హిమాలయాల్లో హిట్లర్ వెతికి వెతికి అలిసిపోయిన నగరం ఉందని తెలుసా..?

Posted By:

దేశానికి పెట్టని గోడలా ఉన్న హిమాలయాల్లో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయన్న విషయం అందరికీ తెలుసు..అవి ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలుగానే మిగిలిపోయాయి. అలాంటి రహస్య ప్రదేశాల్లో ఒకటి హిమాలయాల్లో ఎవ్వరికీ కనిపించకుండా దాగిన శంబాలా నగరం..ప్రతి పౌర్ణమికి అక్కడ విచిత్రమైన సంఘటనలు జరుగుతాయని పూర్వికులు చాలామంది చెబుతారు. కాని ఎవ్వరూ ప్రత్యక్షంగా చూసిన దాఖలాలు లేవు. ఇక హిట్లర్ ఈ ప్రదేశం గురించి వెతికి వెతికి అలిసిపోయారట.. శంబాలా నగరంపై కొన్ని నమ్మలేని నిజాలు మీకిస్తున్నాం ఓ స్మార్ట్ లుక్కేయండి.

ఇంటర్నెట్‌‌ని వణికించిన ఈ ఫోటోలు నిజమైనవేనా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హిమాలయాల్లో దాగిన అదృశ్య నగరం..

కొన్ని పరిశోధనలు, అలాగే కొన్ని భారతీయ గ్రంధాలు, ఇంకా బౌద్ధ గ్రంధాలలో రాసిన దానిని బట్టి హిమాలయాల్లో బాహ్య ప్రపంచానికి తెలియని ఓ నగరం ఉందని దానిపేరు శంబాలా అని తెలుస్తోంది. దాన్ని హిడెన్ సిటీ అని కూడా పిలుస్తారు.

హిమాలయాల్లో దాగిన అదృశ్య నగరం..

వందల వేల మైళ్ల విస్తీర్ణం కలిగిన హిమాలయ పర్వతాల్లో ఎక్కడో ఎవ్వరికీ తెలియని ప్రదేశంలో ఆ నగరం ఉందని పురాణాలు చెబుతున్నాయి. ఆ ప్రదేశానికి మనుషులు చేరుకోవడం అసాధ్యమని కూడా పాశ్చాత్యులు చెబుతున్నారు.

హిమాలయాల్లో దాగిన అదృశ్య నగరం..

అదొక పవిత్రమైన ప్రదేశమని...అక్కడ దేవతలు సంచరిస్తూ ఉంటారని ఆ నగరాన్ని చూడాలంటే ఎంతో తపస్సు చేయాలని కూడా చెబుతారు. ఇంకా చెప్పాలంటే ఆ ప్రదేశానికి చేరుకోవాలంటే ప్రాణాలపై ఆశను వదిలేసుకోవాలని కూడా చెప్పాల్సి ఉంటుంది.

హిమాలయాల్లో దాగిన అదృశ్య నగరం..

అంత సీక్రెట్ గా దాగి ఉన్న ఆ నగరాన్ని గురించి కొన్ని విషయాలను కొంతమంది పరిశోధకులు తమ జీవితాన్ని పణంగా పెట్టి సేకరించగలిగారు. వారు సేకరించిన విషయాల ప్రకారం ఆ నగరం శివుడు కొలువైన మౌంట్ కైలాష్ పర్వతాలకు దగ్గరలో ఉంటుందని తెలుస్తోంది.

హిమాలయాల్లో దాగిన అదృశ్య నగరం..

ఆ ప్రదేశం అణునిత్యం అత్యంత సువాసన వెదజల్లుతూ ఉంటుందని అక్కడ నివసించేవారు నిరంతరం సుఖసంతోషాలతో జీవిస్తుంటారని వారికి బాధలన్నవే తెలియవని కూడా చెబుతారు. ఇదే విషయాన్ని బౌద్ధ గ్రంధాలు సైతం చెబుతున్నాయి.

హిమాలయాల్లో దాగిన అదృశ్య నగరం..

ఇక పాశ్చాత్యులు ఆ ప్రదేశాన్ని "ది ఫర్బిడెన్ ల్యాండ్" అని " ది ల్యాండ్ ఆఫ్ వైట్ వాటర్స్" అని రకరకాల పేర్లతో పిలుస్తారు. చైనీయులకు కుడా శంబాలా నగరం గురించి తెలుసు.

హిమాలయాల్లో దాగిన అదృశ్య నగరం..

పురాతన గ్రంధాల ప్రకారం లోకంలో పాపం అరాచకత్వం పెరిగిపోయినప్పుడు ఈ నగరంలోని పుణ్య పురుషులు లోకాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారని అప్పటి నుంచి కొత్త యుగం ప్రారంభమవుతుందని తెలుస్తోంది. ఆ కాలం 2424 లో వస్తుందని కొన్ని గ్రంథాలు ఇప్పటికే తెలియచేశాయి.

హిమాలయాల్లో దాగిన అదృశ్య నగరం..

శంబాలలో నివసించే వారు మహిమాన్వితులు అని తెలుసుకున్నరష్యా ఆ నగరం రహస్యాన్ని తెలుసుకోవడానికి తన మిలటరీ ఫోర్సును పంపి పరిశోధనలు కూడా చేయించింది. ఇది 1920లో జరిగిందని ఆధారాలను బట్టి తెలుస్తోంది.

హిమాలయాల్లో దాగిన అదృశ్య నగరం..

అప్పుడు శంబాలా కి చేరుకున్న రష్యా మిలటరీ అధికారులకు అనేక ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయని..అక్కడ యోగులు గురువులు దాని పవిత్రత గురించి తెలిపారని కూడా ఆ ఆధారాలు చెబుతున్నాయి.

హిమాలయాల్లో దాగిన అదృశ్య నగరం..

అద్భుతాలు అంటే ఇష్టపడే నాజి నేత హిట్లర్ కూడా 1930 లొ శంబాలా గురించి తెలుసుకొవడానికి దాన్ని పరిశోధించేందుకు ప్రత్యేక బృందాలని పంపించాడట. ఆ బృందానికి నాయకత్వం వహించిన హేన్రిచ్ హిమ్లర్ అక్కడ గొప్పదనం తెలుసుకుని దేవతలు సంచరించే ఆ పుణ్యభూమి భువి పైన ఏర్పడ్డ స్వర్గమని నాజినేత హిట్లర్ కి చెప్పాడట.

హిమాలయాల్లో దాగిన అదృశ్య నగరం..

దాంతో ప్రపంచం మొత్తాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలి అనుకున్న హిట్లర్ కొంతమంది రహస్య అనుచరులతో కలిసి శంభాలాకు పయనం కట్టాడని అక్కడి ఆధ్యాత్మిక వేత్తలతో కలిసి వారి సహయంతో ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు ప్రయత్నించాడు అంటారు.

హిమాలయాల్లో దాగిన అదృశ్య నగరం..

పురాతన విజ్ఞాన శాస్త్రవేత్త blavetsky ఈ విషయాలను ప్రపంచానికి వెల్లడించినప్పుడు విశ్వ మానవులు అంతా షాక్ తిన్నారు.అయితే హిట్లర్ పన్నాగాన్ని శంబాలా అధ్యాత్మిక వేత్తలు పడనివ్వలేదు.దానితో చేసేది ఏమీ లేక హిట్లర్ వట్టి చేతులతో వెనకకి తిరిగాడని ఆమె తెలిపారు. 

హిమాలయాల్లో దాగిన అదృశ్య నగరం..

వాటిల్లో నిజమెంత అనేది ప్రత్యక్షంగా ఆనాడు చూసిన వారికి మాత్రమే తెలుస్తుంది. అంతే కాక ఆ ప్రదేశాన్ని సందర్శించిన హిమ్లర్ శంబాలా నగరంలో మరెన్నో వింతలు, విశేషాలు మనవ మాత్రులు కలలో కుడా అనుభవించని గొప్ప అనుభూతులని సొంతం చేసుకున్నాడని అంటారు.

హిమాలయాల్లో దాగిన అదృశ్య నగరం..

ఇదంతా ఓ ఎత్తయితే...గోభి ఎడారికి దగ్గరిలో ఉన్న శంబాలానే రాబోయే రొజులలొ ప్రపంచాన్ని పాలించే కేంద్ర స్థానం అవుతుందని బుద్ధుడు కాలచక్రాలో రాసాడని మరికొంతమంది అంటారు. దీన్నే పాశ్చాత్యులు "plaanets of head center గా పిలుస్తారు.

హిమాలయాల్లో దాగిన అదృశ్య నగరం..

ఫ్రాన్స్‌ చారిత్రక పరిశోధకురాలు , బౌద్ద మత అభిమాని, రచయిత్రి alexandra devid neel కూడా ఈ నగరాన్ని పరిశోధించి గ్రంథాలు రచించింది. ఆమె తన 56 ఏళ్ళ వయస్సులో ఈ ప్రాంతాన్ని సందర్శించి అక్కడి వారు ఆశీస్సులు పొందిందని అందువల్లనే ఆమె ఏకంగా 101 years బ్రతికింది అని అంటారు.

