Power Bank కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. ఇవి మాత్రమే చూసి కొనుగోలు చేస్తే ఇబ్బంది పడతారు జాగ్రత్త!
స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు అనేక మంది పవర్ బ్యాంక్స్‌ను (power bank) కూడా కొనుగోలు చేస్తుంటారు. అయితే చాలా మంది తక్కువ ధర లేదా ఎక్కువ బ్యాటరీ సామర్థ్యం కలిగిన పవర్ బ్యాంక్స్‌ను కొనుగోలు చేస్తుంటారు. అయితే ఎక్కువ రోజులపాటు మన్నిక మరియు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు పవర్ బ్యాంకు కొనుగోలు చేసే సమయంలో కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి.
ఇటీవల కాలంలో అనేక సంస్థలు పవర్ బ్యాంక్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. అయితే కొత్తగా పవర్ బ్యాంక్స్‌ను కొనుగోలు చేసినప్పుడు వోల్టేజ్, భద్రతా ప్రామాణాలు, బ్యాటరీ రకం సహా అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

ఛార్జింగ్ సపోర్టు :
ప్రతి స్మార్ట్‌ఫోన్ కూడా కచ్చితమైన వోల్టెజ్ వద్ద ఛార్జ్ అవుతుంది. సుమారుగా 5v వద్ద ఛార్జ్ అవుతుంది అనుకుందాం. అయితే పవర్ బ్యాంక్ కొనుగోలు చేయాలని భావిస్తున్నప్పుడు మీ ఫోన్ ఛార్జింగ్ సామర్థ్యం ఎంత అనేది తెలుసుకోవాలి. మీ డివైజ్ సామర్థ్యం కంటే తక్కువ సామర్థ్యం ఉన్న పవర్ బ్యాంక్‌ను కొనుగోలు చేస్తే.. ఛార్జింగ్ వేగం చాలా తక్కువగా ఉంటుంది.
మీ ఫోన్ లేదా ఇతర డివైజ్‌లకు సరిపడా సామర్థ్యం కలిగి పవర్ బ్యాంకును ఎంచుకోవాలి. మీ డివైజ్‌కు సంబంధించిన వివరాలు సంస్థ వెబ్‌సైట్ లేదా ఫోన్ కొనుగోలు సమయంలో అందించిన పత్రాలపై ఉంటుంది. ఈ సమాచారం ఆధారంగా పవర్ బ్యాంక్ కొనుగోలు చేయడం ఉత్తమం.

భద్రతా ప్రమాణాలు :
పవర్ బ్యాంక్ కొనుగోలు చేసే సమయంలో సరైన భద్రతా ప్రమాణాలను కలిగి ఉన్నదానికి ఎంచుకోవాలి. లేకుంటే ఛార్జింగ్ సమయంలో డివైజ్ అతిగా వేడెక్కడం లేదా ప్రమాదాలు జరిగేందుకు కూడా అవకాశం ఉంటుంది. పవర్ బ్యాంక్స్ విడుదల సమయంలో అనేక సంస్థలు వాటిలోని భద్రతకు తీసుకున్న చర్యలను కూడా వెల్లడిస్తున్నాయి.
బ్యాటరీ రకం :
పవర్ బ్యాంక్స్ కొనుగోలు చేసే సమయంలో బ్యాటరీ వివరాలను కూడా తనిఖీ చేసుకోవాలి. లిథియం అయాన్ లేదా లిథియం పాలిమర్ సెల్స్ కలిగిన బ్యాటరీలతో కూడిన పవర్ బ్యాంక్స్‌ను ఎంచుకోవాలి. దీంతోపాటు పవర్ బ్యాంక్ ఛార్జింగ్ ఎంత ఉంది అని తెలిపేలా ఇండికేటర్ లు కలిగిన ఉత్పత్తులను ఎంచుకోవాలి.
ఈ వివరాల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి. కొన్ని పవర్ బ్యాంక్‌లు డివైజ్ ఫుల్ ఛార్జి అయ్యాక.. ఆటోమేటిక్‌గా ఛార్జింగ్ నిలిచిపోయేలా డిజైన్‌తో వస్తున్నాయి. మరియు అధిక వోల్టేజ్, విద్యుత్ ప్రమాదాల సమయంలో డివైజ్ డ్యామేజీ కాకుండా ప్రత్యేకమైన భద్రతా వ్యవస్థలను కలిగి ఉంటున్నాయి.
బ్యాటరీ సామర్థ్యం :
మీ ఫోన్ బ్యాటరీ సామర్థ్యానికి తగిన పవర్ బ్యాంకును ఎంచుకోవాలి. మీ ఫోన్ 5000mAh బ్యాటరీని కలిగి ఉంటే.. మీరు కొనుగోలు చేయాలని భావిస్తున్న పవర్ బ్యాంక్ కనీసం 10000mAh సామర్థ్యాన్ని కలిగి ఉండేలా చూసుకోండి. ఫలితంగా ఒకటి కంటే ఎక్కువ సార్లు ఛార్జింగ్ చేసేందుకు అవకాశం ఉంటుంది.
ఛార్జింగ్ పోర్టు రకం :
పవర్ బ్యాంక్‌లు కొనుగోలు చేసే సమయంలో పోర్టుల సంఖ్య, టైప్ కూడా పరిగణనలోకి తీసుకోవాలి. మీ పవర్ బ్యాంక్ ఏ టైప్ ఛార్జింగ్ పోర్టులను (USB-C, USB-A. లైట్నింగ్) కలిగి ఉందో చూసుకోవాలి. దీంతోపాటు ఒకటి కంటే ఎక్కువ డివైజ్‌లను ఛార్జింగ్ చేసేందుకు అవసరం అయిన పోర్టులు కలిగిన పవర్ బ్యాంక్‌లను ఎంచుకోవాలి.
BIS సర్టిఫికేషన్ :
వీటన్నింటితోపాటు బిల్ట్ క్వాలిటీని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ప్రయాణాల సమయంలోనే వీటికి ఎక్కువగా ఉపయోగిస్తారు కనుక క్వాలిటీ ప్లాస్టిక్ లేదా అల్యూమినియం కేసింగ్ కలిగిన ఉత్పత్తులను ఎంచుకోవాలి. ఫలితంగా త్వరగా డ్యామేజీ కాకుండా ఉంటాయి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ (BIS) కలిగిన ఉత్పత్తులను ఎంచుకోవాలి.


Click it and Unblock the Notifications








