ఇప్పటివరకు అంతుచిక్కని 10 ఫోటోల మిస్టరీలు

By Anil

  ఇప్పటివరకు ఈ భూమి మీద చాల మిస్టరీలు జరిగి ఉంటాయి.అయితే వాటిని చేధించడానికి చాలమంది శాయశక్తులా ప్రయత్నిస్తుంటారు .కొన్నింటిని ఛేదిస్తే మరీ కొన్నింటిని ఛేదించలేకపోయారు.ఈ నేపథ్యంలో కొన్ని మిస్టరీ ఫొటోస్ వెబ్ పోర్టల్స్ లో వైరల్ గా మారి ఉన్నాయన్న విషయం చాలామందికి తెలియకపోవచ్చు.కాగా ఈ ఫోటోలలో జరిగిన సంఘటనలు ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరీలుగానే మిగిలిపోయినట్టు ఆ వెబ్ పోర్టల్స్ తెలుపుతున్నాయి.అటువంటి మిస్టరీ ఫొటోస్ ను GIzbot Telugu మీకందిస్తోంది. ఓ సారి పరిశీలించండి.

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  Grandpa's Ghost :

  ఈ ఫోటోని 1998 లో తీశారు. ఫోటోలో కనిపిస్తున్న వృద్ధురాలు  ఆరోగ్యం బాగోక ఒక నర్సింగ్ హోమ్ కి వెళదాం అనుకుంది. ఆ నర్సింగ్ హోమ్ కి వెళ్లే ముందు తన కుటుంబీకులు ఆ వృద్ధురాలు ఫోటో తీసుకుందాం అనుకున్నారు. ఆ ఫోటో తీసే టైంలో ఆమె వెనకాలగాని చుట్టు పక్కల గాని ఎవరు లేరు. అయితే ఆమె ఆ ఫ్యామిలీ ఆ ఫోటో గురించి అంతగా పట్టించుకోలేదు. ఒక సంవత్సరం గడిచిన తరువాత ఆ వృద్ధురాలికి ఫోటోను చూపిస్తే ఆమె ఆశ్చర్యపోయింది ఎందుకంటే ఆ ఫొటోలో తన వెనకాల 13 సంవత్సరాల క్రితం చనిపోయిన తన భర్త కనిపిస్తున్నారు.

  Time Travelling Hipster :

  ఈ ఫోటోను 1941లో కొలంబియాలో సౌత్ ఫోర్ట్ బ్రిడ్జిను రీ ఓపెన్ చేసేటప్పుడు తీశారు. అయితే 2010లో రష్యా లోని Mtv వారు ఒక మ్యుజియంలో ఈ ఫోటోను చూసారు. ఒక్కసారి వారు ఆశర్య పోయిన విషయం ఏమిటంటే ఆ ఫోటోలో ఒక వ్యక్తి విచిత్రంగా ఉన్నాడు. 1940లో అలాంటి డ్రెస్సింగే లేదు .అతను పెట్టుకున్న సన్ గ్లాస్సెస్,టీషర్ట్,స్వేట్టెర్ ,కెమెరా అంత మోడరన్ వస్తువులు 1940లో తయారు చేయబడలేదు. అయితే అతడు పెట్టుకున్న సన్ గ్లాస్సెస్ అంతకముందే తయారు అయి ఉన్నాయని ఆ టీషర్ట్ ఫై ఉన్న లోగో Montreal కంపెనీ లోగో .ఆ టీషర్ట్ 1930 లోనే హాకీ టీమ్ లలో వేసుకునే వారని చాల మంది చెప్పారు. అతడు పట్టుకున్న కెమెరా ఆ కాలంలో ఉన్న కోడాక్ 35 కెమెరా అని అన్నారు.ఆ స్వేట్టెర్ గురించి మాత్రం ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. అయితే ఆ సన్ గ్లాస్సెస్,టీషర్ట్,స్వేట్టెర్ ,కెమెరా గురించి చెప్పిన విషయాలు వేరే వాళ్ళ వాదనలే తప్ప కచ్చితంగా నిజాలు కావు. అతను టైమ్ ట్రావెల్ చేసి వచ్చాడని చాలా మంది నమ్ముతారు

