సిమ్ కార్డ్ అంటే ఏంటి..?

Posted By:

సిమ్ కార్డ్.. ఈ పేరు తెలియని మొబైల్ వినియోగదారంటూ ఉండరు. మొబైల్ ఫోన్‌లు మొదలుకుని డేటా కార్డుల వరకు సిమ్‌కార్డ్ ఆధారంగానే స్పందిస్తున్నాయి. ఇంత వరకు మనందరికి తెలుసు. అసలు సిమ్ కార్డ్ ఏమిటి..? ఈ ప్రశ్నకు జవాబు చాలా మందికి తెలుసి ఉండదు. సిమ్ కార్డ్ పూర్తి పేరు ‘సబ్‌స్ర్కైబర్ ఐడెంటిఫికేషన్ మాడ్యూల్'. దీన్నే మనం క్లుపంగా సిమ్ కార్డ్‌గా పిలుచుకుంటున్నాం.

సిమ్ కార్డ్‌లను ఒక్క మొబైల్ ఫోన్స్‌‍లోనే కాదు పేటీవీ, ఏటీఎం, ఇంటర్నెట్ డేటా‌కార్డ్స్ వగైరా అంశాల్లో ఉపయోగిస్తున్నారు. సిమ్ కార్డ్‌లలో రెండు రకలాంటాయి. వీటిలో మొదటి రకం సిమ్ కార్డులు రీడ్ ఓన్లీ మెమరీ వ్యవస్థను మాత్రమే కలిగి ఉంటాయి. రెండో రకం సిమ్ కార్డుల్లో మెమరీని చెరిపి మళ్లి రాసుకోవచ్చు. మొబైల్ ఫోన్‌ల విషయానికొస్తే సిమ్ కార్డులు జీఎస్ఎమ్, సీడీఎమ్ఏ రకాల్లో లభ్యమవుతున్నాయి. మార్కెట్లో మొబైల్ ఫోన్‌ సిమ్ కార్డులు 2జీ, 3జీ, 4జీ రకాల్లో లభ్యమవుతున్నాయి. సిమ్ కార్డులలోని పలు రకాలను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సిమ్ కార్డ్ అంటే ఏంటి..?

ఫుల్‌సైజ్ సిమ్ కార్డు - 85mm x 53mm

సిమ్ కార్డ్ అంటే ఏంటి..?

మినీ సిమ్‌కార్డ్- 25mm x 15mm

సిమ్ కార్డ్ అంటే ఏంటి..?

మైక్రో సిమ్‌కార్డ్-15mm x 12mm

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot