WhatsApp గ్రూప్ నోటిఫికేషన్లను మ్యూట్ చేయడం ఎలా?

|

కరోనా వైరస్ కోవిడ్ -19 కారణంగా ప్రస్తుతం దేశం మొత్తం లాక్‌డౌన్‌ను అనుసరిస్తున్నందున ఇప్పుడు ఫోన్ కాల్స్, మెసేజెస్ మరియు ఇతర చాట్ల కమ్యూనికేషన్ కోసం వాట్సాప్ ప్లాట్‌ఫాం ముఖ్య భూమికగా మారింది. వాట్సాప్ గ్రూపులలో సాధారణంగా స్వీకరించే మెసేజ్ల మొత్తాన్ని కూడా పెంచింది. కొంత మందికి కొన్ని సార్లు ఈ మెసేజ్ లు రావడం కాస్త బాధించే విధంగా కూడా ఉంటాయి.

WhatsApp Group Notifications Mute and UnMute Process Step by Step

ఇటువంటి వారి కోసం వాట్సాప్ ఒక ప్రత్యేక ఫీచర్ ను కలిగి ఉంది. ఇది వినియోగదారులకు కొంత సమయం వరకు గ్రూప్ నోటిఫికేషన్లను మ్యూట్ చేయడానికి మరియు అన్‌మ్యూట్ చేయడానికి అనుమతిస్తుంది. గ్రూప్ నోటిఫికేషన్లను మ్యూట్ చేసిన తర్వాత కూడా మీకు మెసేజ్లు కూడా అందుతాయి. అయితే ఫోన్ వైబ్రేట్ అవ్వదు లేదా నోటిఫికేషన్ టోన్‌ ప్లే కాదు. వాస్తవానికి ఇది నోటిఫికేషన్ ప్యానెల్‌లో కూడా చూపబడదు.

WhatsApp Group Notifications Mute and UnMute Process Step by Step

అనుసరించాల్సిన దశలు

*** వాట్సాప్ ఓపెన్ చేసి మ్యూట్ చేయవలసిన గ్రూప్ చాట్‌ కోసం స్క్రోల్ చేయండి.

*** గ్రూప్ పేరు మీద ఎక్కువసేపు నొక్కి ఉంచండి. అప్పుడు అందులో కనిపించే 'మ్యూట్' గుర్తును ఎంచుకోండి.

*** ప్రత్యామ్నాయంగా మీరు గ్రూప్ చాట్‌ను ఓపెన్ చేసి తరువాత మూడు ఐకాన్‌లపై నొక్కండి. తరువాత మ్యూట్ నోటిఫికేషన్ ఎంపికను ఎంచుకోవచ్చు.

*** ఇప్పుడు మీరు గ్రూప్ నోటిఫికేషన్‌లను మ్యూట్‌లో ఉంచాలనుకుంటే 'OK' బటన్ మీద నొక్కండి.

అలాగే గ్రూప్ నోటిఫికేషన్‌లను అన్‌మ్యూట్ చేయడానికి గ్రూప్ చాట్‌కు వెళ్లి కుడివైపు ఎగువ మూలలో గల మూడు చుక్కలపై నొక్కండి మరియు నోటిఫికేషన్‌లను అన్‌మ్యూట్ చేయండి.

WhatsApp Group Notifications Mute and UnMute Process Step by Step

*** ఐఫోన్ వినియోగదారులు చాట్స్ ట్యాబ్ నుండి గ్రూప్ యొక్క ఎడమ వైపుకు స్వైప్ చేసి అందులో 'మోర్' ఎంపిక మీద నొక్కండి.

*** ఇక్కడ మ్యూట్ ఎంపికపై నొక్కండి.

*** గ్రూప్ నోటిఫికేషన్‌లను అన్‌మ్యూట్ చేయడానికి కూడా మ్యూట్ పద్దతిని పునరావృతం చేసి చివరిగా అన్‌మ్యూట్ ఎంపికను ఎంచుకోండి.

Best Mobiles in India

English summary
WhatsApp Group Notifications Mute and UnMute Process Step by Step

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X