smartphone బ్యాట‌రీ బ్లాస్ట్‌.. జ‌ర‌గ‌కూడ‌దంటే ఇలా చేయండి!

|

నేటి కాలంలో ప్రతి ఒక్కరూ అనేక ర‌కాల అత్యాధునిక smartphone ల‌ను వినియోగించ‌డానికి ఎంతో ఆస‌క్తి చూపుతున్నారు. ప్ర‌పంచంలో ఏ మూల‌న ఎక్క‌డ, ఎప్పుడు ఏం జ‌రుగుతుంద‌నే విష‌యాన్ని అర‌చేతిలో ఉండే smartphone ద్వారా తెలుసుకోవ‌చ్చు. త‌ద్వారా ప్రజల జీవితం సులభతరం అవుతుంది.. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్ల‌తో ఓ ప్ర‌మాదం కూడా ఉంది. అదేంటంటే.. చాలా మందికి smartphone ఛార్జింగ్ విష‌యంలో అవ‌గాహ‌న లేదు. ఇష్టం వ‌చ్చిన‌ట్లు ఛార్జ్ చేయ‌డం ద్వారా బ్యాట‌రీలు పేలిపోయే ప్ర‌మాదాలు కూడా ఉంటాయి. ఇలాంటి ఘ‌ట‌న‌లు నిత్యం మ‌నం ఎన్నో చూస్తున్నాం కూడా. అయితే, బ్యాట‌రీ ప్ర‌మాదాల్ని నివారించ‌డానికి చిన్న చిన్న ఛార్జింగ్‌ చిట్కాలు పాటిస్తే స‌రిపోతుంది.

Battery blast

ఉదాహ‌ర‌ణ‌కు, చాలా మంది మొబైల్ యూజ‌ర్లు తరచుగా రాత్రిపూట ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు ఫోన్‌ని ఉపయోగిస్తుంటారు. మరియు వారు నిద్రపోయేటప్పుడు ఫోన్‌ను ఛార్జింగ్‌లో ఉంచుతారు, తద్వారా ఉదయం వరకు ఫోన్ ఫుల్ ఛార్జ్ అవుతుంది. కానీ, ఇలాంటి ప‌ద్ద‌తులు ఫోన్ బ్యాట‌రీ ప్ర‌మాదాలకు దారి తీస్తాయి. అయితే, ఇప్పుడు మ‌నం చ‌ర్చించ‌బోయే చిట్కాల ద్వారా అలాంటి ప్ర‌మాదాల్ని నివారించ‌వ‌చ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రాత్రిపూట మొబైల్‌ని ఛార్జ్‌లో ఉంచవద్దు:

రాత్రిపూట మొబైల్‌ని ఛార్జ్‌లో ఉంచవద్దు:

బ్యాట‌రీ ఛార్జింగ్ భ‌ద్ర‌త‌లో ముఖ్యంగా మీరు పాటించాల్సిన మొద‌టి నియమం ఏంటంటే.. smartphone ను రాత్రి పూట వినియోగించే స‌మ‌యంలో ఎట్టి ప‌రిస్థితుల్లో ఛార్జ్ చేయ‌వ‌ద్దు. మీరు కూడా మొబైల్‌ను రాత్రిపూట ఛార్జ్‌లో ఉంచినట్లయితే, అలా చేయడం మానేయండి, ఎందుకంటే అది మీ మొబైల్ బ్యాటరీని పాడు చేస్తుంది. త‌ద్వారా డివైజ్ వేడెక్కి ఫోన్ యొక్క బ్యాటరీ ఎప్పుడైనా పేలే అవ‌కాశం ఉంటుంది. అలా మీకు ప్రాణాపాయం స్థితికి తీసుకురావ‌చ్చు.

లోకల్ ఛార్జర్:

లోకల్ ఛార్జర్:

మీరు మీ smartphone ను ఛార్జ్ చేయడానికి లోకల్ ఛార్జర్‌ని ఉపయోగిస్తుంటే, జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు ఫోన్ ఛార్జ్ కోసం కంపెనీ నుంచి అందించే ఛార్జ‌ర్‌నే ఉపయోగించాలి. ఇది కాకుండా, లోక‌ల్ ఛార్జ‌ర్‌ల‌ను వినియోగించ‌డం ద్వారా మీ మొబైల్ ఫోన్ యొక్క బ్యాటరీ చెడిపోయే అవ‌కాశం ఉంటుంది. మీరు స్థానిక బ్యాటరీని ఉపయోగించడం గురించి ఆలోచిస్తుంటే, దానిని ప‌క్క‌న పెట్టేసేయండి. ఎందుకంటే లోకల్ ఛార్జ‌ర్లు క్వాలిటీ త‌క్కువ‌గా ఉంటాయి. త‌ద్వారా ఆ బ్యాటరీని ఉపయోగించడం వల్ల మొబైల్ బ్లాస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.

