏమిటి?

డేట్, మోడ్, ట్రాన్స్ పోర్ట్ వంటి యాక్టివిటీస్ను రెగ్యూలర్ గా ఫాలో అయ్యే యూజర్ల కోసం గూగుల్ మ్యాప్స్ టైంలైన్ ఎంతోగానో ఉపయోగపడుతుంది. మీరు సందర్శించే స్థలాలను టైం లైన్లో చూసే అవకాశం ఉంటుంది. మీకు కావాల్సిన స్థలాలను తెలుసుకోవడానికి ఈ క్రింది స్టెప్స్ ఫాలో అవ్వండి.

స్టెప్1..టాప్ మెనూలో లెఫ్ట్ టాప్ మెనుని నొక్కి మీ టైంలైన్ను సెలక్ట్ చేసుకోండి

స్టెప్2
మరింత సమాచారం కోసం సెట్టింగ్స్ కు వెళ్లండి

స్టెప్ 3..లొకేషన్ హిస్టరీని స్టార్ట్ చేయకపోతే...ఇఫ్పుడు మీ లొకేషన్ మరియు లొకేషన్ హిస్టరీ ఉందని నిర్దారించుకోండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీరు ఎక్కడికి ట్రావెల్ చేశారో చూడటానికి....

స్టెప్1..Gmapsకి వెళ్లండి

స్టెప్2..టాప్ మెనూలో లెఫ్ట్ బటన్ నొక్కిన తర్వాత టైంలైన్ను సెలక్ట్ చేసుకోండి

స్టెప్3..స్పెసిఫిక్ రోజు లేదా నెల చూడటానికి క్యాలెండర్ ఉంటుంది.

అంతేకాదు మీరు టైం లైన్ను ఎడిట్ కూడా చేసుకోవచ్చు. లొకేషన్ హిస్టరీని డిలిట్ చేయడం వంటివి కూడా మీ టైం లైన్లో ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది.

విజిట్ చేసిన స్థలాలను మార్చడానికి...

స్టెప్1...Gmaps కి వెళ్లండి

స్టెప్2..టాప్ మెనూలో లెఫ్ట్ టాప్ లో మెనుని నొక్కిన తర్వాత టైం లైన్ను సెలక్ట్ చేసుకోండి

స్టెప్ 3...దిగువన ఉన్న బటన్ను నొక్కండి. సరైన స్థలాన్ని నొక్కిన తర్వాత మీరు టైమింగ్ మార్చుకోవచ్చు.

సీనియర్ సిటిజన్స్ కోసం UberACCESS, UberASSIST వాహనాలు!

ఒక రోజు తొలగించడానికి...

స్టెప్1..Gmapsకి వెళ్లండి.

స్టెప్2..టాప్ మెనూలో లెఫ్ట్ టాప్ లో మెనుని నొక్కి టైంలైన్ను సెలక్ట్ చేసుకోండి

స్టెప్ 3..ఇప్పుడు షో క్యాలెండ్ లో మీరు తొలగించాలనుకుంటున్న రోజును సెలక్ట్ చేసుకోండి

స్టెప్ 4..ఇప్పుడు మీరు సెలక్ట్ చేసుకున్న డేట్ను డిలీట్ చేసుకోవచ్చు.

లొకేషన్ మరియు లొకేషన్ హిస్టరీని డిలిట్ చేయడం....

స్టెప్ 1...Gmapsకి వెళ్లండి.

స్టెప్2..టాప్ మెనూలో లెఫ్ట్ మెనుని నొక్కి టైంలైన్ను సెలక్ట్ చేసుకోండి

స్టెప్3..ఇప్పుడు సెట్టింగ్స్ కు వెళ్లి లొకేషన్ సెట్టింగ్స్ స్క్రోల్ చేయండి.

స్టెప్4. హిస్టరీలోని కొన్నింటిని డిలీట్ చేయడానికి లొకేషన్ హిస్టరీ రేంజ్ తొలగించు ప్రెస్ చేయండి.

స్టెప్ 5. ప్రతీది డిలీట్ చేయడానికి డిలీట్ ఆల్ లొకేషన్ హిస్టరీ బటన్ను ప్రెస్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
It's a known fact that Google tracks each and every activity of ours including the browsing history, places we've been and much more. Check out on how to see Google Timeline.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot