Home
How to

Smartphone Overheating స్మార్ట్‌ఫోన్‌ తరచూ వేడెక్కుతోందా.. కారణాలు ఏంటో తెలుసా..!

భారత్‌ లో స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం పెరుగుతోంది. గతంలో కేవలం కాలింగ్‌ కోసం మాత్రమే ఫోన్లు ఉపయోగించారు. ప్రస్తుతం బ్రౌజింగ్‌, సోషల్‌ మీడియా, బ్యాంకింగ్‌ సహా అనేక విధాలుగా వినియోగిస్తున్నారు. ఫోన్‌ ను వినియోగిస్తున్న క్రమంగా అనేక సమస్యలు ఎదురవుతుంటాయి. అందులో ఫోన్‌ వేడెక్కడం ఒకటి.

స్మార్ట్‌ఫోన్‌ వేడెక్కేందుకు (Smartphone Overheating) అనేక కారణాలు ఉంటాయి. వేసవి కాలంలో ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే సరైన అవగాహన లేకపోవడం వల్ల యూజర్లు ఇలాంటి సమయాల్లో ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఫోన్‌ వేడెక్కకుండా చూసుకోవచ్చు.

why smartphone overheats

స్మార్ట్‌ఫోన్‌ తరచూ వేడెక్కుతుంటే.. పనితీరుపై ప్రభావం పడుతుంది. దీంతోపాటు ఫోన్‌లోని అంతర్గత భాగాలు కూడా దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. దీంతోపాటు బ్యాటరీ పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కొన్ని సార్లు ఫోన్‌ పేలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది.

ఛార్జింగ్‌ సమయంలో :
స్మార్ట్‌ఫోన్‌ల ఛార్జింగ్‌ సమయంలో సాధారణంగా వేడెక్కుతుంటాయి. ముఖ్యంగా సంస్థ అందించిన ఛార్జర్‌లు కాకుండా ఇతర ఛార్జర్‌లను వినియోగిస్తుంటే ఈ ప్రభావం అధికంగా ఉంటుంది. దీంతోపాటు అధిక బ్రైట్‌నెస్‌ తో ఫోన్‌ ను ఉపయోగిస్తున్నా.. త్వరగా వేడెక్కుతుంది.

గేమింగ్‌ :
ఎక్కువ సమయం గేమింగ్‌ కోసం ఉపయోగిస్తున్నా లేదా మల్టీ టాస్కింగ్‌ సమయంలోనూ ఫోన్ వేడెక్కేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ వేడిని నియంత్రించేందుకు ఇటీవల వస్తున్న అనేక ఫోన్‌లు VC కూలింగ్ ఛాంబర్లను కలిగి ఉంటున్నాయి.

సూర్యకాంతి పడుతున్నా :
స్మార్ట్‌ఫోన్‌పై నేరుగా సూర్యకాంతి పడుతున్నా.. త్వరగా వేడెక్కేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. దీంతో ఫోన్‌ను అప్‌డేట్‌ చేయకుండా వినియోగిస్తున్నా.. మాల్‌వేర్‌ ఉన్నా, బగ్స్‌ కారణంగానూ ఫోన్‌ వేడెక్కుతుంది. దీంతోపాటు చాలా మంది యూజర్లు వైఫై, బ్లూటూత్‌, GPS ఆన్‌ చేసి అలానే వదిలేస్తుంటారు. అలాంటి సందర్భాల్లోనూ ఫోన్‌ వేడెక్కుతుంది.

స్మార్ట్‌ఫోన్‌ లో వివిధ అవసరాల కోసం వివిధ రకాల యాప్‌లను ఇన్‌స్టాల్‌ చేస్తుంటాం. అనంతరం యాప్‌లను డిలీట్‌ చేయడం మర్చిపోతుంటాం. అలాంటి యాప్‌ల కారణంగా ర్యామ్‌, స్టోరేజీపై ప్రభావం చూపుతాయి. ఇలాంటి సందర్భాలోనూ ఫోన్‌ వేడెక్కుతుంది.

ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి:
> స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థలు అందించిన ఛార్జర్‌లను మాత్రమే వినియోగించాలి.
> తక్కువ డిస్‌ప్లే బ్రైట్‌నెస్‌ తో ఫోన్‌ ను ఉపయోగించాలి.
> సూర్యకాంతి నేరుగా ఫోన్‌ పై పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
> అవసరం లేని సమయాల్లో వైఫై, బ్లూటూత్‌, GPS ను ఆఫ్‌ చేసుకోవాలి.
> ఫోన్‌ ను ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకోవాలి. ఫలితంగా బగ్స్‌ వంటి సమస్యలు తొలగిపోతాయి.

Take a Poll

ఫోన్‌ వేడెక్కుతున్నా.. అదే పనిగా వినియోగించకుండా కాసేపు విరామం ఇవ్వాలి. ఫోన్‌ కేస్‌ తీసివేయాలి. లేకుంటే కాసేపు ఫోన్‌ ను స్విచ్‌ ఆఫ్‌ చేయడం లేదా ఫ్లైట్‌ మోడ్‌ ఆన్‌ చేయడం వల్ల, త్వరగా చల్లబడుతుంది. అయితే ఫోన్‌ అధికంగా వేడెక్కుతూ, బ్యాటరీ ఉబ్బినట్లు ఉంటే మాత్రం, ఫోన్‌ ను వెంటనే ఆఫ్‌ చేసి, సర్వీస్‌ సెంటర్‌ కు తీసుకెళ్లి మరమ్మతులు చేయించాలి.

More from GizBot

Best Mobiles in India

English summary
why smartphone overheats and how to fix it here is the guide in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X