ఇండియాలో ఇవి మిస్టరీలా లేక అతీంద్రియ శక్తులా..?

Written By:

ప్రపంచమనే మహా సముద్రంలో ఎన్నో మిస్టరీలు ఉన్నాయి...వాటిని చేధించాలని శాస్త్రవేత్తలు ఎంత ప్రయత్నించినా అవి సాధ్యం కావడం లేదు. అవి మిస్టరీలా లేక అతీంద్రియ శక్తుల అనేది ఎవరికీ అంతుపట్టని విషయం..అయితే ఇండియాలో కూడా ఇలాంటి మిస్టరీలు ఎన్నో ఉన్నాయి. అవి ఇప్పటికీ శాస్త్రవేత్తలకు చిక్కక పరిశోధనల్లో తేలక అలాగే మిగిలి ఉన్నాయి. అవేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా..అయితే ఓ చిన్న లుక్కేయండి.

Read more : ఒక ఫోటో ప్రపంచాన్ని మార్చింది

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1

కేరళలోని కోడిన్హి గ్రామంలో 2000 మంది జనాబా ఉంటే వారిలో 200 జంటలు కవలలే. శాస్రవేత్తలు దీనిపై సెర్చ్ చేసి అలా ఎక్ువ మంది కవలలు అక్కడ ఎందుకు పుడుతున్నారో తెలుసుకోలేక తలలు పట్టుకుంటున్నారు.
Image Courtesy: The Telegraph

2

2012 డిసెంబర్ 18వ తేదీన ఆకాశం నుండి ఓ పెద్ద భూమ్ జోధ్ పూర్ మీద పడింది. ఆ శబ్దం వినడానికే చాలా భయంకరంగా ఉంది. అయితే అన్ని ప్రాంతాల్లో అలాంటివి వినపడుతుంటాయని కొందరు పుకార్లు లేవదీసినా అసలు ఆ బూమ్ ఏమిటనేది ఇప్పటికీ శాస్ర్తవేత్తలకు అంతుబట్టడం లేదు.
Image Courtesy: Funnylol

3

9 మంది మనుషులు సమాజంలో చాలా సీక్రెట్ గా నివసిస్తున్నారట.. వారి గురించి ఎవ్వరికీ తెలియదట. వీరంతా గ్రహాంతర వాసులతో సంబంధాలు కలిగి ఉన్నారని వారితో కమ్యూనికేట్ అవుతున్నారని అశోక చక్రవర్తి వీరిని నియమించారని ఓ గాధ ఉంది. మరి ఈ మిస్టరీకూడా అలానే ఉంది.
Image Courtesy: Oyehoyezone

4

తాజ్ మహల్ అంటే అది లవర్స్ కు సంకేతమని తన ప్రియురాలు స్మారకార్థం షాజహాన్ దాన్ని కట్టారని చెబుతారు. అయితే తాజ్ మహాల్ ఇంతకు ముందు శివాలయం అనే విషయం ఎవరైనా నమ్మగలరా. అది తేజోమహల్ అంటే నిజమని నమ్ముతారా..ప్రొపెసర్ పీఎన్ ఒ.కె. దీన్ని ఆధారాలతో సహా చూపిస్తున్నారు. మొగల్ చక్రవర్తి కాలంలో అది అలా లవర్స్ కు సంకేతంగా మారిందని ముందు అది శివాలయం అని చెబుతారు.
Image Courtesy: Viator

5

రాజస్థాన్ లోని కుల్దారా గ్రామాన్ని పరిశీలిస్తే ఎన్నో అంతుచిక్కని అంశాలు కనిపిస్తాయి. అక్కడ రాత్రికి రాత్రే జనాభా మొత్తం తుడిచిపెట్టుకుపోయారట..మరి అలా ఎందుకు జరుగుతుందో శాస్ర్తవేత్తలకే అర్థం కావడం లేదు. ఇప్పటికీ ఆ గ్రామం అష్టకష్టాలను ఎదుర్కుంటోంది.
Image Courtesy: Tripadvisor

6

ఇండియా చైనా బార్డర్ లో ఎప్పుడూ ఇలా ఏవో తెలియని వస్తువులు గాల్లో ఎగురుతూ ఉంటాయని సైనికులు చెబుతుంటారు. పళ్లెం ఆకారంలో అవి రాత్రిళ్లు ఎగురుతూ ఉంటాయట. మరి అవి ఏంటనేది ఇప్పటివరకు మిస్టరీనే..

Image Courtesy: Ufosightinghotspot.blogspot

7

ఎవరు ఈ శాంతి దేవి..ఆమె గత జీవితం గురించి ఆమె అక్షరం పొల్లుపొకుండా చెబుతోంది. ఇది ఎలా సాధ్యం. నాలు సంవత్సరాల వయసులోనే తన గత జీవితం గురించి భర్త, పిల్లల గురించి ఆమె ఎలా చెప్పగలిగింది. ఇది కూడా అంతుచిక్కడం లేదు.
Image Courtesy: Turnspiritual

8

ఆజాద్ మింద్ ఫౌజ్ ని స్థాపించి భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన నేతాజీ మరణం మిస్టరీగానే ఉంది. ఏవో ఏవో కథలు బయటికొస్తూనే ఉన్నాయి.
Image Courtesy: New Indian Express

9

ఈ బుల్లెట్ మీ ప్రయాణం చేస్తూ దాని ఓమ్ బన్నా అనే వ్యక్తి చనిపోయారు. అయితే ఇందులో మిస్టరీ ఏమి లేదు కాని ఆ తరువాతనే మిస్టరీ స్టార్ట్ అయింది.దీన్ని పోలీస్ స్టేషన్ కు తీసుకువెళితే ఆ మరుసటి రోజు ఆ బండి యాక్సిడెంట్ అయిన ప్లేస్ లో ఉంది. రోజూ దీన్ని పోలీస్ స్టేషన్ కు తీసుకుపోవడం అది మళ్లీ అదే ప్లేస్ కి రావడం ఎలా అనేది ఇప్పటికీ అంతుచిక్కడం లేదు.
Image Courtesy: Vegmomos

10

బొంబాయి, కలకత్తా వీధుల్లో ఇప్పటికి ఓ మిస్టరీ వెంటాడుతూనే ఉంది. దీనికి వారు స్టోన్ మెన్ అనే టైటిల్ కూడా పెట్టారు. అక్కడ ఓ హంతుకుడు రాత్రి వేళల్లో సంచరిస్తూ రాయితో మనుషుల్ని చంపేస్తారట. అది ఎవరు అనేది ఎవరికీ తెలియదు..సీరియల్ కిల్లర్ లా మనిషిని చంపేసి తలని పుచ్చకాయ పగలగొట్టినట్లు పగలగొట్టి పోతాడట..
Image Courtesy: Rebecca Zilenziger

11

ఇది అంతుచిక్కని మిస్టరీ. గత నలభై ఏళ్ల నుంచి నీరు కాని వాటర్ కాని తీసుకోకుండా జీవిస్తున్నారు ఈ బాబా. ఇతని మీద ఎన్నో ప్రయోగాలు చేసినా కాని అదెంటో తేల్చలేకపోయాయి. శాస్ర్తవేత్తలు ఏమి చేయలేక అది మిరాకిల్ అంటూ తేల్చిపడేశారు.
Image Courtesy: Skepdic

12

ప్రతి సంవత్సరం అస్సాంలోని ఓ చిన్న గ్రామంలో ఎన్నో జతింగా పక్షులు చనిపోతుంటాయి. అది కూడా కేవలం సాయంత్రం సమయంలోనే అలా జరుగుతూ ఉంటుంది. రోజూ వందల సంఖ్యలో ఆ గ్రామానికి ఈ పక్షలు ఆకాశమార్గం గుండా వచ్చి అక్కడ చనిపోతాయి. అసలెందుకు అలా జరుగుతుందో ఎవరూ కనిపెట్టలేకపోతున్నారు.
Image Courtesy: Assaminfo

13

హిమాలయాల్లో ఓ భయంకరమైన మంచు మనిషి తిరుగుతూ ఉంటారు. అతను చూసేదానికి పెద్ద కోతిలాగా చాలా భయంకరంగా అరుస్తూ విహారం చేస్తుంటాడు. అతనెవరనేది అసలు మనిషేనా అనేది ఇప్పటికీ తెలుసుకోలేకపోతున్నారు.
Image Courtesy: The Telegraph

14

అనంతపూర్ లోని లేపాక్షి టెంపుల్ లో ఓ స్థంభం అలా కదులుతూ ఉంటుంది. దాదాపు 70 పిల్లర్స్ అక్కడ లేపాక్షి దేవాలయాన్ని కాపాడుతూ ఉంటే ఈ పిల్లర్ మాత్రం గాల్లో లేచినట్లుగా అటూ ఇటూ కదులుతూ ఉంటుంది. అది నేలను తాకకుండా గాల్లోనే ఉంటుంది. అదెలా సాధ్యమనేది అంతు చిక్కడం లేదు.
Image Courtesy: Buzzoop

15

ఉత్తరాఖండ్ లో ఉన్న ఈ సరస్సు కూడా ఓ మిస్టరీలా మారింది. దీన్నే అస్థి పంజర సరస్సు అని కూడా పిలుస్తారు. దీన్ని 1972లో కనుగొన్నారు. ఈ సరస్సులో పూర్తిగా మంచు కరిగిపోయినప్పుడు అనేక అస్థ పంజరాలు బయటకొచ్చాయి. మరి ఆ అస్థి పంజరాలు అక్కడకి ఎలా వెళ్లాయనేది ఇప్పటికీ అంతు చిక్కడం లేదు. కొంతమంది మాత్రం అవి జపాన్ సైనికుల అస్థి పంజరాలు అని చెబుతారు. యుద్ధం జరిగిన సమయంలో హఠాత్తుగా వడగళ్ల వాన వచ్చి వారందరినీ తుడిచిపెట్టేసిందని చెబుతారు. అది నిజమా కాదా అనేది ఇప్పటికీ తేల్చలేకపోతున్నారు.
Image Courtesy: IndiaOuting

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write 15 Unsolved Mysteries Of India That Will Give You The Creeps
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot