కళ్లు చెదిరే టెక్నాలజీ..!
ఈ ఆధునిక ప్రపంచంలో ప్రయోగాల ద్వారానే మనిషి మనుగుడ సాధ్యమవుతుంది. ప్రస్తుతం మనం ఉపయోగించుకుంటోన్నఇంటర్నెట్, కంప్యూటర్ , స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్ ఇలా రకరకాల టెక్నాలజీ ప్రయోగాల ద్వారా సాధ్యమైనవే.

కలలుగానే మిగిలిపోతాయనుకుంటున్న పలు ఊహాజనిత వాస్తవాలను ఆధునిక టెక్నాలజీ నిజం చేస్తోంది. రానున్న సంవత్సరాల్లో మనుషుల జీవితాలన మరింత సుఖవంతంగా చేయబోయే 5 ఫ్యూచరిస్టిక్ వెహికల్స్‌ను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు....
Read More : ఆధార్ కార్డు మార్పులు చేర్పులు ఇప్పుడు మన చేతుల్లో..

భవిష్యత్‌లో వచ్చే వెహికల్స్ ఎలా ఉండబోతున్నాయ్..?
పార్కింగ్ సమస్యలు లేకుండా ఈ స్కూటర్‌ను సూట్‌కేస్‌లా మడత పెట్టుకోవచ్చు.

భవిష్యత్‌లో వచ్చే వెహికల్స్ ఎలా ఉండబోతున్నాయ్..?
మిల్నర్ మోటార్స్ ప్రతిష్టాత్మకంగా అభివృద్థి చేసిన AirCarను రెండు రకాలుగా వాడుకోవచ్చు. గాలిలో ప్రయాణించే సమయంలో ఒక రకంగా, రోడ్డు పై ప్రయాణించే సమయంలో మరొక రకంగా ఈ వెహికల్ తన ఆకృతిని మార్చుకుంటుంది.

భవిష్యత్‌లో వచ్చే వెహికల్స్ ఎలా ఉండబోతున్నాయ్..?
2010లో టైమ్ మేగజైన్ ఎంపిక చేసిన 50 అత్యుత్తమ ఆవిష్కరణలో మార్టిన్ జెట్‌ప్యాక్ ఒకటి. ఈ జెట్‌ప్యాక్ 30 నిమిషాల పాటు గాలిలో ఎగరగలదు. గంటకు 74 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలిగే ఈ జెట్‌ప్యాక్ 3000 అడుగుల ఎత్తులో విహరించగలదు.

భవిష్యత్‌లో వచ్చే వెహికల్స్ ఎలా ఉండబోతున్నాయ్..?
ప్రపంచపు మొట్టమొదటి రియల్ సబ్మెర్సిబుల్ కారుగా రిన్‌స్పీడ్ స్కూబా గుర్తింపు తెచ్చుకుంది. ఈ కారులో పొందుపరిచిన రీఛార్జబుల్ లితియమ్ ఐయోన్ బ్యాటీరీలు వాహనాన్ని మరింత శక్తివంతంగా తీర్చిదిద్దుతాయి.

భవిష్యత్‌లో వచ్చే వెహికల్స్ ఎలా ఉండబోతున్నాయ్..?
ఈ ప్రత్యేకమైన కారు అత్యవసర సమయల్లో లగేజ్ బ్యాగ్‌లా మారిపోగలదు.


Click it and Unblock the Notifications