WhatsApp Tips: వాట్సాప్‌లో మెసేజ్ లను ఎక్కువగా ఎవరికి పంపారో తెలుసుకోవడం ఎలా?
ఫేస్‌బుక్ యాజమాన్యంలోని సోషల్ మెసేజింగ్ సర్వీస్ వాట్సాప్ ఇటీవల నెలవారీ రెండు బిలియన్ల క్రియాశీల వినియోగదారులను అధిగమించింది. మీరు ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నప్పటి నుంచి వాట్సాప్‌ను వినియోగిస్తూ ఉంటారు. మీరు వాట్సాప్ ద్వారా చాలా మందిని ఫ్రెండ్స్ గా పొంది ఉంటారు.

వాట్సాప్ పరిచయాలతో ఎవరితో ఎలా కమ్యూనికేట్ అవుతున్నారో తెలుసుకోవాలని కుతూహలత ఉంటుంది.ప్రజలు తమ నచ్చిన ప్రత్యేకమైన వారితో వాట్సాప్‌లో ఎలా కమ్యూనికేట్ తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వాట్సాప్ కాంటాక్ట్
మీరు మీ యొక్క ఫోన్ లో వాట్సాప్‌ను వినియోగిస్తూ ఉంటే కనుక మీ కాంటాక్ట్ లలో మీరు మీ ఫ్రెండ్స్ తో ఎన్ని మెసేజ్లను మార్పిడి చేసుకున్నారో తెలుసుకోవచ్చు. మీరు మీ ఫ్రెండ్స్ లలో ఎవరికి ఎక్కువ మెసేజ్ లను పంపారో తెలుసుకోవడానికి చక్కని ట్రిక్ ఉంది. ఇది నిజమైన మీ బెస్ట్ ఫ్రెండ్ మరియు మీ భాగస్వామి ఎవరో కూడా తెలుసుకోవడానికి మంచి మార్గం. ఈ ఎంపికతో మీరు మీ జీవితంలో అత్యంత ప్రత్యేకమైన వ్యక్తులతో ఎన్ని సందేశాలు, ఫోటోలు, GIF లు, వీడియోలు మరియు వాయిస్ నోట్లను మార్పిడి చేసుకున్నారో తెలుసుకోవచ్చు.

వాట్సాప్‌లో మెసేజ్ లను ఎక్కువగా ఎవరికి పంపారో తెలుసుకోనే దశలు
స్టెప్ 1: మీ ఐఫోన్ లేదా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్‌ను ఓపెన్ చేయండి.
స్టెప్ 2: వాట్సాప్ స్క్రీన్ యొక్క కుడివైపు ఎగువ మూలలో ఉన్న మూడు చుక్కలను నొక్కి అందులోని సెట్టింగులను ఎంచుకోండి.
స్టెప్ 3: తదుపరి దశ డేటా మరియు స్టోరేజ్ వినియోగానికి వెళ్లడం.
స్టెప్ 4: ఇప్పుడు స్టోరేజ్ వినియోగంపై క్లిక్ చేయండి. ఇది నెట్‌వర్క్ వినియోగ ఎంపిక క్రింద ఉంటుంది.

మీరు స్టోరేజ్ వినియోగ పేజీకి వెళ్ళినప్పుడు మీరు మీ వాట్సాప్ పరిచయాలు మరియు సమూహాల పూర్తి జాబితాను చూస్తారు. మీరు ఎక్కువ మెసేజ్లను పంపిన వ్యక్తిని కూడా పేజీ చూపిస్తుంది. ఈ డేటా జాబితా ఫోన్ యొక్క స్టోరేజ్ ద్వారా ర్యాంక్ చేయబడుతుంది. అగ్రస్థానంలో ఉన్న వ్యక్తికి తప్పనిసరిగా మీరు ఎక్కువ మెసేజ్లను పంపి ఉంటారు. మీరు అత్యధిక సంఖ్యలో ఫోటోలు మరియు వీడియోలను పంపిన వ్యక్తి ఖచ్చితంగా మొదటి స్థానంలో ఉన్న వ్యక్తి. మీరు వాట్సాప్‌లో స్నేహితులు అయినప్పటి నుండి మీరు వారితో ఎన్ని మెసేజ్లను మార్పిడి చేశారో తెలుసుకోవడానికి మీరు కాంటాక్ట్ పేరుపై నొక్కడం ద్వారా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.


Click it and Unblock the Notifications