Home
How to

TV, రిమోట్‌తో ఈ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా.. ఇవే కారణాలు కావచ్చు..!

ప్రస్తుతం అందరి ఇళ్లల్లో టీవీలను వినియోగిస్తున్నారు. అయితే ఏదో ఒక సమయంలో టీవీ రిమోట్‌ కారణంగా విసుగెత్తిపోయిన సందర్భం ఒకటి కచ్చితంగా ఉంటుంది. రిమోట్‌ పనితీరు మరికొన్ని సార్లు యూజర్‌ సహనానికి పరీక్ష పెడుతుంది. అయితే ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. ఈ సమస్యపై సరైన అవగాహన లేకపోవడంతో కొంత మంది యూజర్లు రోజుల తరబడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

బ్యాటరీలు :
TV రిమోట్‌ సరిగ్గా స్పందించకపోవడానికి అందులోని బ్యాటరీలు కూడా ఒక కారణం. Low బ్యాటరీ పవర్‌ కారణంగా రిమోట్‌ సరైన పనితీరు కనబరచలేదు. కొత్త బ్యాటరీలతో ఈ సమస్యకు చెక్‌ పెట్టవచ్చు. దీంతోపాటు బ్యాటరీలను సరైన విధానంలో రిమోట్‌లో అమర్చాల్సి ఉంటుంది.

what is the reason behind TV remote lagging or not working here is the solution to fix it

రిమోట్‌ సెన్సార్‌ :
మీరు IR (ఇన్‌ఫ్రారెడ్‌) రిమోట్‌ ను వినియోగిస్తుంటే.. రిమోట్ నుంచి టీవీ సెన్సార్‌ కు సిగ్నల్‌ సరిగ్గా అందాల్సి ఉంటుంది. అందువల్ల రిమోట్‌ మరియు టీవీ సెన్సార్‌ ను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. దుమ్ము, దూళి కణాలు లేకుండా చూసుకోవాలి. శుభ్రమైన వస్త్రంతో రిమోట్‌ ముందు భాగాన్ని క్లీ్న్‌ చేసుకోవాలి.

దీంతోపాటు టీవీ సెన్సార్‌ సుమారుగా కింద వైపున ఉంటుంది. అందువల్ల ఆ ప్రాంతంలో ఎటువంటి అడ్డుంకులు లేకుండా చూసుకోవాలి. అంటే టీవీ, రిమోట్‌కు (TV Remote) మధ్యలో ఎటువంటి గ్లాస్‌ డోర్‌లు సహా ఇతర వస్తువులు లేకుండా చూసుకోవాలి. ఎటువంటి వస్తువులు లేదా అడ్డంకులు ఉంటే.. రిమోట్‌ సిగ్నల్‌ను టీవీ సెన్సార్‌ సరిగ్గా అందుకోలేదు.

బ్లూటూత్‌ డివైజ్‌లు ఉంటే :
ఇన్‌ఫ్రారెడ్‌ (IR) కు బదులుగా బ్లూటూత్‌ లేదా రేడియో ఫ్రీక్వెన్సీతో రిమోట్ పనిచేస్తుంటే మాత్రం వైర్‌లెస్‌ ఇంటర్‌ఫేస్‌ కారణంగా సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని అర్థం. మీరు ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటుంటే.. టీవీకి సమీపంలోని వైఫై రూటర్లు, బ్లూటూత్‌ స్పీకర్‌, హెడ్‌ఫోన్స్‌ను దూరంగా తరలించాలి.

టీవీ రీబూట్ :
రిమోట్‌ సరైన పనితీరు కనబరచక పోవడానికి టీవీలోని సమస్యలు కూడా కారణం. ముఖ్యంగా స్మార్ట్‌ టీవీలు బ్యాగ్రౌండ్‌ ప్రాసెస్‌ కారణంగా నెమ్మదిగా స్పందిస్తుంటాయి. అందువల్ల టీవీని క్రమం తప్పకుండా రీబూట్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల టీవీ తాత్కాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి.

