అమెరికా బంపర్ ఆఫర్ : సైట్ హ్యాక్ చేస్తే లక్షా 50 వేల డాలర్ల బహుమతి

Written By:

అమెరికా రక్షణ శాఖ ఇప్పుడు హ్యాకర్లకు బంఫర్ ఆఫర్ ఇచ్చింది. తన సైబర్ సెక్యూరిటీని హ్యాక్ చేసినవారికి 1, 50,000 డాలర్ల రివార్డును ప్రకటించింది. సైబర్ సెక్యూరిటీ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో తెలుసుకోడానికి హ్యాకర్లు తమ సైట్‌ను హ్యాక్ చేయాలని చెబుతోంది.వీలయినంత త్వరగా మా సైట్ ను హ్యాక్ చేయాలంటూ డెడ్ లైన్ కూడా విధించింది. దీనికోసం ఓ ప్రోగ్రామ్ నే ప్రారంభించింది. ఈ ప్రోగ్రాం పేరే బగ్ బౌంటీ.

Read more : చరిత్రలో అతి పెద్ద హ్యాకింగ్ : ఒక్క పదం మార్చి రూ. 673 కోట్లు దోపీడి

అమెరికా బంపర్ ఆఫర్ : సైట్ హ్యాక్ చేస్తే లక్షా 50 వేల డాలర్ల బహుమతి

ఈ 'బగ్ బౌంటీ ప్రోగ్రామ్' ఏప్రిల్ 18 వ తేదీ నుంచి ప్రారంభమై మే నెల 12 వ తేదీ వరకు కొనసాగుతోందని, ఈ మధ్యకాలంలోనే హ్యాకర్లు తమ సైట్ను హ్యాక్ చేయాల్సి ఉంటుందని రక్షణ మంత్రి ఆశ్ కార్టర్ ఓ పత్రికా ప్రకటనలో తెలిపారు. అయితే అమెరికా సామాజిక భద్రత నెంబర్ ఉన్న హ్యాకర్లు మాత్రమే ఈ పోటీలో పాల్గొనాలని, వారి నేర చరితను పరిశీలించేందుకు కూడా అంగీకరించాలని షరతు విధించారు.

Read more: హ్యాకింగ్‌ సెక్స్‌తో అమితాబ్‌ విలవిల

తమ సైబర్ సెక్యూరిటీ వ్యవస్థలో లోపాలను కనుగొనేందుకు ఫేస్బుక్, గూగుల్ లాంటి సంస్థలు కూడా ఇలాంటి బగ్ బౌంటీ పోటీలను నిర్వహించాయి. ఇటీవల ఊబర్ సంస్థ కూడా తమ టాక్స్ యాప్‌లో లోపాలను కనుగొనేందుకు ఇలాంటి పోటీనే ఆహ్వానించి పదివేల డాలర్ల రివార్డును ప్రకటించింది. అయితే ఇప్పటివరకు చరిత్రలో జరిగిన అతి పెద్ద హ్యాకింగ్ ల పై ఓ కన్నేద్దాం.

Read more: ఆ కార్లకు హ్యాకింగ్ షాక్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

1

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను టార్గెట్ చేస్తూ జూలైలో పబ్లిక్‌లోకి చొరబడిన ‘స్టేజ్‌ఫ్రైట్' అనే మాల్వేర్, ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల స్మార్ట్‌ఫోన్‌లను చుట్టిముట్టినట్లు సెక్యూరిటీ సంస్థ జింపీరియమ్ గుర్తించింది. ఈ మాల్వేర్‌ను సమర్థవంతంగా తిప్పికొట్టే క్రమంలో గూగుల్ యుద్ధ ప్రాతిపదికన ప్యాచప్ చర్యలు చేపట్టింది.

