2017లో భారత్‌ను వణికించిన సైబర్ దాడులు

|

2017కు గాను టెక్నాలజీ విభాగంలో అనేక నూతన ఆవిష్కరణలు చేసుకున్నప్పటికి వైరస్ దాడుల కారణంగా ప్రపంచ దేశాలు మాత్రం చిగురుటాకుల్లా వణికిపోయాయి. సైబర్ దాడుల కారణంగా నష్టపోయిన దేశాల్లో భారత్ కూడా ఒకటి. KPMG అడ్వైజరీ విడుదల చేసిన ఓ సర్వే ప్రకారం భారత్‌లోని 69 శాతం ఆర్గనైజేషన్స్ ర్యాన్సమ్‌వేర్‌ను ప్రధాన ముప్పుగా పరిగణిస్తే 43 శాతం ఆర్గనైజేషన్స్ మాత్రం తాము ఇప్పటికే ర్యాన్సమ్‌వేర్‌ దాడులను ఎక్స్‌పీరియన్స్ చేసినట్లు చెప్పుకొచ్చాయి.

Cyber attacks that affected India in 2017

2017లో ర్యాన్సమ్‌వేర్‌ దాడులకు సంబంధించి మొత్తం 40 సంఘటనలు ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్‌టి-ఇన్) దృష్టికి వెళ్లాయి. వాటిలో 34 ప్రమాదాలు వన్నాక్రై, పెట్యా ర్యాన్సమ్‌వేర్‌ల కారణంగా నమోదైనవే. వన్నాక్రై ర్యాన్సమ్‌వేర్‌కు సంబంధించిన మొదటి సంఘటన 2017 మే12న నమోదవ్వగా, పెట్యా ర్యాన్సమ్ వేర్‌కు సంబందించి రెండవ సంఘటన జూన్ 27, 2017న చోటు చేసుకుంది.

2017కుగాను ర్యాన్సమ్‌వేర్ ఘటనలతో పాటు సైబర్ సెక్యూరిటీకి సంబంధించి 27,000 రిస్క్ ఘటనలు తమ వద్ద నమోదైనట్లు సీఈఆర్‌టి తెలిపింది. వీటిలో ఫిషింగ్ దాడులతో పాటు వెబ్సైట్ చొరబాట్లు ఇంకా డేటా చోరీ సంఘటనలు ఉన్నాయని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ తెలిపింది. నమోదైన సంఘటనలను బట్టి చూస్తుంటే దేశవ్యాప్తంగా సైబర్ సెక్యూరిటీ నేరాలు క్రమక్రమంగా విస్తరిస్తున్నట్లు స్పష్టమవుతోంది. 2017కు గాను భారత్‌ను వణికించిన పలు భయానక సైబర్ దాడుల వివరాలను ఇప్పుడు తెలసుకుందాం...

వన్నాక్రై (WannaCry)

వన్నాక్రై (WannaCry)

సైబర్ దాడుల చరిత్రలోనే అతిపెద్ద దాడిగా వన్నాక్రై ర్యాన్సమ్ వేర్ చరిత్రకెక్కింది. మే, 2017లో తొలిసారిగా వెలుగులోకి వచ్చిన ఈ ప్రమాదకర వైరస్ ప్రపంచదేశాలను చిగురుటాకుల్లా వణికించింది. ఈ ర్యాన్సమ్‌వేర్ కారణంగా నష్టపోయిన దేశాల్లో భారత్ కూడా ఒకటి. కోల్‌కతా, ఢిల్లీ, భువనేశ్వర్, పూణే, ముంబై, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్రా, గుజరాత్, ఢిల్లీ నార్త్ సెంట్రల్ రీజియన్, ఒడిస్సాల రాష్ట్రల పై ఈ ర్యాన్సమ్‌వేర్ ప్రభావం ఎక్కువుగా పడింది.

ప్రపంచదేశాలను గడగడలాడించిన వన్నాక్రై రాన్సమ్‌వేర్ గురించి రోజుకో ఆసక్తికర విషయం వెలుగులోకి వస్తోంది. వాస్తావానికి ఈ రాన్సమ్‌వేర్ ప్రభావం.. విండోస్ పాత వర్షన్ ఆపరేటింగ్ సిస్టంలైన విండోస్ ఎక్స్‌పీ, విండో విస్టాల మీద ఎక్కువుగా ఉంటుందని అందరు భావించారు. అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ వన్నాక్రై రాన్సమ్‌వేర్ విండోస్ 7 యూజర్ల మీదే ఎక్కువుగా విరుచుకుపడినట్లు తెలుస్తోంది.

