పొంతనలేని వాస్తవాలు ..?

Written By:

సమాచార వ్యవస్థ అంతగా అభివృద్ధి చెందని ఆ రోజుల్లో కొత్త విషయాలను తెలుసుకునేందుకు మనిషి పూర్తిగా పుస్తకాలు, పేపర్ల పైనే ఆధారపడేవాడు. కానీ, ఇప్పుడా పరిస్థితులు లేవు. ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాకా కావల్సిన సమాచారాన్ని చిటెకలో పొందగలుగుతున్నాం. ఫేస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్ వంటి సామాజిక మాద్యమాలు చీమ చిటుక్కుమన్నా దాన్నో సంచలనంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాయి.

పొంతనలేని వాస్తవాలు ..?

సమాచార విప్లవం ఇంతగా రాజుకున్న నేపథ్యంలో ఇంటర్నెట్‌లో అసత్యాలు, అపోహలు విస్తృతంగా ప్రచారమవుతున్నాయి. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని పలువురు ఆకతాయలు ఈ అనాగరిక చర్యలకు పాల్పడుతున్నారు. అమాయక నెటిజనులను కలవరపాటుకు గురి చేస్తూ పలు అసత్య ప్రచారాలతో ఫోటోషాప్ టూల్ ద్వారా ఎడిట్ చేయబడిన మార్ఫింగ్ ఫోటోలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. ప్రపంచాన్ని బిత్తరపోయేలా చేస్తున్న 10 షాకింగ్ రూమర్స్‌ను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

Read More : le 1s Eco రికార్డ్, 24 గంటల్లో లక్ష రిజిస్ట్రేషన్‌లు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పొంతనలేని వాస్తవాలు ..?

డబ్బులను సంపాదించేందకు ఫేస్‌బుక్ మనీ రెయిజింగ్ సంస్కృతి రోజురోజుకు పెరిగిపోతోంది. తమ పోస్ట్‌లకు ఎక్కువ లైక్స్ ఇంకా షేర్స్ లభించేందుకు ఎటువంటి పుకర్లానైనా పుట్టించేందుకు పలువురు ఆకతాయులు వెనకడాటం లేదు. ఇందుకు ఈ ఫోటో ప్రత్యక్ష ఉదాహరణ.

పొంతనలేని వాస్తవాలు ..?

ఓ వింత అస్థిపంజరాన్ని పురావస్తు శాఖ వారు మలేషియన్ తీర ప్రాంతంలో గుర్తించారంటూ ఓ రూమర్ విస్తృతంగా ఇంటర్నెట్‌ల ప్రచారం చేసింది. వాస్తవానికి ఇదో ఆర్టిస్ తయారు చేసిన ఆకృతి.

పొంతనలేని వాస్తవాలు ..?

బ్రెజిల్ కు చెందిన ఓ వ్యక్తి డాగ్ - ఫేస్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారని ఇంటర్నెట్ లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇది పూర్తిగా అవాస్తవం. 

పొంతనలేని వాస్తవాలు ..

సముద్ర గర్బంలో అట్టడుగున జీవించే giant squids జపాన్ లోని న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కారణంగా మృతి చెందుతున్నాయంటూ ఓ రూమర్ విస్తృతంగా ఇంటర్నెట్‌ల ప్రచారం చేసింది. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని జపొన్ కొట్టిపారేసింది.

పొంతనలేని వాస్తవాలు ..?

రేప్ చేసినా బయటపడనివ్వని డ్రగ్

డేట్ రేప్ పేరుతో ఓ డ్రగ్ గురించిన రూమర్ ఇంటర్నెట్ లో హల్  చేస్తోంది. ఇది పూర్తిగా అవాస్తవం.    

పొంతనలేని వాస్తవాలు ..?

Oreo కుక్కీలు కొకైన్ కంటే ప్రమాదకరమంటూ మరో రూమర్ ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది.  ఇందులో ఎలాంటి వాస్తవం లేదు.

పొంతనలేని వాస్తవాలు ..?

11/11/11న 11 మంది పిల్లలకు గుజరాత్‌లో ఓ తల్లి జన్మనిచ్చిందంటూ ఓ రూమర్ సోషల్ మీడియాలో ఓ ప్రచారం సాగింది. ఈ ప్రచారంలో ఏ విధమైన వాస్తవం లేదు.

పొంతనలేని వాస్తవాలు ..?

ఐఫోన్ 6 ఫోన్‌లు ఎబోలా వైరస్‌కు గురయ్యాయంటూ ఇటీవల పలు రూమర్స్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేసాయి. వీటిలో ఏ మాత్రం వాస్తవం లేదంటూ వైద్యులు కొట్టిపారేసారు.

పొంతనలేని వాస్తవాలు ..?

కేరళలో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తిని కొండచిలువ మింగేసిందంటూ ఓ రూమర్ సోషల్ మీడియాలో హల్ చేసింది. ఈ వార్తలో ఏ మాత్రం వాస్తవం లేదు. ఈ ఫోటోషాప్ టూల్ ద్వారా ఈ ఫోటోను ఎడిట్ చేసి ఉండొచ్చు.

పొంతనలేని వాస్తవాలు ..?

సోషల్ మీడియాలో హల్ చేస్తున్న మార్ఫింగ్ ఫోటో

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Internet Rumors from Around the World. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot