కంప్యూటర్ వైరస్ గురించి సంచలన నిజాలు

ఈ మధ్య కాలంలో వైరస్ అనే పదం ఇంటర్నెట్ ప్రపంచాన్ని తీవ్రంగా వణికిస్తోంది. రోజుకో రకంగా పట్టుకొస్తున్న వైరస్‌లు కంప్యూటర్లతో పాటు స్మార్ట్‌ఫోన్‌లలోని డేటాను పూర్తిగా తుడిచిపెట్టేస్తున్నాయి. వైర‌స్‌లను ధీటుగా ఎదుర్కొనేందుకు కొత్తకొత్త యాంటీవైరస్ ప్రోగ్రామ్‌లు మార్కెట్లోకి వస్తున్నప్నటికి వీటిని తలదన్నే రీతిలో వైరస్ లు ప్రోగ్రామ్ కాబడుతున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వైరస్‌లనేవి చాలా రకాలుగా ఉంటాయి

వాస్తవానికి వైరస్‌లనేవి చాలా రకాలుగా ఉంటాయి. ఇవి ఒక్కసారిగనుకు స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్‌లోకి చొరబడినట్లయితే ఇంటర్నల్ వ్యవస్థను పూర్తిగా దెబ్బతీసేస్తాయి. నేటి స్పెషల్ ఫోకస్ స్టోరీలో భాగంగా కంప్యూటర్ వైరస్ గురించి పలు ఆసక్తికర విషయాలను మీతో షేర్ చేసుకోవటం జరుగుతోంది...

Self-Reproducing Automata (స్వీయ-పునరుత్పత్తి ఆటోమాటా)

కంప్యూటర్ వైరస్ ఐడియాను ప్రముఖ గణిత శాస్త్రజ్ఞుడు జాన్‌వాన్ న్యూమన్ 1940ల్లోనే తెరపైకి తీసుకువచ్చారు. ‘Theory of Self-Reproducing Automata' పేరుతో ఓ కాన్సెప్ట్‌ను కూడా ఈయన 1966లో పబ్లిష్ చేసారు. ఈయన చేపట్టిన సైద్ధాంతిక ప్రయోగంలో భాగంగా కోడ్ అనేది మెచీన్ బిహేవియర్‌ను ఏవిధంగా మార్చివేయగలదన్న విషయాన్ని ప్రస్తావించారు.

Infectious games

కంప్యూటర్ గేమ్స్ పై వైరస్ ముప్పు అనేది 1959 నుంచే ప్రారంభమైంది. ఆ రోజుల్లో విక్టర్ వైషోటస్కీ, హెచ్. డగ్లస్ మక్లెరాయ్ మరియు రాబర్ట్ పి మోరిస్లు రూపొందించిన కంప్యూటర్ గేమ్ ‘Core Wars'కు వైరస్ ముప్పు తప్పలేదు. ‘organisms' పేరుతో అటాక్ అయిన ఈ వైరస్ గేమ్‌ను పూర్తిగా డ్యామేజ్ చేసింది.

క్రీపర్ ప్రోగ్రామ్ వైరస్

1971లో బాబా థామస్ అనే వ్యక్తి రూపొందించిన క్రీపర్ ప్రోగ్రామ్ వైరస్ విభాగంలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చింది. ఈ వైరస్ సోకిన డివైస్ లో ‘I'M THE CREEPER. CATCH ME IF YOU CAN!'అనే మెసేజ్ ప్రత్యక్షమయ్యేది.

మొట్టమొదటి Trojan వైరస్‌

1974లో Rabbit పేరుతో కొత్త వైరస్ ఒకటి క్రియేట్ చేయబడింది. ఈ వైరస్ ప్రధాన లక్ష్యం సిస్టం స్పీడును తగ్గించివేయటం. 1975లో జాన్ వాకర్ అనే ప్రోగ్రామర్ మొట్టమొదటి Trojan వైరస్‌ను అభివృద్థి చేసారు. ‘ANIMAL' పేరుతో అభివృద్థి కాబడిన ఈ ప్రోగ్రామ్ అప్పట్లో సంచలనమైంది.

ద బ్రెయిన్ బూట్ సెక్టార్

తమ సాఫ్ట్‌వేర్‌లను అక్రమంగా కాపీ చేసేస్తున్నారన్న ఉద్దేశ్యంతో అన్నదమ్ములైన బాసిట్, అంజద్ ఫరూఖ్ అల్విలు 1986లో బ్రెయిన్ పేరుతో ఓ వైరస్‌ను సృష్టించారు. ఈ వైరస్ కంటెంట్‌ను కాపీ చేయకుండా అడ్డుకుంటుంది.

లవ్ లెటర్, హార్ట్ బ్లీడ్

1995 నుంచి వైరస్‌లు ఈమెయిల్స్‌లోకి చొరబడటం మొదలు పెట్టేసాయి. ఒనెల్ డే గుజ్మన్ అనే ప్రోగ్రామర్ డిజైన్ చేసిన ILOVEYOU అనే వైరస్ ఈ-మెయిల్స్ ద్వారా కంప్యూటర్లలోకి చొరబడి బాధితుడికి మెయిల్‌లో ఉన్న అన్ని కాంటాక్ట్స్‌కు వైరస్‌ను వ్యాపింపజేస్తుంది.

Heartbleed పేరుతో..

2014లో Heartbleed పేరుతో ఎంటర్ అయిన మరో వైరస్ ఇంటర్నెట్ ప్రపంచాన్ని వణికించేసింది. OpenSSLలోని లోపాలను అడ్డుపెట్టుకుని ఈ వైరస్ చెలరేగిపోయింది.

2017లో రెండు వైరస్ దాడులు..

మే, 2017లో రెండు వైరస్ దాడులు ప్రపంచాన్ని వణికించాయి. అందులో ఒకటి వన్నాక్రై ర్యాన్సమ్ వేర్ కాగా మరొకటి ‘Judy' మాల్వేర్. ఇంటర్నెట్ ఉన్నంత కాలం ఈ వైరస్‌లనేవి వ్యాపిస్తూనే ఉంటాయి. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Computer Virus – Things that are surprisingly older in the internet world. Read More in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot