నీటిలో తడిచిన మొబైల్ ఫోన్‌ను కాపాడుకోవటం ఏలా..?

మీ మొబైల్ ఫోన్ నీటిలో పడిందా..?, వీలైనంత త్వరగా ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసి బ్యాటరీని వేరుచేయండి. బ్యాటరీకి తేమ ఒత్తడి తగలటం కారణంగా షార్ట్ సర్క్యూట్ ఏర్పడే ప్రమాదం ఉంది. వెనువెంటనే ఏ మాత్రం ఆశ్రద్ధ చేయకుండా సమీపంలో ఉన్న సెల్‌ఫోన్ టెక్నీషియన్ వద్దకు తీసుకువెళ్లి ఫోన్‌ను పూర్తి డీఅసెంబుల్ చేయించండి. ఒకవేళ మీకే ఆ నైపుణ్యం ఉంటే ఫోన్‌ను డిఅసెంబుల్ చేసి లోని అంతర్గత భాగాల పై 60వాట్ లైట్ కాంతి ప్రసరించేలా చూడండి. వేడితో కూడిన వెళుతురును ఫోన్ లోపలి భాగల వైపు మళ్లించటం ద్వారా మధర్ బోర్డ్ తదితర చిప్‌ల క్రిందకు చేరిన తేమ ఆవిరైపోతుంది. చమ్మ పూర్తిగా ఆవిరైన అనంతరం అన్నిభాగాలను అసెంబుల్ చేసి యదావిధిగా వాడుకోవచ్చు.
ఫోన్ బ్యాటరీ చార్జింగ్ ఎక్కువ కాలం నిలవాలంటే..?
మొబైల్ ఫోన్‌కు బ్యాటరీ గుండెకాయ అయితే, చార్జర్ ఆక్సిజన్ లాంటిది. ఈ రెండింటిలో ఏది సరిగా స్పందించకున్నా.. ఫోన్ మనుగడ కష్టతరమవుతోంది. అయితే, కొన్ని చిట్కాలను పాటించటం ద్వారా బ్యాటరీ బ్యాకప్ మెరుగుపడటంతో బ్యాటరీ జీవిత కాలం రెట్టింపవుతుంది.
ఇవిగోండి చిట్కాలు:
- సాధ్యమైనంత వరకు బ్యాటరీ చార్జింగ్ లెవ్సల్స్ జీరో స్థాయికి చేరుకున్నతరువాత రీచార్జ్ ప్రకియ మొదలుపెట్టండి. ఈ చర్య బ్యాటరీ జీవిత కాలాన్ని రెట్టింపు చేస్తుంది.
- బ్యాటరీని ఎప్పటికప్పడు క్లీన్ చేసుకోవాలి.
- బ్లూటూత్ అదేవిధంగా 3జీ రిసీవర్ కనెక్షన్‌లను అవసరం మేరకు ఉపయోగించుకోవాలి. అవసరం లేని సమయంలో వాటిని ఆఫ్ చేయటం ఉత్తమం.
- బ్యాటరీ శక్తిని అధిక మొత్తంలో సేవించే మీడియా అప్లికేషన్‌లను మితంగా వాడుకోండి.
- అనవసర సౌండ్స్ అదేవిధంగా వైబ్రేషన్‌లను డిసేబుల్ చేయండి.
- స్ర్కీన్ సేవర్‌లను అధికంగా ఉపయోగించకండి, అలాగే ఫోన్ బ్రైట్‌నెస్, బ్యాక్ లైటింగ్‌ను తగ్గించుకోండి.
- ఫోన్‌కాల్స్‌కు బుదులుగా టెక్స్ట్ సందేశాలను పంపుకోండి.
- ఫోన్‌తో ఉపయోగం లేదనుకున్న సమయంలో టర్న్ ఆఫ్ చేయటం మంచిది.


Click it and Unblock the Notifications








