కంప్యూటర్ హ్యాక్ అయిన వెంటనే ఏం చేయాలి.?

కంప్యూటింగ్ ప్రపంచాన్ని హ్యాకింగ్ భూతం బెంబేలెత్తిస్తున్న విషయం తెలిసిందే. ప్రతీకారం కోసం కొందరు.. డబ్బు కొసం మరికొందరు.. సరదా కోసం ఇంకొందరు సెక్యూరిటీ లోపాలను ఆసరాగా చేసుకుని రోజుకో సంస్థ పై విరచుకుపడి కీలక సమచారాన్ని దొంగిలిస్తున్నారు. అనుకోని పరిస్థితుల్లో మీ కంప్యూటర్ హ్యాకర్ల చేతిలో పడిందా..? మరింత నష్టం వాట్టిల్లకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలను మీకు వివరిస్తున్నాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ముందుగా కంప్యూటర్‌ను ఐసోలేట్ చేయండి

ముందుగా మీ కంప్యూటర్‌ను ఐసోలేట్ చేయండి. అంటే నెట్‌వర్క్ కేబుల్‌ను పీసీ నుంచి వేరు చేసి వై-ఫై కనెక్షన్‌ను టర్నాఫ్ చేయండి. హార్డ్‌డ్రైవ్‌ను తొలగించి వేరొక కంప్యూటర్‌లో నాన్ - బూటబుల్ డ్రైవ్ పేరుతో కనెక్ట్ చేయండి.

డ్రైవ్‌ను స్కాన్ చేయండి

మాల్వేర్ ఇంకా ఇతర వైరెసెస్ నుంచి కాపాడేందుకు డ్రైవ్‌ను స్కాన్ చేయండి.
దాడికి గురైన డ్రైవ్‌లోని ముఖ్యమైన ఫైళ్లను బ్యాకప్ చేసుకోండి.

క్లీన్ అయిన హార్డ్‌డ్రైవ్‌ను..

పూర్తిగా క్లీన్ అయిన హార్డ్‌డ్రైవ్‌ను తిరిగి మీ పాత పీసీ లేదా ల్యాప్‌టాప్‌లోకి మూవ్ చేయండి. హార్డ్‌డ్రైవ్‌ను పూర్తిగా వైప్ చేసి ఆపరేటింగ్ సిస్టంను తిరిగి లోడ్ చేసి అసవరమైన అప్‌డేట్‌లను ఇన్‌స్టాల్ చేసుకోండి.

ప్రోగ్రామ్‌లను తిరిగి రీఇన్‌స్టాల్ చేయండి..

పీసీలోని యాంటీ-వైరస్, యాంటీ-స్పైవర్ వంటి ప్రోగ్రామ్‌లను తిరిగి రీఇన్‌స్టాల్ చేయండి. బ్యాకప్ చేసుకున్న పైళ్లను తిరిగి మీ కంప్యూటర్ హార్డ్‌డ్రైవ్‌లోకి తరలించే క్రమంలో పూర్తిగా స్కాన్ చేయండి.పీసీని ఎప్పటికప్పుడు వైరస్‌ల నుంచి స్కాన్ చేసుకుంటూ హ్యాకింగ్ దాడుల నుంచి రక్షణ పొందండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
what to do if computer hacked. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting