WhatsApp స్టేటస్‌లను ఎటువంటి థర్డ్-పార్టీ అప్లికేషన్ లేకుండా డౌన్‌లోడ్ చేయడం ఎలా?

|

వాట్సాప్ అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రపంచం మొత్తం మీద ఉన్న తమ ప్రియమైన వారిని సులభంగా పలకరించగలుగుతున్నారు. వాట్సాప్ కొత్త ఫీచర్లను అందిస్తూ 2017లో స్టేటస్ ఫీచర్‌ని అధికారికంగా ప్రకటించింది. వాట్సాప్ అప్లికేషన్‌లో ఈ ఫీచర్ అధిక ప్రాముఖ్యతను సంతరించుకుంది. వాట్సాప్ స్టేటస్ ఫీచర్ ద్వారా వినియోగదారులు ఫోటోలు మరియు వీడియోలను వాట్సాప్‌లో వారి స్నేహితులతో పంచుకోవడానికి అనుమతిస్తుంది.

WhatsApp Status Download Process Step by Step an Without Any Extra App

వాట్సాప్ యాప్‌ యొక్క స్టేటస్ లో పంచుకున్న ఫోటోలు మరియు వీడియోలు మీ పరికరంలో తాత్కాలికంగా స్టోర్ చేయబడతాయి. తరువాత 24 గంటల వ్యవధి తర్వాత స్వయంచాలకంగా తొలగించబడతాయి. అయితే ఏ థర్డ్-పార్టీ అప్లికేషన్ లేకుండానే మీ ఫోన్‌లో ఈ వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఒక మార్గం ఉంది. అది ఎలాగో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వాట్సాప్ స్టేటస్‌లను మీ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకునే విధానం

WhatsApp Status Download Process Step by Step an Without Any Extra App

** వాట్సాప్ స్టేటస్‌లను డౌన్‌లోడ్ చేసుకోవడం కోసం ముందుగా మీ ఫోన్‌లో ఫైల్స్ మేనేజర్ యాప్ ఉందని నిర్ధారించుకోండి. అది అందుబాటులో లేకుంటే కనుక మీరు 'ప్లే స్టోర్' నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
** ఫైల్స్ (ఫైల్ మేనేజర్) అప్లికేషన్‌ను ఓపెన్ చేయండి.
** ఎగువ కుడివైపు హాంబర్గర్ మెనుకి వెళ్లి సెట్టింగ్‌ల ఎంపికపై క్లిక్ చేయండి.
** సెట్టింగ్స్ ఎంపికలో "షో హిడెన్ ఫైల్స్" ఎంపికను కనుగొనడానికి క్రిందికి స్క్రోల్ చేసి దాన్ని టోగుల్ చేయండి.

WhatsApp Status Download Process Step by Step an Without Any Extra App

** తర్వాత ఫైల్స్ యాప్ యొక్క మెయిన్ పేజీకి తిరిగి వెళ్లి 'ఇంటర్నల్ స్టోరేజ్' ఎంపిక కోసం చూడండి.
** క్రింది ఎంపికల జాబితాలో "Android" ఎంపిక కోసం చూడండి.
** తరువాత "మీడియా" ఎంపికపై క్లిక్ చేయండి.
** దానిని అనుసరించి మీరు వాటిలో వివిధ యాప్‌ల డేటా యొక్క పేర్ల జాబితాను చూస్తారు.
** వాట్సాప్ పేరుతో ఉన్నదానిపై క్లిక్ చేసి కింది ఫోల్డర్‌ను ఓపెన్ చేయండి.
** తరువాత అందులో కనిపించే "మీడియా" ఎంపికను ఎంచుకోండి.
** తరువాత జాబితాలో కనిపించే "స్టేటస్" ఎంపిక మీద క్లిక్ చేయండి.
** క్రింది పేజీలో మీరు ఇటీవల చూసిన అన్ని స్టేటస్‌లను చూడవచ్చు.
** తరువాత మీకు నచ్చిన మరియు డౌన్‌లోడ్ చేయాలనుకుంటున్న దానిపై క్లిక్ చేయండి.
** కుడివైపు ఎగువన ఉన్న మూడు-చుక్కల మెనుపై క్లిక్ చేసి 'మూవ్ టు' ఎంపికను ఎంచుకొని ఇంటర్నల్ స్టోరేజ్ ను ఎంచుకోండి.
** మీరు దాన్ని గూగుల్ క్లౌడ్ లేదా ఏదైనా ఇతర యాప్ ద్వారా కూడా షేర్ చేయవచ్చు మరియు స్టోర్ చేయవచ్చు.

Best Mobiles in India

English summary
WhatsApp Status Download Process Step by Step an Without Any Extra App

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X