ప్రోగ్రామింగ్ నేర్చుకునేందుకు బెస్ట్ వెబ్‌సైట్స్

ఆన్‌లైన్‌లో ప్రోగ్రామింగ్ నేర్పించేందుకు బెస్ట్ ప్రోగ్రామింగ్ వెబ్‌సైట్స్ సిద్ధంగా ఉన్నాయి

|

సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లో రాణించాలనుకునే వారికి కమ్యూనికేషన్ స్కిల్స్‌తో పాటు ఐటీ స్కిల్స్‌ అనేవి చాాలా ముఖ్యం. సాఫ్ట్‌వేర్ జాబ్ సాధించాలంటే ఎన్నో ప్రోగ్రామింగ్ కోర్సులు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం చాలామంది మంచి పేరున్న ఇనిస్టిట్యూట్‌లో జాయిన్ అయి నిపుణుల దగ్గర గెడైన్స్ తీసుకుంటారు. అయితే ఇంగ్లీష్ మీద కొంచెం పట్టున్న వారికి ఆన్‌లైన్‌లో ప్రోగ్రామింగ్ నేర్పించేందుకు బెస్ట్ ప్రోగ్రామింగ్ వెబ్‌సైట్స్ సిద్ధంగా ఉన్నాయి. వీటి ముందు మీ సమయాన్ని రోజుకు ఒక 30 నిమిషాలు కేటాయిస్తే చాలు పోగ్రామింగ్ లాంగ్వేజ్‌ను సులువుగా నేర్చుకోవచ్చు.

డబ్ల్యూ3స్కూల్స్

డబ్ల్యూ3స్కూల్స్

W3schools

ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లను నేర్పిస్తోన్న ప్రముఖ వెబ్‌సైట్‌లలో W3schools.com ఒకటి. ఈ వెబ్‌సైట్ ఆఫర్ చేసే అన్ని ప్రోగ్రామింగ్ కోర్సులను ఉచితంగా నేర్చుకోవచ్చు. ఈ సైట్ కోర్సులను చాప్టర్‌లుగా మార్చి అర్థవంతంగా వివరిస్తుంది. ప్రాక్టీస్ చేసుకునేందుకు కోడింగ్ ఎడిటర్ కూడా అందుబాటులో ఉంటుంది. W3schools.comలో అందుబాటులో ఉన్న కోర్సులు వివరాలు.. HTML/CSS, JavaScript, HTML Graphics, Server Side, XML Tutorials, WEB Building Web Building

 

కోడ్‌అకాడమీ

కోడ్‌అకాడమీ

Codecademy

ఆన్‌లైన్‌లో కోడింగ్ నేర్చుకోవాలనుకునే వారికి Codecademy బెస్ట్ ఛాయిస్. ఈ వెబ్‌సైట్ మెయిన్ పేజీలోనే ప్రోగ్రామింగ్‌ను ప్రాక్టీస్ చేసుకునే సదుపాయం ఉంటుంది. Codecademy ఆఫర్ చేస్తున్న కోర్సుల వివరాలు Web Fundamentals, PHP, JavaScript, jQuery, Python, Ruby, APIs

 

ట్రీహౌస్

ట్రీహౌస్

Treehouse

వెబ్‌సైట్ లేదా అప్లికేషన్‌ను అభివృద్ధి చేయాలనుకుంటున్న వారు Treehouse వెబ్‌సైట్‌ను సందర్శించినట్లయితే పూర్తిస్థాయిలో అవగాహనను పెంపొందించుకోవచ్చు. ఈ సైట్‌కు విజిటర్స్ తాకడి చాలా ఎక్కువ.

 

కోడ్ అవెంజర్స్

కోడ్ అవెంజర్స్

Code Avengers

ఆన్‌లైన్‌లో కోడింగ్ నేర్చుకునేందుకు Code Avengers వెబ్‌సైట్ మరొక ఆప్షన్. ఈ సైట్‌ను ప్రత్యేకించి ప్రోగ్రామింగ్ నేర్పించటానికే డిజైన్ చేసారు. సైట్ ఆఫర్ చేస్తున్న కోర్సుల వివరాలు.. HTML5, CSS3, JavaScript

 

 ది కోడ్ ప్లేయర్

ది కోడ్ ప్లేయర్

TheCodePlayer

HTML5, CSS3, జావాస్క్రిప్ట్ వంటి కోర్సులను ఇందులో నేర్చుకోవచ్చు. పలువురు నిపుణుల ఆధ్వర్యంలో రూపొందించబడిన కొన్ని సింపుల్ ప్రాజెక్ట్లను ఇందులో అందిస్తున్నారు. దీని ద్వారా యూజర్లు వాటిని సులువుగా నేర్చుకునేందుకు వీలుంది.
రూబీ కోన్స్

రూబీ కోన్స్

rubykoans

రూబీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ను నేర్చుకోవాలనుకునే వారి కోసం ఈ వెబ్సైట్ను ప్రత్యేకంగా అందుబాటులోకి తెచ్చారు. రూబీ లాంగ్వేజ్, సింటాక్స్, స్ట్రక్చర్, ఫంక్షన్లు, లైబ్రరీలు వంటి ఎన్నో అంశాలను ఇందులో నేర్చుకోవచ్చు.

 

స్టేక్ ఓవర్‌ఫ్లో

స్టేక్ ఓవర్‌ఫ్లో

stackoverflow

సి, సి ++, సి #, j క్వెరీ, పైథాన్, CSS వంటి కోర్సులను దీంట్లో నేర్చుకోవచ్చు. ఇవన్నీ యూజర్లకు ఉచితంగా లభిస్తున్నాయి. దీంతోపాటు ఇందులోని డెవలపర్లు, యూజర్లకు కనెక్ట్ అవడం ద్వారా వారి సలహాలు, సూచనలు, మెళకువలను తెలుసుకునేందుకు వీలుంది.

 

టట్స్ ప్లస్

టట్స్ ప్లస్

code.tutsplus

వెబ్‌ డెవలప్‌మెంట్, వర్డ్ ప్రెస్, మొబైల్ డెవలప్‌మెంట్, PHP, ఫ్లాష్, జావా స్క్రిప్ట్, iOS SDK, CMS తదితర కోర్సులను దీంట్లో అభ్యసించవచ్చు. ట్యుటోరియల్స్, ఆర్టికల్స్, టిప్స్, వీడియోలు ఇలా ఆయా సబ్జెక్టులకు చెందిన పాఠ్యాంశాలు ఇందులో ఉన్నాయి.

 

Best Mobiles in India

English summary
Best Websites To Learn Programming. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X