వన్నాక్రై ఎఫెక్టెడ్ విండోస్ వర్షన్స్‌కు సంబంధించి ప్రముఖ సెక్యూరిటీ సంస్థ kASPERSKY ఓ డేటాను విడుదల చేసింది. ఆ డేటా ప్రకారం చూస్తే విండోస్ 7 64 బిట్ యూజర్లనే వన్నాక్రై రాన్సమ్‌వేర్ టార్గెట్ చేసినట్లు స్పష్టమవుతోంది.

వన్నాక్రే రాన్సమ్‌వేర్ పట్ల మిమ్మల్ని అప్రమత్తం చేసేందుకు భారత్ సైబర్ భద్రత సంస్థ సీఈఆర్టీ పలు సూచనలు చేసింది. సీఈఆర్టీ అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లటం ద్వారా ఆ సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

1800-11-4949 టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ చేసి కూడా వివరాలను తెలుసుకోవచ్చు. ఒకవేళ మీ సిస్టం WannaCry రాన్సమ్‌వేర్‌ దాడికి గురైనట్లయితే incident.cert-in.org.inకు మెయిల్ ద్వారా సమచారం ఇవ్వాలని సీఈఆర్టీ కోరుతోంది.

Ransomware అనేది సైబర్ క్రిమినల్స్ సృష్టించే ఒక మాల్వేర్. దీన్నీ మీ పీసీలో హోస్ట్ చేసినట్లయితే, మీ అనుమతి లేకుండానే డివైస్ మొత్తం లాక్ అయిపోతుంది. అంతేకాదు, ఫోన్ ఆపరేషన్ మొత్తం అటాకర్స్ చెప్పుచేతుల్లోకి వెళ్లిపోతుంది.ఇక్కడి నుంచి సైబర్ క్రిమినల్స్ మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయటం ప్రారంభిస్తారు. కొంత నగదు చెల్లిస్తేనే ఫోన్‌ను అన్‌లాక్ చేస్తామని హెచ్చరికలు పంపుతుంటారు. ఈ నగదు చెల్లింపు అనేది బిట్ కాయిన్స్ ఇంకా ఇతర డిజిటల్ కరెన్సీల రూపంలో చేయాల్సి ఉంటుంది.

 పెట్యా (Petya)

పెట్యా (Petya)

వన్నాక్రై దాడి తరువాత సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. Petya పేరుతో వన్నాక్రై కంటే ప్రమాదకరమైన ర్యాన్సమ్‌వేర్‌ను రూపొందించి ఐరోపా దేశాల పై దాడికి తెగబడ్డారు. ఈ దాడుల ప్రభావం భారత్ పై కూడా పడింది. ఈ ర్యాన్సమ్ వేర్ కారణంగా యూరోప్‌ అంతటా కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు మాల్వేర్ బారిన పడ్డాయి. Petya ర్యాన్సమ్‌వేర్ ప్రభావం, ఉక్రెయిన్‌లోని ప్రభుత్వ సంస్థలతో పాటు విద్యుత్ సరఫరా విభాగాలు, విమానాశ్రయాలు, మెట్రో రైలు వ్యవస్థలపై తీవ్రంగా చూపింది.

పెత్యా ర్యాన్సమ్‌వేర్ ప్రభావం ముంబయిలోని జవహర్ లాల్ నెహ్రూ ఓడరేవు పైనా పడింది. ఇక్కడ మొత్తం మూడు టెర్మినల్స్ ఉండగా, వాటిలో ఒక టెర్మిన్‌లలోని కంప్యూటర్లు పూర్తిగా మెరాయించాయి. ఉక్రేనియన్ మీడియా కంపెనీ గ్లోబల్ వైర్ వెల్లడించిన వివరాల ప్రకారం మాల్వేర్ కారణంగా ఎఫెక్ట్ అయిన కంప్యూటర్ల నుంచి 300 డాలర్లను ( ఇండియన్ కరెన్సీలో రూ.19,300) బిట్ కాయిన్స్ రూపంలో హ్యాకర్లు డిమాండ్ చేసినట్లు పలు సంస్థలు వెల్లించాయి.

