mAadhaar యాప్ ఉంటే మీకు ఆధార్ కార్డుతో పనిలేదు

By Gizbot Bureau
|

యూఐడీఏఐ ఎంఆధార్ యాప్‌ను మార్కెట్‌లో లాంచ్ చేసింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు ఈ యాప్ అందుబాటులో ఉంది. గూగుల్ ప్లేస్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి ఈ యాప్‌ను ఉచితంగానే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.ఈ యాప్ ఉంటే మీకు ఆధార్ కార్డు అవపరం లేదు. ఎందుకంటే మీ వ్యక్తిగత వివరాలన్నీ ఇందులో సేవ్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కడికెళ్లినా దీని సహాయంతో మీరు ఇతరులకు చూపించవచ్చు. ఎంఆధార్ యాప్‌తో ఆధార్ వినియోగదారులు ఎన్నో రకాల ప్రయోజనాలు పొందొచ్చు.

ఆధార్ అప్‌డేట్

ఆధార్ కార్డును దీని ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డు కనిపించకుండాపోతే, లేదంటే పాడైపోయింటే రిప్రింట్ కోసం రిక్వెస్ట్ ఇవ్వొచ్చు. దీని కోసం రూ.50 చెల్లించాల్సి ఉంటుంది. ఇంకా ఆన్‌లైన్‌లోనే అడ్రస్‌ను అప్‌డేట్ చేసుకోవచ్చు. పేపర్‌లెస్ ఆఫ్‌లైన్ ఇకేవైసీ పూర్తి చేయొచ్చు. క్యూఆర్ కోడ్ స్కానర్ కూడా ఉంది. వర్చువల్ ఐడీని నేరుగా క్రియేట్ చేసుకోవచ్చు. క్యూఆర్ కోడ్ కూడా జనరేట్ చేసుకోవచ్చు.

మరిన్నిప్రయోజనాలు

ఆధార్ వెరిఫై చేసుకోవచ్చు. ఈమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్‌ను కూడా వెరిఫై చేసుకోవచ్చు. అలాగే ఈఐడీ, యూఐడీ తిరిగి పొందొచ్చు. ఆధార్ అప్‌డేట్ హిస్టరీ చూసుకోవచ్చు. అడ్రస్ వాలిడేషన్ లెటర్‌‌ కోసం రిక్వెస్ట్ పెట్టొచ్చు. ఆధార్ వివరాలను లాక్ చేసుకోవచ్చు. అలాగే ఆన్‌లాక్ కూడా చేసుకోవచ్చు. ఆధార్ బయోమెట్రిక్స్‌ కూడా ఇదే వర్తిస్తుంది. ఎన్‌రోల్‌మెంట్ సెంటర్ ఎక్కడుంతో తెలుసుకోవచ్చు. ఆధార్ అప్‌డేట్ స్టేటస్‌ కూడా చూడొచ్చు.

సీక్రెట్

ఒకవేళ మీ ఆధార్ వివరాలను ఎవరైనా చట్టవిరుద్ధంగా మీ అనుమతి లేకుండా ఉపయోగించారని భావిస్తే.. అప్పుడు యాప్‌లోని అథంటికేషన్ హిస్టరీకి వెళ్లి మీ ఆధార్ వివరాలు ఎక్కడ ఉపయోగించారో తెలుసుకోవచ్చు. యాప్ నుంచే మీ ఆధార్ వివరాలను డైరెక్ట్‌గా ఇతరుకు పంపొచ్చు. ఆధార్ లాక్ ఓపెన్ చేయాలంటే వర్చువల్ ఐడీ అవసరం. కాబట్టి దీన్ని గుర్తు పెట్టుకోవాలి. ఒకవేళ ఈ ఐడీని మరిచిపోతే 1947కు మెసేజ్ పంపడం వల్ల తిరిగి పొందొచ్చు. ఆర్‌వీఐడీ అని టైపు చేసి ఆధార్ నెంబర్‌లోని చివరి 4 అంకెలను ఎంటర్ చేయాలి. తర్వాత దీన్ని 1947కు ఎస్ఎంఎస్ పంపాలి. ఇప్పుడు మీ వర్చువల్ ఐడీ మీకు వస్తుంది.

ఉపయోగించడం ఎలా ? 

యాప్‌ను ఉపయోగించాలని భావిస్తే ముందుగా డౌన్‌లోడ్ చేసుకోవాలి. తర్వాత మొబైల్ నెంబర్‌ను వెరిఫై చేసుకోవలసి ఉంటుంది. తర్వాత ఆధార్ కార్డును రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత వెరిఫై చేసుకోవాలి. దీని కోసం యాప్‌లో రిజిస్టర్ యువర్ ఆధార్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేయాలి. దీంతో మీ ఆధార్ నెంబర్‌ యాప్‌తో లింక్ అవుతుంది. దీంతో ఫోన్‌లోకి మీ ఆధార్ కార్డు వచ్చేస్తుంది.

Best Mobiles in India

Read more about:
English summary
With mAadhaar app, you can leave your Aadhaar card at home; Here’s how

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X