షావోమి నుంచి స్మార్ట్‌వాచ్‌లు వచ్చేస్తున్నాయ్!

చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి తన సబ్సిడరీ బ్రాండ్ అయిన Huamiని ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది.

|

చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమి తన సబ్సిడరీ బ్రాండ్ అయిన Huamiని ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈ బ్రాండ్ క్రింద తన అమేజ్‌ఫిట్ స్మార్ట్‌వాచీలను షావోమి విక్రయించబోతునట్లు తెలుస్తోంది. జాలై 24న జరిగే ఈ లాంచ్ కార్యక్రమంలో అమేజ్‌ఫిట్ బిప్ (Amazfit Bip), స్ట్రాటోస్ (Stratos) పేర్లతో రెండు సరికొత్త స్మార్ట్ వాచీలను షావోమి లాంచ్ చేయబోతున్నట్లు కంపెనీ విడుదల చేసిన ట్వీట్ ద్వారా తెలుస్తోంది.

అతి త్వరలో మార్కెట్లోకి రాబోతున్న సామ్‌సంగ్ ఫోల్డింగ్ ఫోన్స్అతి త్వరలో మార్కెట్లోకి రాబోతున్న సామ్‌సంగ్ ఫోల్డింగ్ ఫోన్స్

ఆండ్రాయిడ్ అలానే ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టంలను సపోర్ట్ చేస్తాయి..

ఆండ్రాయిడ్ అలానే ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టంలను సపోర్ట్ చేస్తాయి..

ఈ స్మార్ట్‌వాచ్‌లు ఆండ్రాయిడ్ అలానే ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టంలను సపోర్ట్ చేయగలుగుతాయట. వాస్తవానికి ఈ రెండు స్మార్ట్‌వాచ్‌లను ఫిబ్రవరి 2018లోనే షావోమి లాంచ్ చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో అమేజ్‌ఫిట్ బిప్ మోడల్ ధర 99 డాలర్లుగాను (ఇండియన్ కెరెన్సీలో రూ.6,800), అమేజ్‌ఫిట్ స్ట్రాటోస్ మోడల్ ధర 199.99 డాలర్లుగాను (ఇండియన్ కరెన్సీలో రూ.13,600)గాను ఉంది. వీటిలో అమేజ్‌ఫిట్ స్ట్రాటోస్ గుండ్రటి డయల్‌తో వస్తోంది.

Amazfit Bip స్పెసిఫికేషన్స్..

Amazfit Bip స్పెసిఫికేషన్స్..

స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చేసరికి అమేజ్‌ఫిట్ బిప్ మోడల్ 1.28 అంగుళాల ఆల్వేస్ ఆన్ కలర్ డిస్‌ప్లే (176x176పిక్సల్స్)ను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లేను కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటక్ట్ చేస్తుంది. ఐపీ68 రేటింగ్‌తో వస్తోన్న ఈ వాచ్ డస్ట్ అలానే వాటర్ ప్రూఫ్ సామర్థ్యాలను కలిగి ఉంది. ఈ వాచ్‌లో నిక్షిప్తం చేసిన హార్ట్‌రేట్ సెన్సార్ ద్వారా గుండె పనితీరును ఎప్పటికప్పడు చెక్ చేసుకునే వీలుంటుంది. ఈ వాచ్‌లో ఏర్పాటు చేసిన 190ఎమ్ఏహెచ్ బ్యాటరీ సింగిల్ ఛార్జ్ పై నాలుగు నెలల (వాచ్ మోడ్‌లో) బ్యాకప్‌ను అందించగలుగుతుందట.

Amazfit Stratos స్పెసిఫికేషన్స్..

Amazfit Stratos స్పెసిఫికేషన్స్..

ఇక అమేజ్‌ఫిట్ స్ట్రాటోస్ విషయానికి వచ్చేసరికి ఈ వాచ్ 1.34 అంగుళాల ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే (300x320పిక్సల్స్)ను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లేను కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటక్ట్ చేస్తుంది. ఐపీ68 రేటింగ్‌తో వస్తోన్న ఈ వాచ్ డస్ట్ అలానే వాటర్ ప్రూఫ్ సామర్థ్యాలను కలిగి ఉంటుంది. 512ఎంబి ర్యామ్‌తో పాటు 1.2GHz డ్యుయల్-కోర్ ప్రాసెసర్‌ను వాచ్ లో నిక్షిప్తం చేసారు.

ఎల్టీఈ కనెక్టివిటీ సపోర్ట్..

ఎల్టీఈ కనెక్టివిటీ సపోర్ట్..

బ్లుటూత్ అలానే ఎల్టీఈ కనెక్టివిటీలను అమేజ్‌ఫిట్ స్ట్రాటోస్ వాచ్ సపోర్ట్ చేస్తుంది. ఇదే సమయంలో యాంబియంట్ లైట్, గైరోస్కోప్, ఎయిర్ ప్రెజర్ వంటి సెన్సార్స్‌ను కూడా ఈ వాచ్ కలిగి ఉంది. వాచ్‌లో అమర్చిన 290ఎమ్ఏహెచ్ బ్యాటరీ సింగిల్ ఛార్జ్ పై 5 రోజల బ్యాకప్‌ను అందించగలుగుతుందట.

Best Mobiles in India

Read more about:
English summary
Chinese smartphone maker Xiaomi’s sub-brand Huami is also set to enter the Indian market. The company is all set to bring its Amazfit smartwatches in the country.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X