టీవీని రీబూట్‌ చేసేందుకు.. పవర్‌ అవుట్‌లెట్‌ లేదా స్టెబిలైజర్‌ నుంచి టీవీని పూర్తిగా డిస్‌కనెక్ట్‌ చేయాలి. అనంతరం 30 సెకన్ల నుంచి 1 నిమిషం వరకు వేచి ఉండాలి. తర్వాత టీవీ పవర్‌ ఆన్‌ చేయాలి. ఇలా చేయడం వల్ల ఎటువంటి తాత్కాలిక సమస్యలున్నా.. ఆటోమేటిక్‌గా పరిష్కారం కానున్నాయి.

టీవీ సాఫ్ట్‌వేర్‌ :
టీవీ రిమోట్‌ స్లోగా పనిచేయడానికి టీవీ సాఫ్ట్‌వేర్‌ కూడా ఒక కారణం. టీవీ సాఫ్ట్‌వేర్‌ను క్రమం తప్పకుండా అప్‌డేట్ చేయడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు. ఇందుకోసం టీవీ సెట్టింగ్స్‌లోని సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ పైన క్లిక్‌ చేయాలి. TV సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్ సమయంలో ఇంటర్నెట్‌కు కనెక్ట్‌ చేసి ఉండాలి.

యూనివర్సల్‌ రిమోట్‌ :
టీవీ తోపాటు అందించిన రిమోట్‌ పనిచేయకుంటే.. మీ టీవీ బ్రాండ్‌కు సపోర్టు చేసే యూనివర్సల్‌ రిమోట్‌ను ఉపయోగించాలి. లేదా మొబైల్‌ యాప్‌ ద్వారా కూడా టీవీని నియంత్రించవచ్చు. సాధారణ టీవీ రిమోట్‌ కంటే మొబైల్‌ యాప్‌ ద్వారా వేగంగా టీవీని నియంత్రించవచ్చు.

చివరిగా.. :
పైన తెలిపిన చిట్కాల ద్వారా మీ సమస్యకు పరిష్కారం లభించకుంటే.. టీవీని రిసెట్‌ చేయాల్సి ఉంటుంది. ఈ ఆప్షన్‌ టీవీ సెట్టింగ్స్‌లో ఉంటుంది. టీవీ రీసెట్‌ చేస్తే.. మీరు డౌన్‌లోడ్‌ చేసిన యాప్స్‌, వైఫై పాస్‌వర్డ్‌ సహా ఇతర కస్టమ్‌ సెట్టింగ్స్ డిలీట్‌ కానున్నాయి.

FAQs
టీవీ రిమోట్‌ ఎందుకు సరిగ్గా పనిచేయడం లేదు?

బ్యాటరీలతోపాటు అనేక సమస్యలు ఉండవచ్చు. ముందుగా కొత్త బ్యాటరీలని అమర్చి చూడండి. లేకుంటే టీవీ సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌, టీవీ రీబూట్‌ వంటివి ప్రయత్నించండి.

టీవీ రిమోట్‌ పనిచేయకపోవడానికి టీవీ కూడా కారణమా?

కొన్నిసార్లు టీవీ రిమోట్‌ సరిగ్గా స్పందించకపోవడానికి టీవీ కూడా కారణం. టీవీ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ చేసుకోవడం, టీవీకి రిమోట్‌ కు మధ్య ఎటువంటి అడ్డుంకులు లేకుండా చూసుకోవాలి.

స్మార్ట్‌ఫోన్‌ ద్వారా కూడా టీవీని నియంత్రించవచ్చా..?

కొన్ని టీవీ బ్రాండ్‌ల ప్రత్యేక యాప్‌ల ద్వారా టీవీలను నియంత్రించవచ్చు.

GizBot Technology
Best Mobiles in India

English summary
what is the reason behind TV remote lagging or not working here is the solution to fix it
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X