55 దేశాలను నమ్మించి నిలువు దోపిడి చేస్తున్న చైనా, గత 5ఏళ్ల నుంచి..!

|

చైనా..ఈ దేశం ఇప్పుడు అన్ని రంగాల్లో ప్రపంచానికి సవాల్ విసురుతూ ముందుకు దూసుకెళుతోంది.. అయితే అంతే వేగంతో ఇతర దేశాలను నమ్మిస్తూ వారిని దోచుకుంటోందనే కథనాలు వస్తున్నాయి. నమ్మకం పేరుతో పేద దేశాలను ఆకట్టుకుని ఆ దేశాల ప్రధాన డేటాను చౌర్యం చేస్తుందని సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. షాంఘై వేదికగా ఈ వ్యవహారం నడుస్తోందని తెలుస్తోంది. దీనిని ఊతమిస్తూ ఆఫ్రికన్‌ యూనియన్‌(ఏయూ) చైనాపై అగ్గి మీద గుగ్గిలమయింది.స్నేహం పేరుతో గిఫ్ట్‌గా ఇచ్చిన భవనం ద్వారా చైనా గూఢచర్యానికి పాల్పడుతోందని ఆఫ్రియన్‌ ఏయూ ఆరోపరణల వర్షం గుప్పిస్తోంది.

 

సొంత గూటిలో షియోమికి దిమ్మతిరిగే షాకిచ్చిన హానర్సొంత గూటిలో షియోమికి దిమ్మతిరిగే షాకిచ్చిన హానర్

ఆఫ్రికా ఖండంలోని 55 దేశాలన్నీ కలిసి..

ఆఫ్రికా ఖండంలోని 55 దేశాలన్నీ కలిసి..

2001లో ఆఫ్రికా ఖండంలోని 55 దేశాలన్నీ కలిసి ఆఫ్రికన్‌ యూనియన్‌గా ఏర్పడ్డాయన్న విషయం అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఆ తర్వాత సంవత్సరం ఆఫ్రికాలోని కొంచెం సంపన్న దేశమైన ఇథియోపియా రాజధానిలోని అడ్డిస్‌ అబాబాలో ఏయూ ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నాయి.ఆఫ్రికా దేశాల అభివృద్ధి కోసం ఈ యూనియన్ ఏర్పడింది.

 వ్యాపారం పేరుతో ..

వ్యాపారం పేరుతో ..

అయితే ప్రపంచ శక్తిగా ఎదగాలని ఉవ్విళ్లూరుతున్న చైనా ఈ కూటమిపై కన్నేసింది. వ్యాపారం పేరుతో ఆకర్షించింది. అందులో భాగంగా Belt and Road Initiative (BRI)లో ఈ దేశాలను భారీగా పెట్టుబడులు పెట్టాలని కోరింది. ఇది మొత్తం 68 దేశాలను కలిపే బృహత్తరమైన ప్రాజెక్టు.

200మిలియన్ డాలర్లతో నిర్మించిన భవనాన్ని..
 

200మిలియన్ డాలర్లతో నిర్మించిన భవనాన్ని..

ఈ ప్రాజెక్టులో పెట్టుబడి పెట్టిన ఆఫ్రికా దేశాలకు చైనా ఇథియోపియా రాజధానిలోని అడ్డిస్‌ అబాబాలో 200మిలియన్ డాలర్లతో నిర్మించిన భవనాన్ని బహుమతిగా అందించింది. ఆ కార్యాలయంలోనే ఏయూ ప్రధాన సమాచారమంతా దాగి ఉంది. 

కంప్యూటర్ల నుంచి సమాచారాన్ని..

కంప్యూటర్ల నుంచి సమాచారాన్ని..

ఈ భవనంలోని కంప్యూటర్ల నుంచి సమాచారాన్ని తస్కరిస్తోందని ఏయూ ఆరోపిస్తోంది. ఏయూ సర్వర్ల ద్వారా ప్రధాన డేటా అంతా షాంఘైలోని ఓ బేస్‌కు చేరుతున్నాయని ఫ్రెంచ్‌ వార్తపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.

నిజంగానే డేటా తస్కరణకు గురవుతున్నట్లు..

నిజంగానే డేటా తస్కరణకు గురవుతున్నట్లు..

దీంతో ఖంగుతిన్న ఏయూ దీనిపై పరిశోధనలు సాగించింది. ఈ పరిశోధనల ద్వారా ఏయూ సర్వర్ల ద్వారా నిజంగానే డేటా తస్కరణకు గురవుతున్నట్లు గుర్తించింది. మిగిలిన సమాచారం చోరికి తరలిపోకుండా అడ్డుకుంది.

దీనికి ప్రధాన కారణం..

దీనికి ప్రధాన కారణం..

Belt and Road Initiative (BRI)లో పెట్టుబడులు పెట్టేందుకు ఆఫ్రికన్ దేశాలు భారీ మొత్తంలో చైనా నుంచి అప్పులు తీసుకున్నాయి. బీఆర్‌ఐలో పెట్టిన పెట్టుబడుల మొత్తానికి ఏటా భారీగా వడ్డీలు చెల్లించాల్సి వస్తుండటంతో ఆఫ్రికన్‌ దేశాలు చైనాకు వ్యతిరేకంగా గొంతెత్తాయి. దీంతో చైనా కూడా తన మెదడుకు పనిచెప్పినట్లు తెలుస్తోంది.

షాంఘైలోని ఓ బేస్‌కు..

షాంఘైలోని ఓ బేస్‌కు..

2012 నుంచి నేటి వరకూ గత ఐదేళ్లుగా ప్రతి రాత్రి ఏయూకి చెందిన రహస్యాలు షాంఘైలోని ఓ బేస్‌కు చేరుతున్నాయని ఫ్రెంచ్‌ పత్రిక కధనాలు ప్రచురించడంతో చైనా ఉలికిపాటుకు గురి అయింది. వార్తకథనాల తర్వాత జాగ్రత్తపడ్డ ఏయూ చైనా సర్వర్లను పక్కనపడేసింది. వాటికి ప్రత్యామ్నాయంగా కొత్త సర్వర్లను అందుబాటులోకి తెచ్చుకుంది.

 డెస్క్‌ల కింద పెద్దమొత్తంలో మైక్రోఫోన్‌లు..

డెస్క్‌ల కింద పెద్దమొత్తంలో మైక్రోఫోన్‌లు..

అల్జీరియా నుంచి అబాబాకు వచ్చిన భద్రతా బృందం డేటా చోరి వెతుకులాటలో డెస్క్‌ల కింద పెద్దమొత్తంలో మైక్రోఫోన్‌లు కూడా లభ్యమయ్యాయి. కాగా ఆ కార్యాలయానికి కొత్త సర్వర్లను ఏర్పాటు చేస్తామని చైనా ప్రకటించగా దీన్ని ఆఫ్రికా దేశాల కూటమి తిరస్కరించినట్లు సమాచారం.

ఈ ఊబిలో ఆసియా దేశాలు కూడా..

ఈ ఊబిలో ఆసియా దేశాలు కూడా..

కాగా ఈ ఊబిలో ఆసియా దేశాలు కూడా ఉన్నాయి. చైనా ఆసియా దేశాలైన శ్రీలంక, పాకిస్తాన్‌లకు బీఆర్‌ఐలో భాగంగా భారీగా నిధులును అప్పుగా ఇచ్చింది. అయితే ఈ ఆరోపణలను చైనా ఖండిస్తోంది. ఇలాంటి ఆరోపణల వల్ల ఆఫ్రికా-చైనా సంబంధాలు దెబ్బతినే ప్రభావం ఉందని హెచ్చరించింది.

Best Mobiles in India

English summary
Blow to China: African Union discovers data theft, espionage; ditches Chinese servers More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X