హిమాలయాల్లో హిట్లర్‌ వెతికినా చిక్కని అదృశ్య నగరం

ఆమె oct 24 1868 లొ జన్మించి సెప్టెంబర్ 8 , 1969 లొ మరణించింది. అంతే కాకుండా పాశ్చాత్య దేశాల నుంచి వచ్చి టిబెట్ లొ కాలుమోపిన తొలి యూరప్ వనిత ఆమెనని కూడా తెలుస్తోంది.

హిమాలయాల్లో హిట్లర్‌ వెతికినా చిక్కని అదృశ్య నగరం

ఇక షాంగై నగరానికి చెందిన పరిశోధకుడు డాక్టర్ లాయోనిన్ కూడా శంబాలా అనేది భుమి నుంచి స్వర్గానికి వేసిన వంతెన అంటూ పేర్కొంటారు. ఆ ప్రాంతం ప్రపంచంలో ఏ ఇతర ఆధునిక ప్రాంతానికి తీసిపోదు అని తెలిపాడు.

హిమాలయాల్లో హిట్లర్‌ వెతికినా చిక్కని అదృశ్య నగరం

అక్కడి వారు telipathi తో ప్రపంచంలోని ఎక్కడి వారితొ నైనా సంభాషించగలరని , ఎక్కడ జరుగుతున్న అభివృద్ది అయినా, విధ్వంసం అయినా క్షణాలలో వారికి తెలిసిపోతుంది అని తెలిపారు.వెనకటి కాలానికి చెందిన లామా మింగ్యుర్ డో న్డప్ చెప్పిన దాని ప్రకారం శంబాలా వయస్సు అర మిలియన్ సంవత్సరాలని తెలుస్తోంది.

హిమాలయాల్లో హిట్లర్‌ వెతికినా చిక్కని అదృశ్య నగరం

శంబాలా ప్రజలు దాదాపు పన్నెండు అడుగుల పొడవు ఉంటారని తెలుస్తోంది. వారు అనేక శక్తులు కలిగి ఉన్నారని ప్రపంచాన్ని తమ చేతుల్లోకి తీసుకునే అవకాశం కూడా వారికుందని పురాతన గ్రంధాలు సైతం చెబుతున్నాయి.

హిమాలయాల్లో హిట్లర్‌ వెతికినా చిక్కని అదృశ్య నగరం

మరి ఈ ప్రదేశం ఎక్కడ ఉందనేది ఎవ్వరికీ తెలియని మిస్టరీనే.. చారిత్రక ఆధారాల ప్రకారం హిమాలయాలను దాటుకుంటూ పోతే చైనాలోని గోభి ఎడారి వస్తుందని..దీనికి అంతు దరి ఉండదని దాన్ని దాటిన తర్వాత ఈ నగరం కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది.

హిమాలయాల్లో హిట్లర్‌ వెతికినా చిక్కని అదృశ్య నగరం

హిమాలయాల నడిబొడ్డులో హిమవన్నాగాల మధ్య మంచు దిబ్బలు, దట్టమైన మేఘాలు, కొండలు, కోనలు దాటుకుంటూ పోతే ఈ రహస్య నగరం కనిపిస్తుందని ఒకవేళ ఆ ప్రదేశానికి చేరుకుంటే చావుకు దగ్గరగా చేరుకున్నట్లేనని బౌద్ధ గ్రంధాలు చెబుతున్నాయి.

హిమాలయాల్లో హిట్లర్‌ వెతికినా చిక్కని అదృశ్య నగరం

కొంతమంది పరిశొధకులు, చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం శంబాలా టిబెట్ హిమాలయాలలోని కున్లున్ పర్వత సమూహం తో కలిసి ఉండొచ్చని అంటారు. ఆ శంబాలానే " శ్వేత దీపం" అని ద్రువ లొకం అనే పేర్లతో పిలుస్తారని వారు చెబుతున్నారు.

హిమాలయాల్లో హిట్లర్‌ వెతికినా చిక్కని అదృశ్య నగరం

మరి ఆ ప్రదేశం ఎక్కడ ఉందనేది ఇప్పటివరకు రహస్యమే.. అంతే కాదు ఆ ప్రదేశమనేది ఉందా అసలు ఉంటే ఎలా కనుక్కోవాలనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. మరి చారిత్రక పరిశోధకులు ఆ నగరాన్ని బయటి ప్రపంచానికి అందిచే రోజు కొరకు వేచి చూడాల్సిందే.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Ancient Hidden Mystery of the Kingdom of Shambhala
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot