మీరు ఊహించని టెక్నాలజీ వచ్చేస్తోంది..!

జేమ్స్ బాండ్ సినిమాల్లో కనిపించే అసాధారణమైన టెక్నాలజీ ఎంత క్రియేటివ్‌గా ఉంటుందో మనందరికి తెలుసు. శత్రువులను ఎదుర్కొనే క్రమంలో బాండ్ అనుసరించే వ్యూహాలు, ఆధునిక సాంకేతికతతో కూడిన ఖరీదైన ఆయుధ వ్యవస్థ, ప్రత్యామ్నాయ రవాణా మార్గాలు ఎంతగానే ఆకట్టకుంటాయి. త్వరలో ప్రపంచానాకి పరిచయం కాబోతోన్న 10 విప్లవాత్మక టెక్నాలజీలను మీముందుకు తీసుకువచ్చాం...

Read More : Airtel బంపర్ ఆఫర్.. 10జీబి 4జీ డేటా రూ.250కే!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హై-టెక్ సాక్స్

'FreeYourFeet' పేరుతో ప్రత్యేకమైన అల్ట్రా డ్యూరబుల్ వాటర్ ప్రూఫ్ సాక్సులను స్విస్ దేశానికి చెందిన బేర్ ఫూట్ కంపెనీ అభివృద్థి చేసింది. స్టీల్ కంటే 15 రెట్లు బలంగా ఉండే ప్రత్యకమైన లోహంతో తయారు చేయబడిన ఈ సాక్సులు గ్లవ్ తరహాలో మీ కాళ్లకు ఫిట్ అవుతాయి. ఎటువంటి ప్రదేశంలోనైన ఈ సాక్సులను ఉపయోగించకోవచ్చు. నీళ్లలో తేలగలవు, తేమ, UV light, కెమికల్స్ వంటివి ఈ సాక్సుల మన్నికను ఏమాత్రం దెబ్బ తీయలేవు.

బ్యాట్‌బ్యాండ్

ఈ హెడ్‌బ్యాండ్ స్టైల్ హెడ్‌ఫోన్స్ ద్వారా మ్యూజిక్ వినటంతో పాటు ఫోన్ కాల్స్‌కు ఆన్సర్ చేయవచ్చు. వీటిని చెవి దగ్గర పెట్టుకోవల్సిన అవసరం ఉండదు.  తలకు దరిస్తే చాలు. బ్లూటూత్ సహాయంతో ఫోన్‌ను కనెక్ట్ చేసుకోవల్సి ఉంటుంది.

ప్రోగతాగటాన్ని మానిపించే ప్రత్యేకమైన కేస్

Lowiee అని పిలవబడుతోన్నఈ ప్రత్యేకమైన anodized aluminum case మీలోని ప్రొగతాగే అలవాటును నియంత్రణలోకి తీసుకువస్తుంది. ఓ ప్రత్యేకమైన యాప్ అలానే ఫింగర్ ప్రింట్ రీడర్ ఆధారంగా స్పందించగలిగే ఈ కేస్ మీ ప్రొగత్రాగే అలవాటును క్రమక్రమంగా తగ్గిస్తూ వస్తుంది. అంతే కాదు ప్రొగతాగడం మానివేయటం వల్ల మీకు చేకూరుతున్న లాభాలను ఈ కేస్ డేటా రూపంలో మీకందిస్తుంది.

Haz Smart Umbrella

Haz Smart Umbrellaను తైవాన్ కు చెందిన Haz డిజిటల్ అనే స్టార్టప్ డిజైన్ చేసింది. ఇంటర్నెట్‌తో కనెక్ట్ కాగలిగే ఈ ప్రత్యేకమైన గొడుగును ఫోన్ ద్వారా ఆపరేట్ చేయవచ్చు.

Trakkies Device

నాణెం సైజులో ఉండే ఈ ప్రత్యేకమైన ట్రాకింగ్ డివైస్ ముఖ్యమైన వస్తువులను మీరు మర్చిపోకుండా చూస్తుంది. వీటిని ఇంటి తాళాలకు, బ్యాగ్‌లకు, పర్సులకు అటాచ్ చేసుకోవచ్చు. వీటిని మీరు మర్చిపోయి వెళ్లిపోతున్నట్లయితే మీమ్మల్ని అలర్ట్ చేస్తూ ప్రత్యేకమైన శబ్థం వెలువడుతుంది.

 

I'm Up Alarm

ఈ ప్రత్యేకమైన అలారమ్ వ్యవస్థ మీరు నిద్ర లేచేంత వరకు మ్రోగుతూనే ఉంటుంది. ఈ అలారమ్‌ను టర్నాఫ్ చేయాలంటే మీరే స్వయంగా లేచి ఇంట్లో వేరొక ప్రదేశంలో ఉన్న QR codeను స్కాన్ చేయవల్సి ఉంటుంది.

Acticheck Assure

బ్రిటన్‌కు చెందిన Acticheck ప్రత్యకమైన వేరబుల్ టెక్నాలజీని అభివృద్థి చేసింది. Acticheck Assure పేరుతో రూపొందించబడిన ప్రత్యేకమైన వాచ్ తరహా మానిటర్ ప్రతి 15 నిమిషాలకు మీ కదలికలకు సంబంధించిన సమాచారాన్నీ మీ బంధువులకు చేరవేస్తుంది.

Sun Strap

ఈ ప్రత్యేకమైన సోలార్ ఛార్జింగ్ డివైస్ ప్రయాణ సమయాల్లో మీరు క్యారీ చేస్తున్న గాడ్జెట్‌లకు ఛార్జింగ్‌ను సమకూరుస్తుంది. సూర్య కిరణాల ద్వారా ఈ సోలార్ బ్యాగ్ ప్యాక్  డివైస్ శక్తిని జనరేట్ చేసుకుంటుంది.

Robear

రైకెన్ అలానే సుమిటోమో రికో కంపెనీకి చెందిన శాస్త్రవేత్తలు Robear పేరుతో విప్లవాత్మక నర్సింగ్ కేర్ రోబోట్లను అభివృద్థి చేసారు. ఈ ప్రత్యేకమైన రోబోట్స్ రోగులను మంచం మీద నుంచి వీల్ చైర్‌లోకి షిఫ్ట్ చేయగలవు. వారి బాగోగులను కూడా చూసుకోగలవు.

Runcible

స్మార్ట్‌ఫోన్‌లకు తరువాతి వర్షన్‌గా అభివర్ణించబడుతున్నఈ Runcible డివైస్ గుండ్రటి ఆకారంలో ఉంటుంది. ఈ పెబ్బిల్ డివైస్‌లో అత్యాధునిక స్మార్ట్ మొబైలింగ్ టెక్నాలజీతో పాటు అధునాతన కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేసారు. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Did You Know! These 10 Odd Gadgets Exist in Reality. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot