ఫాస్ట్ ఛార్జర్‌లను ఉపయోగిస్తున్నా.. ఫోన్ ఛార్జింగ్ చాలా స్లోగా ఉంటోందా.. కారణం ఇదే..!
మీ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గినట్లు మీకు ఎప్పుడైనా అనిపించిందా.. ముఖ్యంగా వేసవి కాలంలో ఇలా ఎక్కువసార్లు జరుగుతున్నట్లు మీకు అనిపిస్తోందా.. దీనికి సరైన కారణాలు తెలియక ఆందోళన చెందుతున్నారా..? వేసవి కాలం మనుషులపైనా కాకుండా స్మార్ట్‌ఫోన్‌లపైనా ప్రభావం చూపుతుంది. మనుషులు ఎక్కువ వేడి, ఎక్కువ చలిని కూడా తట్టుకోలేరు. అదే విధంగా స్మార్ట్‌ఫోన్ కూడా కొన్ని ఉష్ణోగ్రతల్లో మెరుగైన పనితీరును కనబరచలేదు.
ఫాస్ట్ ఛార్జింగ్ కారణంగా :
ప్రస్తుతం అందుబాటులోకి వస్తున్న అనేక స్మార్ట్‌ఫోన్ లు ఫాస్ట్ ఛార్జింగ్ (Smartphone Charging) సపోర్టును కలిగి ఉంటున్నాయి. అంటే తక్కువ సమయంలోనే బ్యాటరీ ఫుల్ అవుతుంది. ఫాస్ట్ ఛార్జింగ్ కారణంగా బ్యాటరీ పనితీరుపై దీర్ఘకాలంలో ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతోపాటు ఫాస్ట్ ఛార్జింగ్ సమయంలో ఫోన్ కూడా వేడెక్కుతుంది.

కచ్చితమైన కారణాలు తెలియక :
అయితే వేసవి కాలంలో మీరు ఫాస్ట్ ఛార్జర్‌ను ఉపయోగించినా.. ఛార్జింగ్ వేగం మాత్రం చాలా స్లో గా ఉంటుంది. అయితే కారణంలా తెలియక.. ఛార్జర్, ఫోన్ లో లోపం ఉందని చాలా మంది భావిస్తుంటారు. అయితే ఇందుకు కచ్చితమైన కారణాలు తెలియక యూజర్లు ఆందోళన చెందుతుంటారు.
ఫోన్ ఛార్జింగ్ సమయంలో వేడెక్కుతుంది. వేసవి కాలంలో ఇలా ఎక్కువ సార్లు జరుగుతుంటుంది. ఇలాంటి సమయంలో ఛార్జింగ్ చేస్తే ఫోన్ మరింత వేడెక్కే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో ఫోన్‌లోని కొన్ని భాగాలు డ్యామేజీ అయ్యే అవకాశం ఉంటుంది. మరియు ఫోన్ బ్యాటరీ పనితీరు తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ వేడి మరీ అధికంగా ఉంటే.. ఫోన్ పేలిపోయే ప్రమాదం ఉంటుంది.
ఇలా ఫోన్ వేడెక్కిన సమయంలో ఛార్జింగ్ వేగాన్ని స్మార్ట్‌ఫోన్ లోని ఛార్జింగ్ వేగాన్ని ప్రత్యేక మెకానిజం తగ్గిస్తుంది. ఫోన్ సాధారణ ఉష్ణోగ్రతకు వచ్చేంత వరకు ఛార్జింగ్ వేగం తక్కువగా ఉండేలా చూస్తుంది. ఇలా పనిచేస్తేందుకు స్మార్ట్‌ఫోన్ ల తయారీ సమయాల్లోనే ప్రత్యేక సెన్సార్‌లను అమర్చుతారు.
ఈ విషయంపై అవగాహన లేకపోవడం కారణంగా చాలా మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఛార్జింగ్ వేగం తగ్గిపోయిందంటూ ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. దీంతోపాటు వేసవిలో స్మార్ట్‌ఫోన్ ను వినియోగించే సమయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
అధిక ఉష్ణోగ్రతతోపాటు బ్యాటరీ సరైన కండిషన్‌లో లేకున్నా.. స్లోగా ఛార్జింగ్ అవుతుంది. ముఖ్యంగా పాత స్మార్ట్‌ఫోన్ లో బ్యాటరీ సరైన కండిషన్‌లో ఉండే అవకాశం లేదు. ఇలాంటి సమయంలో ఛార్జింగ్ వేగం కూడా తగ్గుతుంది. బ్యాటరీ సరైన కండిషన్ లో లేకుంటే ఫోన్ మెరుగైన పనితీరు కనబరిచే అవకాశం ఉండదు.
ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ యూజర్‌లు మరో కీలక అంశాన్ని గుర్తుంచుకోవాలి. స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసిన సమయాల్లో సంస్థలు అందించిన ఛార్జర్‌లను మాత్రమే వినియోగించాలి. ఇతర సంస్థల ఛార్జర్లు కూడా ఫోన్ ఛార్జింగ్ స్పీడ్ పై ప్రభావం చూపుతాయి. మరియు ఫోన్ వేడెక్కేందుకు కారణమవుతాయి.
స్మార్ట్‌ఫోన్ యూజర్లు కచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు :
* సంస్థలు అందించే ఛార్జర్‌లను మాత్రమే ఉపయోగించాలి.
* స్మార్ట్‌ఫోన్ వేడెక్కినా.. అదే పనిగా వినియోగించకుండా కాసేపు ఫోన్‌ను పక్కన పెట్టాలి.
* ఫోన్ బ్యాటరీ ఛార్జింగ్ 30 శాతం ఉన్నప్పుడే ఛార్జింగ్ చేయాలి. ఛార్జింగ్ 10 శాతం కంటే తక్కువ వచ్చేంత వరకు ఉపయోగించకూడదు.
* కొంత మంది వ్యక్తులు రాత్రంతా ఫోన్‌ను ఛార్జింగ్ పెట్టి వదిలేస్తుంటారు. ఇలాంటి సమయాల్లో ఫోన్ పేలిపోయే ప్రమాదం ఉంటుంది.
* తడిగా ఉన్న ఫోన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఛార్జింగ్ చేసేందుకు ప్రయత్నం చేయకూడదు.


Click it and Unblock the Notifications








