అమెరికా శాటిలైట్లను ఆకాశంలోనే పేల్చేందుకు రష్యా, చైనా కుట్ర

By Hazarath
|

ఆకాశంలోనే అమెరికా శాటిలైట్లను పేల్చేందుకు రష్యా, చైనా ఒక్కటయ్యాయి. అమెరికా మిలిటరీకి చెందిన శాటిలైట్లను ధ్వంసం చేసే దిశగా ఈ రెండు దేశాలు సరికొత్త స్కెచ్‌లు వేస్తున్నాయి. అమెరికా మిలిటరీకి చెందిన శాటిలైట్లు ఆకాశంలో చాలానే చక్కర్లు కొడుతున్నాయి. వాటిని అమెరికాకు తెలియకుంగా పేల్చేయాలని రష్యా చైనా భావిస్తున్నట్లు అమెరికా ఎయిర్ ఫోర్స్ కమాండర్ ఈ మేరకు కాంగ్రెస్ సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. చైనా, రష్యాలు కలిసి శాటిలైట్లను ధ్వంసం చేయడానికి సైబర్ టూల్ ను డెవలప్ చేస్తున్నాయని ఆయన చెబుతున్నారు. చైనా, రష్యా ఎత్తుగడలపై స్పెషల్ స్టోరీ.

Read more: అమెరికా ఉగ్ర దాహానికి లక్షల మంది బలి

1

1

ఆకాశంలో అమెరికా శాటిలైట్లను పేల్చేందుకు చైనా రష్యాలు సైబర్ టూన్ ను డెవలప్ చేస్తున్నాయని, ఈ దేశాలతో అమెరికాకు పెను ప్రమాదం పొంచి ఉందని జనరల్ జాన్ హైటన్ చెబుతున్నారు. అంతరిక్షంలోని అమెరికా మిలిటరీ శాటిలైట్లను లేజర్ల సహాయంతో గుర్తించి వాటిని డౌన్ షూట్ చేస్తున్నారని అమెరికా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

2

2

అంతరిక్షంలో శాటిలైట్ల గమనాన్ని నిర్దేశించే టూల్స్ ను రష్యా చైనా అభివృద్ధి చేస్తున్నాయని ఈ టూల్ తో అమెరికా శాటిలైట్లు వ్యతిరేక దిశలోకి మారే అవకాశం కూడా ఉందని ఆరెండు దేశాల చేతుల్లోకి ఈ శాటిలైట్లు వెళ్లే ప్రమాదముందని ఆయన చెబుతున్నారు.

3
 

3

ఇంతకు ముందు కూడా ఈ విషయాన్ని అమెరికా మిలిటరీ వర్గం ధ్రువీకరించింది. లెప్ట్ జనరల్ జే రేమండ్ అభిప్రాయం ప్రకారం చైనా అత్యంత శక్తివంతమైన యాంటీ ఉపగ్రహాలను కలిగి ఉంది. వాటి ద్వారా శత్రు దేశాల ఉపగ్రహాలను వెంటనే ధ్వంసం చేయవచ్చు.

 

 

4

4

శత్రు దేశాల నుంచి దూసుకువచ్చే శాటిలైట్లను ,అలాగే మిసైల్స్ ను ఒకే ఒక క్షణంలో ఈ యాంటీ శాటిలైట్లు నామరూపాల్లేకుండా చేస్తాయి.ఈ ఉపగ్రహాలతో చైనా అంతరిక్షంలో చక్కర్లు కొడుతున్న ఇతర దేశాల ఉపగ్రహాలపై కన్నేసిందని ఆయన అంటున్నారు. ఈయన అమెరికాలో ఎయిర్ ఫోర్స్ 4వ కమాండర్.

 

 

5

5

బీజింగ్ లో ఇప్పటికే అతి చిన్న శాటిలైట్లను నియత్రించే అత్యంత సమర్థవంతమైన యాంటీ శాటిలైట్లు రెడీగా ఉన్నాయని ఇవి కక్ష్యలో తిరుగాడే ప్రతి శాటిలైట్ ను ధ్వంసం చేసే శక్తిని కలిగి ఉన్నాయని ఈ యాంటి శాటిలైట్లకు అంత సామర్ధ్యం ఉందని ఆయన అభిప్రాయపడుతున్నారు.

 

 

6

6

చైనా ఇప్పటికే ఈ పనులు ప్రారంభించిందని గత జులైలో యాంటీ శాటిలైట్ మిస్సైల్ టెస్ట్ ను అత్యంత సమర్థవంతంగా పూర్తి చేసిందని వాస్తవాన్ని వెల్లడించారు. అప్పుడు చైనా తన ఉపగ్రహాన్ని అంతరిక్షంలో తనే నాశనం చేసుకుంది కూడా.

7

7

జులైలో చైనా బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ సిస్టంకు సంబంధించిన టెస్ట్ ను విజయవంతంగా పూర్తి చేసింది. అయితే ఇది రక్షణ వ్యవస్థకి సంబంధించింది కాదని ఇదొక యాంటీ శాటిలైట్ మిషన్ అని యుఎస్ గవర్నమెంట్ వారం రోజుల తర్వాత నిర్థారించింది.ముఖ్యంగా భూమికి దగ్గరగా తిరుగాడే ఉపగ్రహాలను టార్గెట్ చేసేందుకు ఈ వెపన్స్ సిస్థంకు చైనా పదును పెడుతోందని తెలుస్తోంది.

 

 

8

8

దీనిపై అమెరికా చైనాను వివరణ కోరగా చైనా బదులివ్వకుండా తన పని తాను చేసుకుంటూ పోతుందని, విధ్వసంక పరీక్షలకు సంబంధించిన టెస్ట్ లు దానికి సంబంధించిన డెవలప్ మెంట్లు చేసుకుంటూ పోతోందని అమెరికా అంటోంది.

 

 

9

9

ఈ యాంటి శాటిలైట్ ద్వారా అన్ని దేశాల శాటిలైట్లు ప్రమాదంలో పడే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించి అమెరికా తమ శాటిలైట్లను రక్షించుకోడానికి ఇప్పటికే రక్షణ చర్యలు ప్రారంభించింది.

 

 

10

10

అయితే ఇలా ప్రయోగించడం చైనాకు ఇది తొలిసారి కాదు. మే 2013లో కూడా ఇదే తరహా శాటిలైట్లు ప్రారంభించింది. సౌత్ వెస్ట్ చైనాలోని జియాంగ్ శాటిలైట్ సెంటర్ నుంచి రాకెట్ ను లాంచ్ చేసింది. కక్ష్యలో తిరుగుతున్న శక్తివంతమైన కణాల రహస్యం తెలుసుకోడానికి అలాగే అయస్కాంత ధృవాల కోసం ఈ ప్రయోగాన్ని చేపట్టారు.

 

 

11

11

అయితే ఇది సక్సెస్ పుల్ గా శాస్ర్తవేత్తలు అనుకున్న డేటాను వారికి అందించడంలో విజయం సాధించిందని నేషనల్ స్పేస్ సెంటర్ పరిశోధనలో తేలింది.ఈ టెస్ట్ ను పరీక్షించిన తరువాత అమెరికా దీనిని నిజమా కాదా అని నిర్థారించుకోవడం కోసం తమ ప్రయత్నాలను ముమ్మరం చేసింది.

 

 

12

12

అయితే చైనా యాంటి మిస్సైల్ శాటిలైట్ ను పంపడం నిజమేనని వారి నిర్థారణలో వెల్లడైంది. చైనా పంపిన డాంగ్ నింగ్ 2 కింద నుంచే కక్ష్యలో తిరుగుతన్న మిస్సైల్స్ ను ధ్వంసం చేయగలదని తేలింది. 

13

13

ఈ యాంటీ శాంటిలైట్లు టెక్నాలజీని సర్వనాశనం చేస్తాయని..ఇవి చాలా డేంజర్ తో కూడుకున్నవని సమాచారం మొత్తం వారి చేతుల్లోనే కేంద్రీకృతమవుతుందని అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

 

 

14

14

ఇక 1985లో తన వెదర్ శాటిలైట్ స్లోవిండ్‌ను అమెరికా... ఇదే పద్దతిలో కూల్చేసింది. సెప్టెంబర్ 13, 1985న భూమికి 555 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తున్న ఉపగ్రహాన్ని.. ఎఫ్-15 నుంచి దూసుకెళ్లిన మిసైల్ తునాతునకలు చేసింది..

15

15

దాదాపు రెండు దశాబ్దాలపాటు ప్రశాంతంగా ఉన్న అంతరిక్షంలో చైనా బాంబుపేల్చింది. 2007, జనవరి 17న యాంటీ శాటిలైట్ టెస్ట్ జరిపింది. ఫెంగ్‌యున్ - 1సి వెదర్ శాటిలైట్ చెడిపోయిందని చెప్పిన చైనా.. S-19 మిసైల్‌ను పంపించి.. దాన్ని పేల్చేసింది. చైనా ఉపగ్రహం దాదాపు 40 వేల ముక్కలైనట్లు అంచనా.

16

16

ఈ వాదన వెనుక చెడిపోయిన ఉపగ్రహాన్ని నాశనం చేయడానికే పేల్చేశామని చైనా చెబుతున్నా.. దాని ఆంతర్యం మాత్రం వేరన్న సంగతి అందరికీ తెలిసిందే. శత్రుదేశాల ఉపగ్రహాలను నాశనం చేయగల సత్తా తనకుందని నిరూపించుకోవడానికే చైనా ఈ ప్రయోగం చేసిందన్న వాదనా ఉంది.

 

 

17

17

అయితే అమెరికా మాత్రం అనూహ్యంగా రియాక్ట్ అయ్యింది. చైనాను తలదన్నే రీతిలో యాంటీశాటిలైట్ వెపన్ సిస్టంను ప్రయోగించింది. 2006 డిసెంబర్ 14న అమెరికా ప్రయోగించిన నిఘా ఉపగ్రహం USA - 193ని ఈ ప్రయోగానికి ఎన్నుకొంది. పసిఫిక్ సముద్రంలో మోహరించిన యుద్ధ నౌక నుంచి ఫిబ్రవరి 20, 2008న SM-3 మిసైల్‌ను పంపి స్పై శాటిలైట్‌ను కూల్చేసింది.

 

 

18

18

చైనా చూపించిన సాకునే అమెరికా ఇక్కడా చూపించింది. ఈ స్పై శాటిలైట్ పనిచేయడం లేదన్న అమెరికా అందులో 450 కిలోల టాక్సిక్ హైడ్రోజన్ ఉందని అది భూమిపై కూలిపోతే పెను ప్రమాదం జరుగుతుందని ఊదరగొట్టింది.కానీ వాస్తవం మాత్రం వేరు.చైనాకు దీటుగా తన శక్తిసామర్థ్యాలను ప్రదర్శించడానికే ఈ ప్రయోగం చేసిందన్నది వాస్తవం.

 

 

19

19

రష్యా దగ్గర కూడా శాటిలైట్ కిల్లర్స్ ఉన్నాయి. శత్రుదేశ ఉపగ్రహాన్ని గుర్తించిన వెంటనే భూమిపై నుంచి మిసైల్స్ దూసుకువెళతాయి. శాటిలైట్‌కు చేరువలోకి వచ్చిన తర్వాత వాటంతట అవే పేలిపోతాయి. దీంతో శాటిలైట్ కూడా నాశనమవుతుంది. 

20

20

దాదాపు కిలోమీటర్ ముందే మిసైల్ పేలినా శాటిలైట్ విధ్వసం కావడం ఖాయం. అయితే మిసైల్స్ ద్వారా కన్నా లేజర్ కిరణాల ద్వారానే ఇతర దేశాల శాటిలైట్లను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తోంది రష్యా.2010లో ఒకటి అలాగే జనవరి 2013లో ఇలాంటి యాంటి శాటిలైట్లను ప్రయోగించింది.

21

21

అయితే రష్యా కన్నా చైనా పంపిన ఈ యాంటి శాటిలైట్లతో అమెరికాకే ఎక్కువ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని తెలుస్తోంది. అమెరికానే అంతరిక్షంలో ఎక్కువ శాటిలైట్లను పంపిన విషయం అందరికీ తెలిసిందే.

 

 

22

22

అమెరికా, సోవియెట్ యూనియన్‌లే ఈ విధ్వంసకర ఆయుధాల తయారీకి శ్రీకారం చుట్టాయి. కోల్డ్‌వార్ సమయంలోనే ఈ రెండు దేశాలు కలిసి దాదాపు 54 సార్లు ఈ యాంటీ శాటిలైట్ వెపన్స్‌ను పరీక్షించాయి.ఒకదేశంపై మరొకటి దాడి చేయడం కోసం కొన్ని నెలలపాటు వీటిని ప్రయోగానికి సిద్ధంగా మోహరించాయి.

 

 

23

23

ఇక ఢిపెన్స్ పేరుతో అమెరికా అంతరిక్షంలోకి తన శాటిలైట్లను పంపి ప్రపంచం మొత్తాన్ని తన ఆదీనంలోకి తెచ్చుకోవాలని చూస్తోంది. దీనికి ప్రతిగా చైనా తన యాంటీ శాటిలైట్లతో అమెరికాకు ధీటుగానే సమాధానం చెప్పేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది.

 

 

24

24

అయితే పెంచిన పామే కాటేసినట్లు ఇప్పుడు అమెరికా తన శాటిలైట్లను రక్షించుకోడానికి అలాగే చైనాను ఎదుర్కోవడానికి దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. మరి ముందు ముందు ఇది ఏ తీరాలకు చేరుతుందో చూడాలి.

Best Mobiles in India

English summary
Here Write China, Russia Planning Space Attacks on U.S. Satellites

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X