వాట్సాప్ లో తెలియని గ్రూపులకు జోడించకుండా నిరోధించే చిట్కాలు...

|

WhatsApp ప్రపంచం మొత్తం మీద మిలియన్ల మంది వినియోగదారులకు ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లలో ఉచితముగా సర్వీసులను అందించే వాటిలో వాట్సాప్ ఒకటి. వినియోగదారులు తక్షణ మెసేజ్ యాప్ కి కట్టుబడి ఉండటానికి మరొక కారణం ఏమిటంటే తరచూ అప్‌డేట్ చేయడం మరియు ప్రతిసారీ కొత్త ఫీచర్‌లను జోడించడం. కొత్త ఫీచర్లు విలువైనవి కావున వాటిని ప్రయత్నించడంలో ఎటువంటి తప్పు లేదు. అయితే వాట్సాప్‌లో కొన్ని బాధించే అంశాలు కూడా ఉన్నాయి. వాటిలో ఒకటి మిమ్మల్ని అనవసరమైన గ్రూపులకు జోడించడం. ఇందులో మరి చెత్త భాగం ఏమిటంటే మీకు తెలియని గ్రూపులకు జోడించబడినప్పుడు మీరు నివారించలేని మెసేజ్ లు వరదలా వస్తూ ఉంటాయి.

WhatsApp Tips: How to Stop Unknown Users From Adding WhatsApp Groups

ఇటువంటి వాటితో మీరు బాధపడుతూ ఉంటే కనుక మెసేజ్ లను రాకుండా నిరోధించడానికి ఒక మార్గం ఉంది. మీరు ఈ అనవసరమైన గ్రూపుల నుండి చాలా మర్యాదగా నిష్క్రమించడానికి మార్గం కోసం చూస్తున్నట్లయితే కనుక కింద తెలిపే సాధారణ దశలను అనుసరించండి.

తెలియని వాట్సాప్ గ్రూపులకు మిమ్మల్ని జోడించకుండా యూజర్‌లను ఆపే విధానం

వాట్సాప్ సెట్టింగ్‌లలో సరళమైన పరిష్కారాలను కలిగి ఉంది. ఇది తెలియని వాట్సాప్ గ్రూపులకు జోడించబడకుండా మిమ్మల్ని కాపాడుతుంది. సెట్టింగ్‌లలో ప్రైవసీ విభాగంలో ఈ సర్దుబాటు అందుబాటులో ఉంది. గ్రూపులలో మీ నంబర్‌ను ఎవరు జోడించవచ్చో అనుకూలీకరించడానికి ఈ సెట్టింగ్స్ మిమ్మల్ని అనుమతిస్తుంది.

స్టెప్ 1- మీ వాట్సాప్ అకౌంటును ఓపెన్ చేయండి. తరువాత కుడివైపు ఎగువ మూలలో ఉన్న మూడు చుక్కలపై నొక్కండి.

స్టెప్ 2- తర్వాత సెట్టింగ్‌లకు వెళ్లి లాక్ ఫర్ అకౌంట్ ఎంపిక కోసం చూడండి.

స్టెప్ 3- అకౌంట్ ఎంపిక మీద ఒకసారి నొక్కితే దాని కింద మీకు ప్రైవసీ విభాగం కనిపిస్తుంది.

స్టెప్ 4- తరువాత ఇందులో గ్రూప్ ఎంపికను ఎంచుకుని ఆపై మూడు చుక్కల ఎంపికలలో -'అందరూ', 'నా కాంటాక్ట్‌లు' మరియు 'నా కాంటాక్ట్‌లు మినహా ఏవైనా ఎంచుకోండి.' డిఫాల్ట్ సెట్టింగ్ అందరికీ సెట్ చేయబడింది.

WhatsApp Tips: How to Stop Unknown Users From Adding WhatsApp Groups

ఇందులో మీ ప్రాధాన్యత ప్రకారం వాటిని ఎంచుకోండి. ఇది మీరు చేరడానికి ఇష్టపడని గ్రూపులకు మిమ్మల్ని తెలియని వ్యక్తులు జోడించకుండా మీరు నివారించవచ్చు. ముఖ్యంగా, 'మై కాంటాక్ట్' ఆప్షన్ మిమ్మల్ని కాంటాక్ట్ లిస్ట్‌లో సేవ్ చేసిన నంబర్‌లను గ్రూపుల్లో చేర్చడానికి మాత్రమే వినియోగదారులను అనుమతిస్తుంది.

Best Mobiles in India

English summary
WhatsApp Tips: How to Stop Unknown Users From Adding WhatsApp Groups

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X