  Hanging Body Of Ghost :

  1950లో కాపర్ అనే వ్యక్తి ఒక కొత్త ఇంటిని కొనుక్కొని ఫామిలీ తో సహా ఆ ఇంటికి షిఫ్ట్ అయ్యారు.కొత్త ఇంట్లోని ఫోటోలను తీయాలి అనుకున్నప్పుడు మొదటి రోజు డిన్నర్ చేస్తుండగా తీసిన ఫోటో ఇది. అయితే ఆ ఫోటో ను డెవలప్ చేసిన చేసిన కొన్ని రోజుల తరువాత ఫోటో ను చూస్తే తమ వెనకాల ఒక వ్యక్తి వేలాడుతూ కనిపించాడు. అయితే ఆ ఫోటో ను తీసిన టైమ్ లో ఆ ఇంట్లో వీరి ఫ్యామిలీ తప్ప ఎవరు లేరు ఆ వేలాడుతున్న డెడ్ బాడీ ఇంతక ముందు ఆ ఇంట్లో అంతకముందు చనిపోయిన ఒక వ్యక్తిదని ఫామిలీ వారు అనుకున్నారు

  Amityville House :

  1974లో రోనాల్డ్ అనే వ్యక్తి ఈ Amityville House లో ఆరుగురు కలిసి ఉన్న కుటుంబాన్ని చంపాడు తరువాత తాను అరెస్ట్ అయ్యాడు. ఆ హౌస్ లోకి జార్జ్ ఫ్యామిలీ వారు వచ్చారు. వాళ్ళు వచ్చిన రోజు నుండి 28 రోజుల వరకు ఆ ఇంట్లో వింత శబ్దాలు వింత సంఘటనలు జరిగాయి. అప్పుడు జార్జ్ డెమోలజిస్టు ఈద్ మరియు కొందరి ఇన్వెస్టిగేటర్ల సహాయం తో ఆ ఇంట్లో ఎం జరుగుతుందో తెలుసుకోవాలని అనుకున్నాడు. ఆ ఇంటి నిండా కెమెరాలు అమర్చాక ఎలాంటి సంఘటనలు జరగలేదు తరువాత కొద్దీ రోజులకి ఆ ఇన్వెస్టిగేటర్ల తీసిన ఫోటోలు చూస్తే ఒక బాబు ఫోటోలో కనిపించాడు. అతని కళ్ళు ఇన్ఫ్రా రెడ్ గా కనిపించాయి అతను ఎవరని తెలుసుకోగా చనిపోయిన ఆ ఫ్యామిలి లో చిన్నవాడైన John Mathew గా గుర్తుపట్టారు. ఈ Amityville House అమెరికా లోని ఫేమస్ haunted houseలలో ఒకటిగా నిలిచింది. ఈ Amityville House లోని ghosట్ గురించి సినిమాలు కూడా తీశారు.

  Skunk Ape Creature :

  2000 సంవత్సరంలో ఒక అమ్మాయి రాత్రి సమయం తోటలో చెట్టు నుండి ఆపిల్స్ తీసుకుంటున్న ఒక వింత జీవిని చూసింది కానీ రాత్రి సమయం లో అదేంటో గుర్తు పట్టలేకపోయింది .అది ఒక పెద్ద కోతి అనుకోని దాని దగ్గరకు వెళ్లి ఒక ఫోటోను తీసింది వెంటనే బయపడి పరుగులు తీసింది. ఈ ఫోటో లో కనపడుతున్న క్రియేచర్ ఏంటో ఇంతవరకు ఎవరు సమాధానం ఇవ్వలేకపోయారు

  The Madonna With Saint Giovannino Painting :

