ఇవిగోండి ఆండ్రాయిడ్ స్మార్ట్ సైకిల్స్

|

లాస్‌వేగాస్ వేదికగా జరుగుతోన్న కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో 2017 (CES 2017)ను పురస్కరించుకుని చైనా స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లీఇకో (LeEco) రెండు స్మార్ట్ సైకిళ్లను అనౌన్స్ చేసింది. స్మార్ట్‌రోడ్ బైక్, స్మార్ట్‌ మౌంటేన్ బైక్ పేర్లతో ఈ స్మార్ట్ సైకిళ్లను లీఇకో ప్రపంచానికి పరిచయం చేసింది.

ఇవిగోండి ఆండ్రాయిడ్ స్మార్ట్ సైకిల్స్

Read More : మీ ఆధార్ బయోమెట్రిక్ సురక్షితమేనా? లాక్ చేయటం ఎలా?

ఆండ్రాయిడ్ 6.0 Marshmallow ఆధారంగా డిజైన్ చేసిన Bike ఆపరేటింగ్ సిస్టం పై ఈ సైకిళ్లు రన్ అవుతాయి. టర్న్ బై టర్న్ నేవిగేషన్‌ను తెలుసుకునేందుకు ప్రత్యేకమైన 4 అంగుళాల టచ్ స్ర్కీన్ డిస్‌ప్లేను ఈ సైకిల్స్‌లో ఏర్పాటు చేసారు. . టర్న్ బై టర్న్ నేవిగేషన్ ఫీచర్ గూగుల్ మ్యాప్స్‌తో అనుసంధానమై పనిచేస్తుంది. క్వాడ్-కోర్ స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్‌తో పాటు 6000mAh రీఛార్జబుల్ బ్యాటరీని ఈ బైక్స్‌లో పొందుపరిచారు.

ఇవిగోండి ఆండ్రాయిడ్ స్మార్ట్ సైకిల్స్

Read More : Ransomware అంటే ఏంటి..?

వాకీ-టాకీ ఫీచర్‌తో వస్తోన్న ఈ బైక్స్ ద్వారా రైడర్లు ఇతర లీఇకో స్మార్ట్‌బైక్ రైడర్లతో మాట్లాడుకోవచ్చు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మ్యూజిక్ ప్లేబ్యాక్ ఫీచర్ ద్వారా రైడర్ మ్యూజిక్‌ను ఆస్వాదించవచ్చు. జీపీఎస్/గ్లోనాస్, కంపాస్, యాక్సిలరోమీర్, బారోబీటర్, లైట్ లెవన్, వీల్ స్పీడ్, క్రాంక్ స్పీడ్ వంటి ఆన్‌బోర్డ్ సెన్సార్లను ఈ బైక్స్‌లో నిక్షిప్తం చేసారు. థర్డ్ పార్టీ ANT+ హార్డ్ రేట్ సెన్సార్లను సైతం ఈ బైక్ సపోర్ట్ చేస్తుంది.

ఇవిగోండి ఆండ్రాయిడ్ స్మార్ట్ సైకిల్స్

Read More : ఒకే ఆండ్రాయిడ్ ఫోన్‌లో రెండు ఫేస్‌బుక్ అకౌంట్‌లను వాడుకోవటం ఎలా?

IP54 రేటింగ్స్‌తో వస్తోన్న ఈ స్మార్ట్ట్ బైక్‌లను నీటిలో సైతం రైడ్ చేయవచ్చు. సేఫ్టీ ఇంకా సెక్యూరిటీ నిమిత్తం ఆన్-బోర్డ్ లైటింగ్, హార్న్, సెక్యూరిటీ అలారమ్ వంటి ప్రత్యేకతలు ఈ బైక్స్‌లో ఉన్నాయి. ఇండియన్ మార్కెట్లో ఆ బైక్స్ ధర ఎంత ఉంటుందో, ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో తెలియాల్సి ఉంది.

Best Mobiles in India

English summary
CES 2017: LeEco Launches Two Android Powered Smart Bikes. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X