మీ వాట్సాప్ చాటింగ్ హిస్టరీని సింగిల్ క్లిక్‌తో పొందాలంటే..?

వాట్సాప్‌ను ఫేస్‌బుక్ కొనుగోలు చేసిన నాటి నుంచి ఈ ఇన్‌స్టెంట్ మెసెజింగ్ యాప్‌లో భారీ మార్పులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. క్రమం తప్పకుండా కొత్త ఫీచర్లను లాంచ్ చేస్తూ వాట్సాప్ తన యూజర్లకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది.

మీ వాట్సాప్ చాటింగ్ హిస్టరీని సింగిల్ క్లిక్‌తో పొందాలంటే..?

Read More : బ్రాండెడ్ హోమ్‌ థియేటర్‌, రూ.2,959కే!

ఇటీవల వాట్సాప్ తన ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్ల కోసం message search option అనే కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సెర్చ్ ఫీచర్ ద్వారా మీ వాట్సాప్ చాటింగ్ హిస్టరీని సింగిల్ క్లిక్‌తో తెలుసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్టెప్ 1

ముందుగా ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి లేటెస్ట్ వర్షన్ వాట్సాప్ యాప్‌ను తమ ఫోన్‌లలో ఇన్‌స్టాల్ చేసుకోవల్సి ఉంటుంది.

స్టెప్ 2

మీ వాట్సాప్ అకౌంట్‌ను లెటస్ట్ వర్షన్‌కు అప్‌డేట్ చేసిన తరువాత చాట్ విండో టాప్ రైటర్ కార్నర్‌లో కనిపించే సెర్చ్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.

స్టెప్ 3

ఆ సెర్చ్ బార్‌లో మీరు చాటింగ్‌లో ఎక్కువ ఉపయోగించే సెంటెన్స్ లేదా పదాన్ని టైప్ చేయండి.

స్టెప్ 4

ఇప్పుడు మీరు టైప్ చేసిన పదాలతో ఉన్న చాటింగ్ హిస్టరీ స్ర్కీన్ పై ప్రత్యేక్షమవుతుంది. వాటిలో మీకు కావల్సిన హిస్టరీ రిజల్ట్‌ను పొందవచ్చు. ఒకవేళ మీరు చాటింగ్ హిస్టరీని ఎప్పటికప్పడు డిలీట్ చేస్తున్నట్లయితే పాత రిజల్ట్స్ కనిపించవు. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
WhatsApp Guide: 4 Easy Steps to Get Chat History of All Contacts in a Single Click. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot