Bitcoin అంటే ఏంటి, ఖరీదు ఎంత..?
బిట్‌కాయిన్ విలువ అంచనాలకు అందని రీతిలో పెరిగిపోయింది.
క్రిప్టోకరెన్సీగా పిలవబడుతోన్న బిట్‌కాయిన్ విలువ మొదటిసారిగా 2000 డాలర్లు (ఇండియన్ కరెన్సీలో రూ.1,29,165 ) దాటినట్లు సమచారం. డిజటిల్ కాయిన్ ప్లాట్‌ఫామ్స్ ప్రొవైడ్ చేసిన డేటా బేస్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 33 బిలియన్ డాలర్లు విలువ చేసే బిట్‌కాయిన్‌లు చలామణిలో ఉన్నట్లు తెలుస్తోంది.

అంచనాలకు అందని రీతిలో
గతకొద్ది వారాలుగా బిట్ కాయిన్ విలువ అంచనాలకు అందని రీతిలో పెరిగిపోయిందని, డిజిటల్ కరెన్సీలో ఇదో పెద్ద రికార్డు అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

బిట్‌కాయిన్ అనేది డిజిటల్ కరెన్సీ
ఒక్కమాటలో చెప్పాలంటే బిట్‌కాయిన్ అనేది డిజిటల్ కరెన్సీ. ఈ కరెన్సీని ఆన్‌లైన్ వాలెట్‌లో నిల్వ చేసుకోవల్సి ఉంటుంది. ఇందుకు ప్రత్యేకమైన డిజటిల్ కాయిన్ ప్లాట్‌ఫామ్స్ అందుబాటులో ఉంటాయి.

భారత్‌లో బిట్ కాయిన్ లావాదేవీలు నిషేదం.
భారత్‌లో బిట్ కాయిన్ వంటి వర్చువల్ కరెన్సీలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎటువంటి గుర్తింపునివ్వలేదు. భారత్ లో బిట్ కాయిన్ లతో లావాదేవీలు జరపటమనేది చట్టవిరుద్ధం.

పేపాల్ వంటి ఆన్‌లైన్ పేమెంట్ సంస్థలు
అంతర్జాతయంగా పేపాల్ వంటి ఆన్‌లైన్ పేమెంట్ సంస్థలు బిట్‌కాయిన్ లావాదేవీలను అనమతిస్తున్నాయి. బిట్‌కాయిన్‌లతో జరిపే నగదు లావాదేవీలకు సంబంధించి ఎటువంటి వివరాలు బయటకు పొక్కే ఆస్కారం ఉండదు.

ప్రైవేటు కీ ఉంటుంది..
బిట్‌కాయిన్‌లను నిలువ చేసుకునే వ్యాలెట్‌లకు ప్రత్యేకమైన ప్రైవేటు కీని కేటాయిస్తారు. ఈ కీని ఉపయోగించుకుని బిట్‌కాయిన్‌లను వాడుకుంటారు.

ప్రయివేట్ కోడ్ మాత్రమే బహిర్గతమవుతుంది
బిట్‌కాయిన్ లావాదేవీలకు సంబంధించి సదురు వాలెట్ సృష్టించే ప్రయివేట్ కోడ్ మాత్రమే బహిర్గతమవుతుంది. ఈ ప్రయివేట్ కోడ్‌నే లెడ్జర్‌లో కూడా నమోదుచేస్తారు. దీనినే అడ్రస్‌గా భావించాల్సి ఉంటుంది.

ఉపయోగించిన వ్యక్తికి సంబంధించి ఎటువంటి ఆధారాలు ఉండవు
లెక్కలు పక్కాగా ఉన్నప్పటికి ఈ బిట్ కాయిన్‌లను ఉపయోగించిన వ్యక్తికి సంబంధించి ఎటువంటి ఆధారాలు ఉండవు. ఈ విధమైన గోప్యత కారణంగానే బిట్ కాయిన్ నేరగాళ్లను ప్రోత్సహిస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వన్నాక్రై దాడి నేపథ్యంలో..
వన్నాక్రై రాన్సమ్‌వేర్ దాడి నేపథ్యంలో బిట్‌కాయిన్ కరెన్సీ హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications








