అదిగో దెయ్యం.. ఇదిగో దెయ్యం..?

అతీత శక్తులు ఉనికి పై అనేక సందేహాలు ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి. అక్షర జ్ఞాన౦ అంతరిక్షానికి వెళుతున్నప్పటికి పలువురిలో మాత్రం ఎటువంటి మార్పు రావటం లేదు. చనిపోయిన వారు ఆత్మలుగా మారుతారంటు కొందరు.. దయ్యాలు, క్షుద్రశక్తులు మన వెంట తిరుగుతున్నాయంటూ మరికొందరు ఇలా గ్రామీణ స్థాయి నుండి ఇటు చదువుకున్న వారి వరకు అనాగిరక చర్యలను ప్రోత్సహిస్తూనే ఉన్నారు. టెక్నాలజీ పేరుతో మనిషి అభివృద్ది చెందుతున్నా చాపు క్రింద నీరులా మూడ నమ్మకాలు పురుడుపోసుకుంటూనే ఉన్నాయి.

అదిగో దెయ్యం.. ఇదిగో దెయ్యం..?

Read More : Airtel బంపర్ ఆఫర్.. 10జీబి 4జీ డేటా రూ.250కే!

సీబీఎస్ న్యూస్ అనే ప్రముఖ వార్తా సంస్థ 2005లో అమెరికాలో నిర్వహించిన ఓ సర్వే ఆసక్తికర విషయాలను వెలుగులోకి తీసుకువచ్చింది. ఈ సర్వే లో భాగంగా 48 శాతం మంది అమెరికన్లు ఆత్మలను నమ్ముతున్నట్లు వెల్లడయ్యింది. ఇదే అంశానికి సంబంధించి ఇతర సంస్థలు నిర్వహించిన సర్వేల్లోనూ 20 నుంచి 50 శాతం మంది దొయ్యాలను నమ్ముతున్నట్లు తేలింది. ఈ గణాంకాలను విశ్లేషించినట్లయితే దొయ్యాలు, భూతాలను నమ్మే వారి కంటే నమ్మని వారి సంఖ్య ఎక్కువుగా ఉన్నట్లు తెలుస్తుంది.

అదిగో దెయ్యం.. ఇదిగో దెయ్యం..?

Read More : 20 లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌ల పై వినాయక చవతి స్పెషల్ ఆఫర్స్ (లిస్ట్ ఇదే)

అయితే చాల మందిలో ఈ ఆత్మల పట్ల ఓ రకమైన కన్ఫ్యూషన్ వాతావరణం నెలకుందని ఈ అధ్యయనాలు వెల్లడించాయి. ఈ రకమైన ఆందోళనతో సతమతమవుతోన్న పలువురు తమ అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు నిపుణులను సైతం రంగంలోకి దింపుతున్నారట. ఘోస్ట్ హంటర్స్ అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి దొయ్యాలు ఉన్నది, లేనిది నిర్ధారించేస్తారట. అసాధారణ శక్తులకు సంబంధించిన అంతుచిక్కని గుట్టును శోధించేందుకు ఘోస్ట్ హంటర్లు ఉపయోగిస్తున్న టెక్నాలజీని ఇప్పుడు చూద్దాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గోస్ట్ హంటింగ్ స్టార్టర్ కిట్

టామ్స్ గాడ్జెట్స్ సంస్థ అందిస్తోన్న గోస్ట్ హంటింగ్ స్టార్టర్ కిట్ ఇది. అతీత శక్తుల అన్వేషణకు అవసరమైన ఈఎమ్ఎఫ్ మీటర్, బీమ్ బారియర్ అలారమ్ సెట్, ఇన్‌ఫ్రారెడ్ థర్మామీటర్ ఇంకా ఫ్లాష్ లైట్ లు ఉంటాయి.

కెమెరా ఎక్విపిడ్ నైట్ విజన్ స్కోప్

ఈ కెమెరా ఎక్విపిడ్ నైట్ విజన్ స్కోప్ ద్వారా మన చుట్టు ప్రరిభ్రమించే అతీత శక్తులను తెలుసుకోవచ్చట.

పారాబోలిక్ మైక్రోఫోన్

ఈ పారాబోలిక్ మైక్రోఫోన్ అనుమానస్పద శబ్ధాలను ఇట్టే పసిగట్టగలదట.

మోషన్ డిటెక్టర్

ఈ మోషన్ డిటెక్టర్ అతీత భావనలను అన్వేషించటంలో కీలక పాత్ర పోషిస్తుందట.

కెమెరా ట్రాప్

మీ సమీపంలోని అతీతశక్తుల కదలికలను ఈ కెమెరా ట్రాప్ బంధించగలదట. 

గోస్ట్ బాక్స్

ఈ గోస్ట్ బాక్స్ అనుమానాస్పద ఆడియో తరంగాలను రికార్డ్ చేయగలదు. 

ఇన్‌ఫ్రారెడ్ థర్మామీటర్

అతీత భావనలను అన్వేషించేందుకు ఉపయోగించే ఇన్‌ఫ్రారెడ్ థర్మామీటర్.

ఈఎమ్ఎఫ్ మీటర్స్

అతీత భావనలను అన్వేషించేందుకు ఉపయోగించే ఈఎమ్ఎఫ్ మీటర్స్.

ఈవీపీ గాడ్జెట్

ఈ ప్రొఫెషనల్ ఈవీపీ గాడ్జెట్ తాను గ్రహించిన శబ్థాలను ఏకకాలంలో ప్లేబ్యాక్ చేయటంతో పాటు రికార్డ్ చేస్తుంది. అతీత భావన పరిశోధనల్లో ఈ గాడ్జెట్ ను ఎక్కువగా ఉపయోగిస్తారు.

గోస్ట్ హంటింగ్ గేర్

పారానార్మల్ పరిశోధకులైన రోనా అండర్సన్, బెన్ మికాన్‌లు గోస్ట్ హంటింగ్ గేర్ సహాయంతో తమ పరిశోధనలను సాగిస్తున్న దృశ్యం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
10 Surprising Ghost-Hunting Gadgets. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot