సెకండ్‌హ్యాండ్ కెమెరా కొందామనుకుంటున్నారా..?

Posted By:

కొత్త కెమెరా తీసుకునేందుకు బడ్జెట్ సరిపోవటం లేదా.. సెకండ్ హ్యాండ్ కెమెరా తీసుకునేందుకు సుముఖంగా ఉన్నారా..?. పాత కెమెరాల కొనుగోలు విషయంలో కాస్త అవగాహన కలిగి ఆలోచనాత్మకంగా వ్యవహరించినట్లయితే డబ్బు ఆదా అవటంతో పాటు మన్నికైన కెమెరా మీ చెంతకు చేరుతుంది. ముఖ్యంగా సెకండ్‌హ్యాండ్ డిజిటల్ కెమెరాల కొనుగోలు విషయంలో తీసుకోవల్సిన జాగ్రత్తలను ఈ శీర్షిక ద్వారా మీకు పరిచయం చేస్తున్నాం..

స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించి మరిన్ని గ్యాలరీలను చూడాలనకుంటే క్లిక్ చేయండి
లింక్ అడ్రస్:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

లెన్స్ (Lens):

ముఖ్యంగా పాత కెమెరాను కొనుగోలు చేసే సమయంలో లెన్స్‌ను ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. కెమెరాలోని మిర్రర్ బాక్స్‌ను ఓపెన్ చేసి కాంటాక్ట్ పాయింట్లు సరిగ్గా ఉన్నాయోలేదో చెక్ చేసుకోండి.

ఫోకసింగ్ (Focusing):

మీరు కొనుగోలు చేసే పాత కెమెరాకు సంబంధించి ఫోకస్ రింగ్‌ను నెమ్మదిగా రొటేట్ చేస్తూ అన్ని సెట్టింగ్‌లను పరిశీలించండి.

బాడీ (Body):

కెమెరాకు బాడీ ఎంతో కీలకమైనది. దానికి సంబంధించి అన్ని అంశాలను కూలంకుషంగా పరిశీలించండి. డీఎస్ఎల్ఆర్ కెమెరాలు ప్లాస్టిక్, పెయింట్ ఇంకా లెదర్ కవర్‌లను కలిగి ఉంటాయి. మీరు కొనేది సెకండ్ హ్యాండ్ కెమెరా కాబట్టి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవటం మంచిది.

ఎల్‌సీడీ (LCD):

మీరు కొనుగోలు చేసే సెకండ్ హ్యాండ్ కెమెరాకు సంబంధించి ఎల్‌సీడీ ప్యానల్ ఇంకా క్లారిటీ‌ని ఒకటి రెండు సార్లు చెస్ చేసుకోవల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

బ్యాటరీలు (Batteries):

బ్యాటరీ విషయంలో మోసపోవద్దు. పాత కెమెరాలలో ఎక్కువ ఛార్జింగ్ సమస్యలు తలెత్తుతుంటాయి. కాబటి బ్యాటరీ వ్యవస్థ పనితీరు విషయంలో నిశితపరిశీలన అవసరం.

షట్టర్ (Shutter):

మీరు కొనుగోలు చేసే పాత కెమెరాకు సంబంధించి షట్టర్ స్పీడ్ కంట్రోల్ ఇంకా సంబంధిత సెట్టింగ్‌లను చెక్ చేయటం మరవద్దు.

ఫ్లాష్ (Flash):

మీరు ఎంపిక చేసుకునే సెకండ్ హ్యాండ్ కెమెరాలోని ఫ్లాష్ వ్యవస్థ ఏలాంటి పనితీరునిస్తుందో చెక్ చేయండి.

గ్యారంటీ (Guarantee):

మీరు కొనుగోలు చేసే కెమెరా గ్యారంటీకి సంబంధించి విక్రయదారుతో ఓ ఒప్పందం కుదర్చుకోండి. ఏదైనా సమస్య తలెత్తినట్లయితే వాపస్ ఇచ్చేట్లేగా మాట్లాడుకోవటం మంచిది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting