బ్లాగ్‌ అనే పదం ఎలా వచ్చింది.. ఆర్ఎస్ఎస్ అంటే ఏంటి..?

Posted By:

బ్లాగ్‌ అనే పదం ‘వెబ్‌లాగ్‌' అనే పదం నుంచి పుట్టింది. 1997లో జార్న్‌ బార్జర్‌ తొలిసారిగా వెబ్‌లాగ్‌ అనే పదాన్ని వాడాడు. దాన్నే 1999లో పీటర్‌ మెర్వోల్జ్‌ అనే అతను వెబ్‌లాగ్‌ అనే పదంలో చిన్నప్రయోగం చేశాడు. WEB LOG' ను WE BLOG'గా విడగొ ట్టాడు. తరువాత క్రమంలో BLOGగా మారింది. 2003 నాటికి నిఘంటువుల్లో వెబ్‌లాగ్‌ అనే పదం చేరిపోయింది. బ్లాగ్‌కు వన్నె తెచ్చింది మాత్రం డేవ్‌వైనర్‌. ఈయన బ్లాగ్‌లకోసం ఏకంగా ఒక సర్వర్‌నే నెలకొల్పాడు. 2004లో స్పెయిన్‌లో బ్లాగ్‌ వాడకం ఎక్కువై వెలుగులోకి వచ్చింది. ప్రధాన స్రవంతిలో ఒక భాగమైపోయింది. నేడు వివిధ ప్రపంచ భాషల్లో బ్లాగ్‌లు నడుస్తు న్నాయి. ప్రతి ఆరునెలల‌కి వీటి సంఖ్య రెట్టింపు అవుతోందట. అందుకే బ్లాగ్‌నెట్‌జనుల జీవితంలో ఒక భాగమైపోయింది.

బ్లాగ్‌ అనే పదం ఎలా  వచ్చింది..ఆర్ఎస్ఎస్ అంటే ఏంటి..?

ఆర్ఎస్ఎస్ అంటే..?

RSS అంటే రియల్లీ సింపుల్ సిండికేషన్ అన్నమాట. బ్లాగ్ ఎంట్రీస్, న్యూస్ హెడ్ లైన్స్, ఆడియో, వీడియో లాంటి వాటిని ఓ స్టాండర్డ్ ఫార్మెట్‌లో ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ని ఫీడ్స్ రూపంలో అందించడం కోసం రూపోందించినవే RSS ఫీడ్స్. ఈ RSS ఫీడ్స్ వల్ల మనకు నచ్చిన టాపిక్ కి సంబంధించిన RSS ఫీడ్స్ ని వెతకటానికి http://ctrlq.org/ అనే సైట్ ఉపయోగపడుతుంది. వివిధ బ్లాగులు, సైట్ల కు సంబంధించిన ఫీడ్స్ ని సెర్చ్ చెయ్యవచ్చు, సెర్చ్ చేసిన తర్వాత ఫీడ్ కంటెంట్ ప్రివ్యూ ని కూడా అక్కడే చూడవచ్చు, దాంతో నచ్చిన దానిని సబ్ స్క్రైబ్ చేసుకోవచ్చు. గూగుల్ అడ్వాన్స్డ్ సెర్చ్ ఆపరేటర్స్‌ని ఇక్కడ ఉపయోగించవచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot