Home
How to

ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోయర్స్‌ కామెంట్స్‌, రీల్స్‌ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా..?

మెటా సంస్థకు చెందిన ప్రముఖ ప్లాట్‌ఫాంలలో ఇన్‌స్టాగ్రామ్‌ (instagram) ఒకటి. కోట్లాది మంది యూజర్లు ఇన్‌స్టాగ్రామ్‌ను ఉపయోగిస్తున్నారు. ఫోటోలు, వీడియోలు, రీల్స్‌ను పోస్ట్ చేస్తున్నారు. కొంత మంది ఇన్‌స్టాగ్రామ్‌ కాలక్షేపానికి ఉపయోగిస్తుంటే.. మరికొంత మంది దీని ద్వారా భారీగా ఆదాయం సంపాదిస్తున్నారు. ముఖ్యంగా అనేక మంది సెలబ్రిటీలు తమ అప్‌డేట్స్‌.. ఇన్‌స్టా ద్వారా తమ అభిమానులతో పంచుకుంటున్నారు.

ఇన్‌స్టాగ్రామ్‌ లో అనేక సెక్యూరిటీ ఫీచర్‌లను కలిగి ఉంది. దీంతోపాటు యూజర్ల ప్రైవసీకి ఇబ్బంది లేకుండా అనేక ఫీచర్‌లను ఎప్పటికప్పుడు అందుబాటులోకి తీసుకొస్తోంది. అయితే ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లు కొన్నిసార్లు వారి ఫాలోయర్స్‌ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న సంఘటనలు అనేకం ఉన్నాయి.

What is instagram Restrict feature

అన్‌ఫాలో, బ్లాక్‌ కాకుండా ఇంకా ఏం చేయవచ్చు..?
ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోయర్స్‌ అసభ్యకర, అభ్యంతకర కామెంట్స్, రీల్స్‌తో అనేక మంది యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే కామెంట్స్‌ చేసిన వారిని అన్నిసార్లు Unfollow, బ్లాక్‌ చేసే అవకాశం ఉండదు. దీని వల్ల యూజర్లను కోల్పోయేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలో చాలా మంది యూజర్లకు అవగాహన ఉండదు.

Restrict ఆప్షన్‌ :
ఇలాంటి సమస్యలకు చెక్‌ పెట్టేందుకు ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌బిల్ట్‌ ఫీచర్‌ను కలిగి ఉంటుంది. Restrict పేరుతో ఈ ఆప్షన్‌ అందుబాటులో ఉంది. ఈ ఫీచర్‌ను ఉపయోగించుకుంటే.. యూజర్లను అన్‌ఫాలో, బ్లాక్‌ చేయాల్సిన అవసరం లేకుండా అప్రమత్తం కావచ్చు. ఈ ఫీచర్‌ ద్వారా ఫాలోయర్స్‌ సంఖ్యపై ఎటువంటి ప్రభావం చూపదు.

ఇన్‌స్టాగ్రామ్‌లో Restrict ఫీచర్ వల్ల ఉపయోగం ఏంటి?
ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ యూజర్‌ను అయినా Restrict చేస్తే.. మీరు ఆన్‌లైన్‌ ఉన్నా.. వారికి ఆ విషయం తెలియదు. మరియు వారి మెసేజ్‌లను మీరు చూసినా.. వారికి తెలిసే అవకాశం ఉండదు. దీంతోపాటు వారి నుంచి రీల్స్‌, కామెంట్స్‌ మీరు నేరుగా చాట్‌లోకి వచ్చే అవకాశం లేదు.

మీరు Restrict చేసిన యూజర్ నుంచి వచ్చే మెసేజ్‌లు ప్రత్యేక Message Request ఫోల్డర్‌లోకి వెళ్లిపోతాయి. దీంతోపాటు మిమ్మల్ని Tag లేదా Mention చేయలేరు. ఫాలోయర్స్‌ను కోల్పోకుండా, ప్రైవసీని కాపాడుకోవాలనుకొనే యూజర్లకు ఈ ఫీచర్‌ ఎంతో అనుకూలంగా ఉంటుంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో Restrict ను ఎలా యాక్టివేట్‌ చేసుకోవాలి?
స్టెప్‌ 1: ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌ ఓపెన్‌ చేసి, ప్రొఫైల్‌లోకి వెళ్లాలి.
స్టెప్ 2 : అక్కడ కనిపించిన మూడు చుక్కల మెనూ పైన క్లిక్‌ చేయాలి.
స్టెప్ 3 : అనంతరం అక్కడ కనిపించిన Restrict ఆప్షన్‌ పైన క్లిక్‌ చేయాలి.

ఇన్‌స్టాగ్రామ్‌ సెట్టింగ్స్‌ పేజీ ఆప్షన్‌ ద్వారా కూడా Restrict ఫీచర్‌ను యాక్టివేట్‌ చేయవచ్చు.
స్టెప్‌ 1 : ఇన్‌స్టా ప్రొఫైల్‌ లోని సెట్టింగ్స్‌ అండ్‌ యాక్టివిటీ పైన క్లిక్‌ చేయాలి.
స్టెప్‌ 2 : అనంతరం కిందకు స్క్రోర్‌ చేసి, Restricted ఆప్షన్‌ పైన క్లిక్‌ చేయాలి.
స్టెప్ 3 : అక్కడ మీరు ఎవరిని Restricted list చేర్చాలని భావిస్తున్నారో సెర్చ్‌ చేసి, యాడ్‌ చేయాలి.

More from GizBot

Best Mobiles in India

English summary
What is instagram Restrict feature, what is the use and how to enable it
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X