మీ కంపెనీ ఛార్జర్‌ను ఇతరులతో పంచుకోవద్దు:

మీ కంపెనీ ఛార్జర్‌ను ఇతరులతో పంచుకోవద్దు:

వినియోగ‌దారులు తమ smartphone ఛార్జర్‌ను ఇతరులతో కూడా పంచుకోవడం తరచుగా మ‌నం చూస్తుంటాం. ఇలా చేయకూడదు, ఇది ఛార్జర్‌ను పాడు చేస్తుంది. కానీ అది పాడైపోయిన తర్వాత, అది మీ స్మార్ట్‌ఫోన్ బ్యాట‌రీని కూడా పాడుచేయడం ప్రారంభిస్తుంది. కాబట్టి మీరు ఎల్లప్పుడూ మీ స్వంత స్మార్ట్‌ఫోన్‌ను ఛార్జ్ చేయడానికి మీ కంపెనీ ఛార్జర్‌ను ఉపయోగించాలి. మరియు మీ కంపెనీ ఛార్జ‌ర్‌ను ఇతరులకు ఇవ్వకూడదు.

బ్యాటరీని పదే పదే ఛార్జ్ చేయవద్దు:

బ్యాటరీని పదే పదే ఛార్జ్ చేయవద్దు:

కొంత‌మంది smartphone వినియోగ‌దారులు త‌మ ఫోన్‌ను అదే ప‌నిగా ఛార్జింగ్ పెడుతుంటారు. కేవ‌లం 10శాతం లేదా 20 శాతం త‌గ్గిన వెంట‌నే మ‌ళ్లీ ఫుల్ ఛార్జ్ చేసే ప్ర‌య‌త్నం చేస్తుంటారు. అలా ఫోన్‌ని పదే పదే చార్జింగ్ చేయడం వల్ల బ్యాటరీపై ఒత్తిడి పెరుగుతుందని స్మార్ట్‌ఫోన్ నిపుణులు పేర్కొంటున్నారు. కాబట్టి ఫోన్‌లో బ్యాటరీ 20 శాతం లేదా అంతకంటే తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఛార్జ్‌లో పెట్టాలని గుర్తుంచుకోండి. ఇలా చేయడం వల్ల బ్యాటరీపై ఒత్తిడి ఉండదు, బ్యాటరీ త్వరగా చెడిపోదు.

ఫోన్ వేడెక్కిన‌ప్పుడు అస‌లు వినియోగించ‌వ‌ద్దు:

ఫోన్ వేడెక్కిన‌ప్పుడు అస‌లు వినియోగించ‌వ‌ద్దు:

ఛార్జింగ్ ప‌ద్ద‌తుల్ని ప‌క్క‌న పెడితే.. మొబైల్ వినియోగ‌దారులు ముఖ్యంగా గుర్తుంచుకోవ‌ల్సిన విష‌యం మ‌రొక‌టి ఉంది. అదేంటంటే.. యూజ‌ర్లు త‌మ ఫోన్ల‌ను ఎక్కువ‌గా హీట్ ఎక్కిన‌ప్పుడు కొద్ది సేపు వినియోగించ‌క‌పోవ‌డం మంచిది. బాగా వేడి ఎక్కిన‌పుడు ఫోన్‌ను కాసేపు స్విచ్ ఆఫ్ చేసి మ‌ళ్లీ చ‌ల్ల‌బ‌డిన త‌ర్వాత ఆన్ చేసి ఉప‌యోగించ‌డం శ్రేయ‌స్క‌రం. లేదంటే.. ప్ర‌మాదం జ‌రిగే అవ‌కాశాలు ఉంటాయి. మీరు ఈ కొన్ని సాధారణ చిట్కాలతో మీ స్మార్ట్‌ఫోన్ పాడవకుండా కాపాడుకోవచ్చు. మీరు ఈ విషయాలను గుర్తుంచుకోవాలి.

Best Mobiles in India

English summary
Why does a smartphone explode? You can save your phone with these easy tips

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X