బీఎస్ఎన్ఎల్ మాల్వేర్ అటాక్ (BSNL Malware Attack)

బీఎస్ఎన్ఎల్ మాల్వేర్ అటాక్ (BSNL Malware Attack)

కర్నాటక సర్కిల్ పరిధిలోని బీఎస్ఎన్ఎల్ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్ పై మాల్వేర్ దాడి జరిగింది. ఈ వైరస్ దాడిలో భాగంగా 60,000 మోడెమ్‌లు ఎఫెక్ట్ అయ్యాయి. ఎఫెక్ట్ అయిన మోడెమ్‌లలోయూజర్ నేమ్, పాస్‌వర్డ్‌లు admin-adminకు డీఫాల్ట్‌గా మారిపోయాయి. దీంతో రౌటర్‌కు సంబంధించిన యూజర్‌నేమ్ అలానే పాస్‌వర్డ్‌లను తక్షణమే మార్చుకోవాలని బీఎస్ఎన్ఎల్ ఆదేశించింది.

శాంసంగ్ గెలాక్సీ ఎస్9 ఎలా ఉంటుందో తెలుసా..?శాంసంగ్ గెలాక్సీ ఎస్9 ఎలా ఉంటుందో తెలుసా..?

అనేక సంస్థల పైనా దాడులు

అనేక సంస్థల పైనా దాడులు

ఆన్‌లైడ్ ఫుడ్ ఆర్డరింగ్ సంస్థగా గుర్తింపుతెచ్చుకున్న జొమాటోను హాక్యర్లు ముప్పుతిప్పలు పట్టారు. ఈ సంస్థ సంబంధించిన డేటా బేస్‌ను మే 2017లో అగంతకులు హ్యాక్ చేసారు. ఈ దాడిలో భాగంగా 7.7 మిలియన్ యూజర్లకు సంబంధించిన డేటా గల్లంతైనట్లు తెలిసింది.

ఈ ఘటనకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా దొంగిలిచిన డేటాను డార్క్‌నెట్ మార్కెట్లో హ్యాకర్లు అమ్మకానికి ఉంచినట్లు వెల్లడైంది. ఈ క్రమంలో జొమాటో సంస్థ సదురు హ్యాకర్‌తో సంప్రదింపులు జరిపి డేటాను వెనక్కి తీసుకున్నట్లు తెలిసింది. అయితే ఈ డీల్‌కు సంబంధించిన వివరాలు ఇప్పటి వరకు వెల్లడికాలేదు.

జొమాటో సంస్థతో పాటుగా రిలియన్స్ జియోకు సంబంధించిన డేటాను కూడా హ్యాకర్లు లీక్ చేసారు. magicapk.com అనే అనుమానాస్పద వెబ్‌సైట్ రిలయన్స్ జియో కస్టమర్‌లకు సంబంధించిన వ్యక్తిగత డేటాను తన వెబ్‌సైట్‌లో ఉంచింది. విషయం ఇంటర్నెట్ ప్రపంచం మొత్తం పాకిపోవటంతో జియో ఆ వెబ్‌సైట్‌ను డౌన్ చేయించింది.

మిరాయ్ బోట్‌నెట్ మాల్వేర్ (Mirai Botnet Malware)

మిరాయ్ బోట్‌నెట్ మాల్వేర్ (Mirai Botnet Malware)

ఈ మాల్వేర్‌ను తొలత 2016లో గుర్తించారు. ఇప్పటికి ఈ మాల్వేర్ ఏదో ఒక మూలన విజృంభిస్తూనే ఉంది. ఈ మాల్వేర్‌కు సంబంధించిన సోర్స్ కోడ్‌ను పలు ఓపెన్ సోర్స్ ప్లాట్‌ఫామ్‌లలో క్రియేటర్స్ ఉంచటంతో ప్రపంచవ్యాప్తంగా 2.5 మిలియన్ల ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ యూనిట్లు ఎఫెక్ట్ అయ్యాయి. ఈ మాల్వేర్ దెబ్బకు భారత్‌లో ఎంత నష్టం వాటిల్లిందన్నది తెలియాల్సి ఉంది.

Best Mobiles in India

English summary
India witnessed more than 27,000 cybersecurity threat incidents in the first half of 2017.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X