మన విశ్వరూపం చూస్తారా..?

Written By:

ప్రపంచపు నాలుగవ అతిపెద్ద మిలటరీగా ఇండియన్ మిలటరీ గుర్తింపు తెచ్చుకోబోతోంది. భారత రక్షణ వ్యవస్థలో కీలక భూమిక పోషిషోన్న ఇండియన్ ఆర్మీ భారత భూభాగాన్ని పరిరక్షించడంతో పాటు దేశంలోని శాంతి భద్రతలను కంటికి రెప్పలా కాపాడుతూ వస్తోంది. ఇండియన్ మిలటరీ తన రక్షణ వ్యవస్థను మరింత పటిష్టం చేసుకునే క్రమంలో యూఎస్, రష్యాలకు ధీటుగా వెపన్ టెక్నాలజీని అభివృద్థి చేసుకుంటోంది.

మన విశ్వరూపం చూస్తారా..?

రష్యా వంటి ప్రముఖ దేశాల నుంచి ఆధునిక యుద్ద సామాగ్రిని సమకూర్చుకుంటోన్న భారత్ 2020 నాటికి అతిపెద్ద మిలటరీ శక్తిగా అవతరించబోతోంది. శత్రు దేశాలకు దడ పుట్టించగలిగే ఆయుధాలు ఇప్పుడు భారత్ అమ్ముల పొదిలో ఉన్నాయి. ఇండియన్ మిలటరీ వద్ద ఉన్న 10 అత్యంత శక్తివంతమైన వెపన్స్‌కు సంబంధించిన వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

Read More : మీ బ్రౌజింగ్ హిస్టరీని డిలీట్ చేస్తున్నారా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఇండియన్ మిలటరీ వద్ద ఉన్న 10 శక్తివంతమైన వెపన్స్‌

ఇది ఇండో రష్యా జాయింట్ ప్రాజెక్ట్. ధ్వని వేగం కంటే ఏడు రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించే హైపర్‌సోనిక్ క్షిపణి బ్రహ్మోస్ తయారీలో భారత్-రష్యా దేశాలు తలమునకలయ్యాయి. ఈ మధ్యనే అత్యాధునిక వ్యవస్థగల బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి ప్రయోగం విజయవంతమైంది.

 

ఇండియన్ మిలటరీ వద్ద ఉన్న 10 శక్తివంతమైన వెపన్స్‌

సుఖోయ్ ఎస్‌యూ - 30ఎంకేఐ

ఈ విధ్వంసకర సూపర్ జెట్ ఫైటర్‌ను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అభివృద్ధి చేసింది. ఈ జెడ్ ఖరీదు రూ.358 కోట్లు. యుద్ధ అవసరాలను ఈ జెట్ ఫైటర్ సమృద్ధిగా తీర్చగలదు.

 

ఇండియన్ మిలటరీ వద్ద ఉన్న 10 శక్తివంతమైన వెపన్స్‌

163 మీటర్ల పొడవు ఉండే ఐఎన్‌ఎస్‌ విశాఖ 7,300 టన్నుల బరువు ఉంటుంది. శత్రువులపై గుళ్ల వర్షం కురిపించడానికి ఐఎన్‌ఎస్‌ విశాఖలో 127ఎంఎం గన్నులు సిద్ధంగా ఉంటాయి. ఇది దేశంలోనే అతిపెద్ద యుద్ధ నౌకగా గుర్తింపు పొందింది. ఇది గరిష్ఠంగా గంటకు 30 నాట్ల వేగంతో ప్రయాణిస్తుంది.

 

ఇండియన్ మిలటరీ వద్ద ఉన్న 10 శక్తివంతమైన వెపన్స్‌

రష్యా సహకారంతో ఈ న్యూక్లియర్ వార్ హెడ్‌ను భారత్ సమకూర్చుకో గలిగింది. భారతదేశపు అత్యంత శక్తివంతమైన జలాంతర్గామిలలో ఐఎన్ఎస్ చక్రా ఒకటి. జీరో నాయిస్ లెవల్స్‌తో పనిచేసే ఈ కిల్లర్ హంట్ జలంతర్గామిలో 80 మంది ఉండొచ్చు.

 

ఇండియన్ మిలటరీ వద్ద ఉన్న 10 శక్తివంతమైన వెపన్స్‌

పాక్, చైనాల నుంచి బాలిస్టిక్‌ క్షిపణి దాడులు పొంచి ఉన్న నేపథ్యంలో బారత్ సుదూరం నుంచి దూసుకువచ్చే దీర్ఘశ్రేణి క్షిపణులను ముందుగా గుర్తించి, ఆకాశంలోనే పేల్చివేసే పృథ్వీ డిఫెన్స్ వెహికల్స్ ను అభివృద్ధి చేసుకుంది.

ఇండియన్ మిలటరీ వద్ద ఉన్న 10 శక్తివంతమైన వెపన్స్‌

AWACS అంటే ఎయిర్‌బోన్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టం. ఈ వ్యవస్థను దూరంలో ఉన్న ఎయిర్ క్రాఫ్ట్స్, షిప్స్ ఇంకా వెహికల్స్ ను గుర్తించేందకు ఉపయోగిస్తారు.

 

ఇండియన్ మిలటరీ వద్ద ఉన్న 10 శక్తివంతమైన వెపన్స్‌

300 కోట్లు విలువచేసే ఈ శక్తివంతమైన యుద్ధ ట్యాంకు విధ్వంసకర క్షిపణిని డీఆర్‌డీవో అభివృద్థి చేసింది.

 

ఇండియన్ మిలటరీ వద్ద ఉన్న 10 శక్తివంతమైన వెపన్స్‌

అత్యాధునిక ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య భారత నావికా దళంలోకి చేరింది. ఆధునిక మార్పుల మధ్య విక్రమాదిత్య ఇండియన్ ఆర్మీ చేతిలో మరో అస్త్రమయ్యింది. ఎయిర్ క్రాఫ్ట్‌లను మోసుకెళ్లగలిగే శక్తివంతమైన నౌక ఇది.

ఇండియన్ మిలటరీ వద్ద ఉన్న 10 శక్తివంతమైన వెపన్స్‌

రష్యాలో తయారైన మూడవ తరానికి చెందిన శక్తివంతచమైన యుద్ధ ట్యాంకు ఇది. దీని ముందు వైపున 125 ఎమ్ఎమ్ గల 2ఎ46 స్మూత్ బోర్ గల గన్ ను అమర్చారు.

ఇండియన్ మిలటరీ వద్ద ఉన్న 10 శక్తివంతమైన వెపన్స్‌

ఇది మల్టీ బ్యారెల్ రాకెట్ లాంఛర్. దీనిని డిఆర్‌డిఓ అభివృద్ది పరిచింది. కార్గిల్‌లో జరిగిన యుద్దంలో ఈ పినాకా రాకెట్ లాంఛర్‌ను ఉపయోగించారు. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 India Military Weapons That Will Make Our Enemies Tremble with Fear. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot