Xiaomi ఫోన్ల డార్క్ థీమ్ సమస్యను Dailyhunt App కు పరిష్కరించడం ఎలా ?

By Maheswara
|

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్మార్ట్ ఫోన్ బ్రాండ్‌లలో Xiaomi ఒకటి. వేలాది మంది వినియోగదారులు Xiaomi మరియు దాని ఉప-బ్రాండ్‌ లు అయిన Redmi మరియు Poco పరికరాలను ఉపయోగిస్తున్నారు. Xiaomi యొక్క MIUI OS డార్క్ థీమ్ లేదా డార్క్ మోడ్‌తో సహా అనేక ప్రత్యేక లక్షణాలను అందిస్తుంది. అయినప్పటికీ, Xiaomi, Redmi లేదా Poco ఫోన్‌లలోని డార్క్ థీమ్ ప్రముఖ Dailyhunt యాప్‌తో సహా ఇతర యాప్‌లను ప్రభావితం చేస్తున్నట్లు కనిపిస్తోంది.

How To Fix Dark Theme On Dailyhunt App On Your Xiaomi Phone?

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన మరియు విస్తృతంగా ఉపయోగించే యాప్‌లలో Dailyhunt యాప్ ఒకటి. ఈ యాప్ కొన్ని తాజా అప్‌డేట్‌లను అందిస్తుంది. మరియు మీరు వీటిని సులభంగా యాక్సెస్ చేయవచ్చు. మీరు మీ Mi, Poco లేదా Redmi ఫోన్‌లో Dailyhunt యాప్‌ని ఉపయోగిస్తుంటే, మీరు కొంత అసౌకర్యాన్ని గమనించి ఉంటారు. ఇతర బ్రాండ్‌ల ఫోన్‌లలో కూడా ఇలా జరుగుతూ ఉండవచ్చు. చింతించకండి, కొన్ని సులభమైన స్టెప్ లతో ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు.ఈ క్రింది సూచనలు పాటించండి.

Dailyhunt యాప్‌లో Xiaomi డార్క్ థీమ్‌ను ఎలా పరిష్కరించాలి?

Step 1: మీ ఫోన్‌లో Settings యాప్‌ను తెరవండి > Display ను ఎంచుకోండి.

How To Fix Dark Theme On Dailyhunt App On Your Xiaomi Phone?

Step 2: ఇప్పుడు, ఇచ్చిన ఆప్షన్ ల నుండి Dark Mode పై నొక్కండి.

How To Fix Dark Theme On Dailyhunt App On Your Xiaomi Phone?

Step 3: పూర్తయిన తర్వాత, మీరు ఇప్పుడు 'More Dark mode options' పై నొక్కవచ్చు. ఇది ఆటోమేటిక్ గా డార్క్ మోడ్‌కి మారిన అన్ని యాప్‌ల లిస్ట్ ను అందిస్తుంది.

How To Fix Dark Theme On Dailyhunt App On Your Xiaomi Phone?

Step 4: ఇక్కడ డార్క్ మోడ్‌ని స్విచ్ ఆఫ్ చేయడానికి Dailyhunt యాప్ టోగుల్ బటన్‌ను నొక్కకండి.

How To Fix Dark Theme On Dailyhunt App On Your Xiaomi Phone?

అంతే పూర్తి అయింది! ఇది Dailyhunt యాప్‌తో మీరు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరిస్తుంది, జనాదరణ పొందిన వార్తల యాప్‌తో మరింత ఆనందించడానికి మరియు అన్వేషించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఆండ్రాయిడ్‌లో ప్రవేశపెట్టిన అత్యంత ప్రజాదరణ పొందిన ఫీచర్లలో డార్క్ థీమ్ ఒకటి. గతంలో, కొన్ని యాప్‌లు మాన్యువల్‌గా ఆన్ చేయాల్సిన డార్క్ మోడ్ ఫీచర్‌ను తీసుకొచ్చాయి.

ఇప్పుడు, మీ ఫోన్ కోసం డార్క్ థీమ్‌ను ఆన్ చేయడం చాలా సులభం మరియు ఇది అన్ని యాప్‌లకు కూడా అప్లై చేయవచ్చు. ఆండ్రాయిడ్‌లోని డార్క్ థీమ్ ఇప్పటికీ కొంచెం సమస్యాత్మకంగా ఉండవచ్చు, ఇది వినియోగదారు అనుభవానికి ఆటంకం కలిగిస్తుంది. మీరు అలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే, మీరు ఈ సూచనలతో వాటిని సులభంగా పరిష్కరించవచ్చు మరియు మీకు ఇష్టమైన యాప్‌లను ఆస్వాదించడాన్ని కొనసాగించవచ్చు.

Best Mobiles in India

English summary
How To Fix Dark Theme On Dailyhunt App On Your Xiaomi Phone?

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X