Home
How to

స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నెట్ లేకుండా వాట్సాప్ వెబ్‌ను ఉపయోగించడం ఎలా?

ప్రస్తుత కాలంలో ఒకరితో మరొకరు టెక్స్ట్ మెసేజ్, వాయిస్ మరియు వీడియో కాల్ ద్వారా కనెక్ట్ అవ్వడానికి ఉపయోంచే అత్యంత ప్రజాదరణ పొందిన కమ్యూనికేషన్ మాధ్యమాలలో WhatsApp ఒకటి. కుటుంబసభ్యులు, స్నేహితులు మరియు సహోద్యోగులతో అన్నివేళలా కనెక్ట్ అయి ఉండటానికి ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ఈ మెసేజింగ్ యాప్‌ని ఉపయోగిస్తున్నారు. మల్టీ-డివైస్ బీటా ప్రోగ్రామ్ కారణంగా వినియోగదారులు ఇప్పుడు వారి మొబైల్‌ల నుండి మాత్రమే కాకుండా వెబ్, డెస్క్‌టాప్ మరియు పోర్టల్ నుండి కూడా WhatsAppని యాక్సెస్ చేయవచ్చు.

WhatsApp Web Using Process Step by Step Without Internet on Smartphone

వాట్సాప్ సంస్థ ఇప్పుడు ఒక అడుగు ముందుకు వేసి తమ యొక్క వినియోగదారులు ఇప్పుడు తమ స్మార్ట్‌ఫోన్ ఇంటర్నెట్‌కు కనెక్ట్ కానప్పటికీ వారి డెస్క్‌టాప్‌లో ఈ మెసేజ్ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించడానికి అవకాశం ఇస్తోంది. ఈ కొత్త ఫీచర్ ఒక ఫోన్‌కి కనీసం నాలుగు పరికరాలను లింక్ చేయగల మద్దతును ఇవ్వగలదు. అయినప్పటికీ ప్రధాన పరికరం 14 రోజులకు పైగా డిస్‌కనెక్ట్ చేయబడితే కనుక లింక్ చేయబడిన పరికరాలు స్వయంచాలకంగా లాగ్ అవుట్ చేయబడతాయి. WhatsApp యొక్క మాతృ సంస్థ Meta ఈ ఫీచర్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌కు మద్దతు ఇస్తుందని ధృవీకరించింది. అంటే మీ అన్ని వ్యక్తిగత మెసేజ్లు, మీడియా మరియు కాల్‌లు ప్రైవేట్‌గా ఉంటాయి.

స్మార్ట్‌ఫోన్ లేకుండా వాట్సాప్ వెబ్‌ను ఎలా ఉపయోగించాలి?

WhatsApp Web Using Process Step by Step Without Internet on Smartphone

** ప్రారంభ దశలో మీ పరికరాన్ని వెబ్, డెస్క్‌టాప్ లేదా పోర్టల్‌కి లింక్ చేయండి, ఆ తర్వాత మీరు దీన్ని స్మార్ట్‌ఫోన్ లేకుండానే ఉపయోగించగలరు.

** మీ ఫోన్‌లో WhatsApp ను ఓపెన్ చేసి స్క్రీన్ కుడివైపు ఎగువ మూలలో ఉన్న మూడు చుక్కల చిహ్నంపై నొక్కండి.

** 'లింక్డ్ డివైస్' పై నొక్కండి. ఆపై 'మల్టీ-డివైస్ బీటా'పై మళ్లీ నొక్కండి. వాట్సాప్ ఫీచర్‌ను వివరించే పేజీని ప్రదర్శిస్తుంది.

** 'జాయిన్ బీటా' బటన్‌పై నొక్కండి మరియు 'కొనసాగించు' బటన్‌ను నొక్కండి. QR కోడ్‌ని స్కాన్ చేయడం ద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌ను WhatsApp వెబ్‌కి లింక్ చేయవచ్చు.

గమనిక:

** వాట్సాప్ యొక్క చాలా పాత వెర్షన్‌ని ఉపయోగిస్తున్న పరికరాలకు ఈ ఫీచర్ మద్దతు ఇవ్వదు.

** కొన్ని ఫీచర్‌లు ఈ లింక్ చేయబడిన సహచర పరికరాలలో పని చేయవు. ఉదాహరణకు సహచర పరికరాలలో లైవ్ లొకేషన్ ను వీక్షించవచ్చు.

Best Mobiles in India

English summary
How to Use WhatsApp Web Without Internet on Your Smartphone
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X