  ఈ పెయింటింగ్ 15th సెంచరీ కీ సంబందించినది.ఈ పెయింటింగ్ ను సరిగ్గా గమనించనట్టైతే ఏదో ఒక వస్తువు ఆకాశం లో తిరుగుతుంది. అక్కడ ఉన్న మనిషి అదేంటో చూస్తున్నట్లుంది. అయితే aeroplane అనేది కనిపెట్టింది 1903లో. మరీ 15th సెంచరీ లో ఆకాశంలో తిరిగే వస్తువు ఏమైంటుంది అని అడిగితే అది ఎలియన్స్ కి సంబందించిన UFO అని చాల మంది అంటున్నారు. అంటే UFO మిస్టరీ 15th సెంచరీ కి ముందే స్టార్ట్ అయింది.

  Hessdalen Lights :

  ఈ Hessdalen Lights అనేది అంతుచిక్కని మిస్టరీ లైట్స్. సుమారు 1930 నుండి 1980 వరకు నార్వే లో ఉన్న Hessdalen వ్యాలీ పై ఈ Hessdalen Lights కనిపించాయి. ఈ ఫోటో 1981 కు సంబంధించింది. ఈ లైట్స్ ఆ ప్లేస్ కి వచ్చినప్పుడు కొన్ని కొన్ని సార్లు స్టాండర్డ్ గా ఒకే ప్లేస్ లో ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు ట్రావెల్ చేస్తాయి.అలా ఆకాశం లో వింత లైట్స్ రావడానికి కారణం ఏంటో ఇప్పటికి ఎవరికీ తెలియదు .

  15 Inch Mummified Finger :

  1988 ఈజిప్ట్ తవ్వకాలలో ఈ ఫింగర్ బయటపడింది. ఈ ఫింగర్ ను టెస్ట్ చేస్తే దాదాపు మనిషిదే అని తేలింది. అయితే 15 Inches ఫింగర్ మాత్రమే ఉంటె ఈ ఫింగర్ తాలుక అసలైన మనిషి 12 ఫీట్ల వరకు ఉంటాడు.

  Pyramid On Moon :

  Appollo 17 మెషిన్ తరువాత NASA చంద్రుడి పై ఫోటోలు తీసింది. విచిత్రం ఏంటంటే చంద్రుడి పై ఒక పిరమిడ్ ఉంది. అది మన భూమి పై ఉన్న ఈజిప్ట్ పిరమిడ్ కన్నా 3 ఇంతలు పెద్దవని అంచన. అయితే ఒక పిరమిడ్ అనేది natural గా ఫార్మ్ అవ్వడం అసంభవం. అలాంటిది చంద్రుడి పై గాలి ఉండదు ఎటువంటి టైడల్ energies ఉండవు. అయితే Appollo 17 మెషిన్ తరువాత మానవుడు చంద్రుడి పై వెళ్లకపోయే సరికి ఆ పిరమిడ్ అనేది ఒక మిస్టరీ లాగానే మిగిలిపోయింది.

  The Beautiful Sucide :

  ఈ ఫోటోను 1947 అమెరికా లో Evelyn mchale అనే అమ్మాయి 86 ఫ్లోర్స్ బిల్డింగ్ నుండి దూకి చనిపోయినప్పుడు తీశారు.ఇందులో ఆశ్చర్యం ఏంటంటే ఆమె పై ఒక్క చిన్న గాయం కూడా అవ్వలేదు ఒక చుక్క రక్తం కూడా కారలేదు. ఆమెను చూస్తే దర్జాగా కార్ పై నిద్రపోతున్నట్టుంది.86 ఫ్లోర్స్ బిల్డింగ్ అంటే సుమారు 300 మీటర్లు. అంత ఎత్తునుండి కిందకి పడిన కూడా ఎటువంటి గాయం అవ్వకుండా చనిపోవడం అనేది అందరికి ఆశ్చర్యానికి గురి చేసింది.

   

   

  గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

  English summary
  12 Real Photos That Cannot be Explained.To Know More About Visit telugu.gizbot.com
  Opinion Poll
  X

  ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more