వాట్సప్ కాల్ వెయిటింగ్ ఫీచర్, ఇలా డౌన్లోడ్ చేయండి

By Gizbot Bureau
|

ప్రముఖ సోషల్ మీడియా చాటింగ్ యాప్ వాట్సప్ ఆండ్రాయిడ్ వినియోగదారులకు కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది . ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగించేవారికి కొత్తగా కాల్ వెయిటింగ్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. కాలింగ్ ఫీచర్‌లో సరికొత్త అప్డేట్‌ను తీసుకువచ్చింది. ఈ ఫీచర్ అందుబాటులోకి రావాలంటే వాట్సప్‌ను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుందని యాజమాన్యం చెప్పింది. దీన్ని అప్‌డేట్ చేసుకుంటే రెగ్యులర్ ఫోన్‌ కాల్స్‌లో ఎలాగైతే కాల్ వెయిటింగ్ వస్తుందో వాట్సప్‌లో కూడా వీడియో కాలింగ్ లేదా వాయిస్ కాలింగ్ చేస్తున్న సమయంలో కాల్ వెయిటింగ్ వస్తుందని యాజమాన్యం చెప్పింది.

వాట్సప్ కాల్ లో మాట్లాడుతున్నప్పుడు
 

ఇప్పటివరకూ వాట్సప్‌లో కాల్ మాట్లాడుతున్నప్పుడు వేరొకరు కాల్ చేస్తే కాల్ కట్ అయిపోయేది. తరువాత మిస్ కాల్ చూసుకుని తిరిగి అవతలి వారికి కాల్ చేయాల్సి వచ్చేది.ఇక ఆ ఇబ్బంది లేకుండా కొత్త ఫీచర్ ప్రవేశ పెట్టింది వాట్సప్. ఇకపై వాట్సప్ కాల్ లో మాట్లాడుతున్నప్పుడు వేరే ఎవరైనా కాల్ చేస్తే ఆ కాల్ వినియోగదారులకు స్క్రీన్ పై కనిపిస్తుంది. దానిని బట్టి కొత్తగా కాల్ చేస్తున్న వారితో మాట్లాడాలంటే వెంటనే ఆ కాల్ కి ఆన్సర్ చేయొచ్చు. మామూలు కాల్ మాట్లాడుతున్నప్పుడు కాల్ వెయిటింగ్ ఆప్షన్ వస్తుంది. మనం ముందుగా మాట్లాడుతున్నా వారిని హోల్డ్ లో ఉంచి కొత్త వారితో మాట్లాడి.. తిరిగి పాత కాల్ మాట్లాడొచ్చు.

కొత్తగా వచ్చిన కాల్ మాట్లాడాలంటే

కానీ, వాట్సప్ కాల్ వెయిటింగ్ అశం ఇస్తున్నా.. ఇందులో కొత్తగా వచ్చిన కాల్ మాట్లాడాలంటే అప్పటివరకూ మనం మాట్లాడుతున్నా కాల్ కట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మనం కొత్తగా వస్తున్నా కాల్ మాట్లాడాలని అనుకోక పొతే ఆ కాల్ కట్ చేసే అవకాశం ఉంటుంది.

గూగుల్ ప్లే స్లోర్ లో..

ఈ కొత్త వాట్సప్ ఫీచర్ ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంది. ఈ కొత్త కాల్ వెయిటిం ఆప్షన్ వాట్సప్ వెర్షన్ 2.19.352 ఆండ్రాయిడ్ యాప్, 2.19.357, 2.19.358 ఆండ్రాయిడ్ బేటా యాప్ లలో ఇంస్టాల్ చేసుకోవచ్చు. ఇప్పటికే దీనికి సంబంధించిన అప్డేట్ వినియోగదారులకు వాట్సప్ పంపించింది. ఒక వేళ మీరు ఇంకా దానిని అందుకోలేకపోయి ఉంటే..https://www.apkmirror.com/apk/whatsapp-inc/whatsapp/whatsapp-2-19-352-release/ ఈ లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేసుకుని ఇంస్టాల్ చేసుకోవచ్చు

రెండు ఆప్సన్లు
 

ఈ ఫీచర్ ను ఇంస్టాల్ చేసుకున్న తరువాత వాట్సప్ కాల్ మాట్లాడుతుండగా ఏదైనా కాల్ మనకి వస్తే స్క్రీన్ పై కాల్ వెయిటింగ్ అశం కనిపిస్తుంది. ఇందులో రెండు అషన్లు వస్తాయి. ఒకటి decline రెండోది end and accept. ఈ రెండు అప్షన్లలో మనకు కావలసింది ఎంచుకోవచ్చు. decline ఆప్షన్ ఎంచుకుంటే కొత్తగా కాల్ చేస్తున్న వారి కాల్ కట్ అయిపోతుంది. రెండో ఆప్షన్ end and accept ఎంచుకుంటే పాత కాల్ కట్ అయి కొత్త కాల్ కి కనెక్ట్ అవ్వవచ్చు.

Most Read Articles
Best Mobiles in India

English summary
WhatsApp new feature: Get call waiting facility on Android phones

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X