Home
How to

జీమెయిల్ నిండిపోయిందా.. ఈ సింపుల్ ట్రిక్‌తో ఒక్క నిమిషంలో సమస్యకు చెక్!

Gmail Full: మీ జీమెయిల్ (Gmail) అవసరం లేని ఈమెయిల్స్‌తో నిండిపోయిందా, మీరు ఒక్కరే కాదు ఇది జీమెయిల్ యూజర్లందరూ ఫేస్ చేసే సమస్యే. ప్రమోషనల్ ఈమెయిల్స్, న్యూస్‌లెటర్లు, రసీదులు, అప్‌డేట్లు.. ఇలాంటివన్నీ పేరుకుపోయి ఉంటాయి. జీమెయిల్ ఫ్రీగా ఇచ్చే 15GB స్టోరేజ్ జీమెయిల్, గూగుల్ డ్రైవ్, గూగుల్ ఫొటోస్ మూడింటికీ కలిపి ఉంటుంది. అందుకే అది చాలా తొందరగా నిండిపోతుంది.

గూగుల్ కొంత డబ్బులకు మంచి స్టోరేజ్ ప్లాన్స్ ఇస్తున్నా, మన మెయిల్‌బాక్స్ మాత్రం చిందరవందరగా ఉంటుంది. ఒక్కొక్క ఈమెయిల్ డిలీట్ చేసుకుంటూ కూర్చుంటే మాత్రం చాలా టైమ్ పడుతుంది. అలా కాకుండా, మీ జీమెయిల్‌ని ఫాస్ట్‌గా క్లియర్ చేయడానికి ఈ ఈజీ స్టెప్స్ ఫాలో అవ్వండి.

Your Gmail is Full  Then Fix the Issue

* మార్కెటింగ్ ఈ-మెయిల్స్‌ని ఒకేసారి డిలీట్..

మార్కెటింగ్ ఈ-మెయిల్స్‌లో ఎక్కువగా "అన్‌సబ్‌స్క్రయిబ్‌ (Unsubscribe)" లింక్ ఉంటుంది. వాటిని ఫాస్ట్‌గా డిలీట్ చేయడానికి, వెబ్ బ్రౌజర్‌లో జీమెయిల్ ఓపెన్ చేసి సెర్చ్ బార్‌లో "అన్‌సబ్‌స్క్రయిబ్‌" అని టైప్ చేయాలి. అంతే, ప్రమోషనల్ ఈమెయిల్స్ అన్నీ లిస్ట్ అవుతాయి. టాప్-లెఫ్ట్‌లో ఉన్న చెక్‌బాక్స్ క్లిక్ చేసి, కనిపించే ఈమెయిల్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలి.

ఇంకా ఎక్కువ ఈమెయిల్స్ డిలీట్ చేయాలనుకుంటే, బ్లూ నోటిఫికేషన్‌లో "సెలెక్ట్ ఆల్ కన్వర్జేషన్స్‌ థట్ మ్యాచ్ దిస్ సెర్చ్" అని ఇంగ్లీషులో ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. తర్వాత ట్రాష్ కాన్ ఐకాన్‌పై క్లిక్ చేస్తే అన్నీ డిలీట్ అయిపోతాయి. ప్రమోషన్స్, సోషల్ ట్యాబ్స్‌లో కూడా సేమ్ ప్రాసెస్ మళ్లీ పునరావృతం చేయాలి.

* ఒక పర్టికులర్ సెండర్ లేదా టైమ్ ఫ్రేమ్‌లోని ఈ-మెయిల్స్‌ని డిలీట్ చేయడం
ఒక సెండర్ దగ్గరి నుంచి వచ్చిన ఈ-మెయిల్స్‌ని డిలీట్ చేయాలంటే, సెర్చ్ బార్‌లో from:sender_email_address అని టైప్ చేయాలి. ఎవరికైనా పంపిన ఈమెయిల్స్‌ని డిలీట్ చేయాలంటే, to:recipient_email_address అని టైప్ చేయాలి. ఒక టైమ్ పీరియడ్‌లో ఈమెయిల్స్‌ని డిలీట్ చేయాలనుకుంటే, after:YYYY-MM-DD (ఇక్కడ ఏ డేట్ కావాలో ఆ డేట్ రాయండి) అని టైప్ చేయాలి.

ఇంకా మెరుగైన ఫలితాల కోసం ఈ సెర్చ్‌లని కలిపి కూడా ఉపయోగించవచ్చు. జీమెయిల్ ఈమెయిల్స్‌ని లిస్ట్ చేసిన తర్వాత, చెక్‌బాక్స్ ఉపయోగించి వాటిని సెలెక్ట్ చేసి, ట్రాష్ ఐకాన్ క్లిక్ చేసి డిలీట్ చేయవచ్చు. తద్వారా చాలా చిరాకు పుట్టించడం చెత్త ఈమెయిల్స్ అన్ని ఈజీగా తొలగించుకోవచ్చు.

* డిలీట్ చేసిన ఈమెయిల్స్‌ని మళ్లీ తెచ్చుకోవడం
డిలీట్ చేసిన ఈమెయిల్స్ ట్రాష్ ఫోల్డర్‌లోకి వెళ్తాయి. అక్కడ అవి 30 రోజుల వరకు ఉంటాయి. ఒకవేళ మీరు పొరపాటున ఇంపార్టెంట్ ఈమెయిల్ ఏదైనా డిలీట్ చేసి ఉంటే, వెంటనే ట్రాష్ ఫోల్డర్‌కి వెళ్లాలి. అక్కడ ఈమెయిల్‌ని సెలెక్ట్ చేసి, "మూవ్ టు ఇన్‌బాక్స్" ఆప్షన్ క్లిక్ చేస్తే, అది మళ్లీ మీ ఇన్‌బాక్స్‌లోకి వచ్చేస్తుంది.

ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే చాలు, మీ స్టోరేజ్ ఫ్రీ అవుతుంది, మీ జీమెయిల్ నీట్‌గా ఉంటుంది. అంతే కాదు, గంటలు గంటలు కూర్చొని ఒక్కొక్కటి డిలీట్ చేసే పని కూడా ఉండదు.

More from GizBot

Best Mobiles in India

English summary
Your Gmail is Full? Then Fix the Issue in Just One Minute with This Simple Trick
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X