మరో 100 సంవత్సరాల్లో ఏం జరగబోతోంది, మనిషి ఎక్కడ ఉండబోతోన్నాడు..?

శాస్త్ర సాంకేతిక కమ్యూనికేషన్ రంగాలలో శతాబ్థాల కాలంగా మనిషి సాధిస్తున్నవిజయాలు నూతన ఉత్సాహాన్ని నింపుతూనే ఉన్నాయి. సాంకేతిక విప్లవం కారణంగా వెలుగులోకి వస్తున్న సరికొత్త ఆవిష్కరణలు మానవ జీవితాలను మరింత సుఖమయం చేసేస్తున్నాయి.

మరో 100 సంవత్సరాల్లో ఏం జరగబోతోంది, మనిషి ఎక్కడ ఉండబోతోన్నాడు..?

భవిష్యత్‍‌లో చోటు చేసుకోబోయే పలు విప్లవాత్మక ఆవిష్కరణలకు సంబంధించి పలువురు ఇంజినీర్లు ఇప్పటికే ప్రోటోటైప్‌లను అభివృద్ధి చేసారు. భవిష్యత్ అవసరాలను ఊహించి వారు రూపొందించిన ప్రోటోటైప్స్  మిమ్మల్ని ఆశ్చర్యంలో ముంచుత్తుతాయనటంలో ఏ మాత్రం సందేహం లేదు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

కదిలే స్కై స్ర్కాపర్స్‌

కదిలే స్కై స్ర్కాపర్స్‌ అనేవి చక్రలా పై నిర్మించే కాలనీలు, ఈ కదిలే కాలనీలు ఒకచోట నుంచి మరొక చోటకు మారిపోగలవు.  పోలిష్ వాస్తుశిల్పులైన డామియన్, ఫాల్ ప్రైజ్బిలాలు ఈ ప్రోటోటైపు ను డిజైన్ చేసారు.

గాలిలో పండించే వ్యవసాయ క్షేత్రాలు

హైడ్రోజనేస్‌గా పిలవబడే ఈ వ్యవసాయ క్షేత్రాలు నగరాల పై గాలలో తేలుతూ సాగవుతుంటాయి.

కాలుష్యాన్ని దహించివేసే టవర్లు

ఈ ప్రత్యేకమైన టవర్లు గాలిలోని విషవాయువులను పీల్చుకని స్వచ్చమైన గాలిని అందిస్తాయి. కెనడియన్ వాస్తుశిల్పులైన YuHao లియు,  రుయ్ వులు ఈ ప్రోటోటైప్ ను డిజైన్ చేసారు. 

మంచు పర్వతాల్లోనూ మనిషి జీవించే ఏర్పాట్లు

రానున్న 100 సంవత్సరాల్లో మనిషి మంచు పర్వతాల్లో సైతం శాస్వుత నివాసాలను ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

సౌండ్ స్ర్కాపర్‌

సౌండ్ పొల్యూషన్‌ను ఉపయోగపడే శక్తిగా మలిచే సౌండ్ స్ర్కాపర్‌లను భవిష్యత్‍‌లో మనం చూస్తాం..

ఇన్విజబుల్ బిల్డింగ్స్

రిఫ్లెక్టివ్ అద్దాలతో నిర్మించబడే ఈ ఇన్విజబుల్ బిల్డింగ్స్ పర్యావరణానికి మరింత మేలు చేయటంతో పాటు ఒకే క్రమపద్థిలో ఉంటాయి. 

గాలిలో ఎగిరే పట్టణాలు

ఈ ఫ్లోటింగ్ సిటీ కాన్సెప్ట్ ను బక్మినిస్టర్ ఫుల్లెర్ అనే డిజైనర్ అభివృ్ద్ధి చేసారు. ఈ రకమైన పట్టణాలను భవిష్యత్‌లో మనం చూడొచ్చు..  

స్వార్మ్ ఆఫ్ మిర్రర్స్

ఆకాశం నుంచి జారిపడే ఆస్ట్రాయిడ్‌ల నుంచి మనుషులను రక్షించేందుకు ఈ స్వార్మ్ ఆఫ్ మిర్రర్స్ ఉపయోగపడతాయి. త్వరలోనే ఈ టెక్నాలజీ అందుబాటులోకి రానుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Spectacular Architectural Prototypes that will Shock You. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot