కలకత్తాను శోకసంద్రంలో ముంచిన భయానక దృశ్యాల వీడియో

Written By:

కలకత్తాను శోక సంద్రంలో ముంచిన ఫ్లై ఓవర్ ఎలా కూలిపోయిందనే భయానక వీడియో బయటకొచ్చింది. మొత్తం కలకత్తా నగరాన్ని అలాగే దేశాన్ని విషాదంలో నింపిన ఈ ఘటనకు సంబంధించిన భయానక దృశ్యాలు సీసీటీవిలో రికార్డయ్యాయి. ఈ సీసీటీవీ పుటేజిలను పశ్చిమె బెంగాల్ టీవీ ఛానళ్లు ప్రముఖంగా ప్రసారం చేసాయి. అయితే ఈ వీడియోను ఎవరో యూట్యూబ్ లో పోస్ట్ చేశారు.. ఇంత ఘోరంగా బ్రిడ్జి కూలిపోయిందా అన్నట్లుగా ఆ వీడియోలో ఉన్న దృశ్యాలను బట్టి తెలుస్తోంది.

Read more: అంతు చిక్కని ఇండియా మిస్టరీల గుట్టు విప్పేదెలా...?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1

సీసీటీవీ ఫుటేజీలోని దృశ్యాల ప్రకారం .. కోల్‌కతాలో నిత్యం రద్దీగా ఉండే వివేకానంద రోడ్డులో గురువారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో కార్లు, ఆటో రిక్షాలు, ఇతర వాహనాలు వెళ్తున్నాయి. ఆ రోడ్డుపై పాదచారులు నడుచుకుంటూ వెళ్తున్నారు. మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉండటంతో జన సంచారం కాస్త తక్కువగా ఉంది.

2

అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతంలో ఒక్కసారిగా భయానక పరిస్థితి ఏర్పడింది. నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ అకస్మాత్తుగా కూలిపోవడంతో రోడ్డుపై వెళ్తున్న పాదచారులు, వాహనదారులు శిథిలాల కింద చిక్కుకుపోయారు.

rnrn

7

ఆ భయానక దృశ్యాల వీడియో

3

ఈ ప్రమాద ఘటనలో 25 మంది మరణించగా, మరో 150 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఫ్లై ఓవర్ ను ఐవిఆర్‌సీఎల్ ఇన్‌ఫ్రా‌స్ట్రక్చర్ కంపెనీ నిర్మిస్తోంది. అయితే నిర్మాణంలో ఉండగానే ఫ్లై ఓవర్ కూలిపోవడంతో ఆ కంపెనీ షేర్లు ఒక్కసారిగా పడిపోయాయి.

4

2009 డిసెంబర్ లో ఈ ప్లై ఓవర్ నిర్మాణం ప్రారంభమైనా ఇప్పటీకి తీవ్ర జాప్యం జరుగుతూనే ఉంది. 2016 మార్చి నాటికి ఇంకా 25 శాతం పని పెండింగ్ లో ఉంది. దీన్ని ఇప్పటికే పలు సార్లు డిజైన్ చేశారు. కోర్టు కేసుతో ఇన్నాళ్లు ఆలస్యమైనట్లు తెలుస్తోంది.

5

అయితే ఇందులో మా తప్పేమి లేదని అది యాక్ట్ ఆఫ్ గాడ్ అంటూ కంపెనీ యాజమాన్యం కొత్త భాష్యం చెబుతోంది. హిందీలోని 'ఓ మై గాడ్', తెలుగులో వచ్చిన 'గోపాల గోపాల' చిత్రంలో ఉపయోగించిన 'యాక్ట్ ఆఫ్ గాడ్' పదాన్ని ఐవీఆర్సీఎల్ యాజమాన్యం కూడా ఉపయోగించుకుంది.

6

హైదరాబాద్ కు చెందిన ఐవీఆర్సీఎల్ సంస్థ పై మూడు, మరో నలుగురు అధికారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక సాయం చేయాల్సిన రాజకీయ పార్టీలు దీనికి రాజకీయ రంగు పులిమి తమ పబ్బం గడుపుకునే పనిలో బిజీగా ఉన్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Caught on camera The Kolkata flyover comes crashing down in youtube
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot