WhatsApp వెబ్ ద్వారా వీడియో కాల్ చేయడం ఎలా?

|

ప్రపంచంలోని సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ లలో అత్యంత ప్రాచుర్యం పొందిన వాటిలో వాట్సాప్ మొదటి స్థానంలో ఉంది. వాట్సాప్ యాప్ మెసేజ్ల కోసమే కాకుండా వాయిస్ కాలింగ్ మరియు వీడియో కాలింగ్ కోసం కూడా అత్యంత ప్రాచుర్యం పొందింది. వాట్సాప్ యూజర్లు ఇందులో వీడియో కాలింగ్ ను ఉచితంగా చేయడానికి కావలసిందల్లా ఇంటర్నెట్ కనెక్షన్ మాత్రమే. ఇందులో మరొక గొప్పదనం ఏమిటంటే వాట్సాప్ వెబ్ వీడియో కాల్ కూడా ప్రస్తుతం చేయడానికి అనుమతిని ఇస్తున్నది. వాట్సాప్‌ వెబ్ ద్వారా వీడియో కాల్స్ ఎలా చేయాలో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 
WhatsApp Web Video Call: Using WhatsApp web How to Make a video call

వాట్సాప్ వెబ్ వీడియో కాల్ చేసే విధానం

 

వాట్సాప్ వెబ్ ద్వారా వీడియో కాల్ లను చేయడానికి కింద ఉన్న ఈ దశలను అనుసరించండి.

స్టెప్ 1: వాట్సాప్ వెబ్ ఓపెన్ చేసి మీ యొక్క అకౌంటుతో లాగిన్ అవ్వండి.

స్టెప్ 2: ఎడమవైపు పై భాగంలో గల నిలువు మూడు-చుక్కల చిహ్నాన్ని నొక్కండి. ఇందులో 'క్రీయేట్ రూమ్' క్లిక్ చేయండి.

స్టెప్ 3: పాప్-అప్‌లో మెసెంజర్‌లో కొనసాగించు నొక్కడం ద్వారా ముందుకు సాగండి. గమనిక ఇది పనిచేయడానికి మీకు ఫేస్ బుక్ అకౌంట్ అవసరం లేదు.

WhatsApp Web Video Call: Using WhatsApp web How to Make a video call

స్టెప్ 4: ఇప్పుడు క్రీయేట్ రూమ్ ను సృష్టించండి. దీని తరువాత వీడియో కాల్ ప్రారంభించడానికి సిద్ధంగా ఉంటుంది.

స్టెప్ 5: వాట్సాప్‌లో వీడియో కాల్ లింక్‌ను ఇతరులతో షేర్ చేసుకొండి.

స్టెప్ 6: నిర్దిష్ట కాంటాక్ట్ నెంబర్ లేదా గ్రూపులో రూమ్ ని సృష్టించడానికి ఆ చాట్ విండోను ఓపెన్ చేసి అటాచ్మెంట్ చిహ్నాన్ని నొక్కండి.

Best Mobiles in India

English summary
WhatsApp Web Video Call: Using WhatsApp web How to Make a video call

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X