 

 

2

తాము అభివృద్థి చేసిన యు కనెక్ట్ ఫీచర్‌ను హ్యాకర్లు తమ ఆధీనంలోకి తీసుకోవటంతో Fiat Chrysler Automobiles లక్షన్నర కార్లను రీకాల్ చేసింది. కార్లలో పొందుపరిచే ఈ యు కనెక్ట్ పీచర్ ఫోన్ కాల్స్‌ను ఎనేబుల్ చేయటంతో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ అలానే నేవిగేషన్‌ను కంట్రోల్ చేస్తుంది. యుకనెక్ట్స్ సెల్యులార్ కనెక్షన్‌లోని సెక్యూరిటీ లొసుగులను ఆసరాగా చేసుకున్న హ్యాకర్లు కార్లకు సంబంధించి ఐపీ అడ్రస్‌‌లను తమ ఆధీనంలోకి తీసుకుని అలజడి సృష్టించారు.

 

 

3

యాష్లే మాడిసన్ డేటింగ్ వెబ్‌సైట్ హ్యాకింగ్ భాగోతం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది.. ఈ అక్రమ సంబంధాల వెబ్‌సైట్‌లోని సభ్యులకు సంబంధించిన చాటు మాటు వ్యవహారాలను చాకిచక్యంగా దొంగిలించిన హ్యాకర్లు దశలు వారీగా ఆ డేటాను ఇంటర్నెట్‌లో విడుదల చేసారు. మొదటి దశలో36 మిలియన్ల మంది ప్రొఫైల్స్‌కు సంబంధించిన సమాచారాన్ని రెండవ దశలో 20 జీబిల నిడివిగల డేటాను హ్యాకర్లు లీక్ చేసారు. వెబ్‌సైట్‌కు సీఈఓకు సంబంధించిన ఈ-మెయిల్స్‌తో పాటు మొత్తం కంపెనీకి సంబంధించిన సోర్స్ కోడ్స్ ను కూడా హ్యాకర్లు ఆన్ లైన్ లో ఉంచారు.

 

 

4

29 సంవత్సరాల యువ హ్యాకర్ సామీ కామ్కర్ తాను సొంతంగా అభివృద్థి చేసిన ఓ గాడ్జెట్ సహాయంతో జీఎమ్ సంస్థ కార్లలోని ఆన్‌స్టార్ సిస్టమ్‌ను హ్యాక్ చేయగలిగారు. OnStar రిమోట్ లింక్ యాప్‌ను అప్ డేట్ చేయటం ద్వారా జీఎమ్ సంస్థ ఈ హ్యాక్‌ను నివారించగలిగింది.

5

ఓ పరిశోధనలో భాగంగా రిసెర్చర్లు Corvette కారుకు సంబంధించిన బ్రేకులను టెక్స్ట్ మేసెజ్ ద్వారా కంట్రోల్ చేయగలిగారు.

 

 

6

సెక్యూరిటీ విషయంలో ఎంతో కట్టుదిట్టంగా వ్యవహరించే యాపిల్ సంస్థ కూడా ఓసారి హ్యాకర్ల ఉచ్చులో పడాల్సి వచ్చింది. Mac OS X 10.10లోని సెక్యూరిటీ లోపాన్ని ఆసారా తీసుకున్న హ్యాకర్లు ఓ వ్యక్తి కంప్యూటర్‌లోకి చొరబడి మల్వేర్‌లతో కూడిన యాప్స్‌ను ఇన్స్‌స్టాల్ చేసారు. సమస్యను గుర్తించిన యాపిల్ హుటాహుటిన సమస్యను పరిష్కరించింది.

 

 

7

30 డాలర్లను వెచ్చించి ఓ హ్యాకర్ అభివృద్థి చేసిన టూల్ ఎలాంటి కార్ లాక్‌నైనా ఓపెన్ చేసేస్తుంది.

 

 

8

గడిచిన కొద్ది నెలల క్రితం డెల్ కంప్యూటర్స్ మేజర్ సెక్యూరిటీ సమస్యను ఫేస్ చేయవల్సి వచ్చింది.

 

 

9

మొజిల్లా తన ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌‌లో అతిపెద్ద సేక్యూరిటీ లోపాన్ని గుర్తించింది. ఈ సెక్యూరిటీ లోపం కారణంగా హ్యాకర్ల యూజర్‌కు తెలియకుండా కంప్యూటర్ నుంచి డేటాను దొంగిలించే ప్రమాదముందని హెచ్చరించింది. వెంటనే తమ సాఫ్ట్‌వేర్‌అను అప్‌డేట్ చేసుకోవాలని మొజిల్లా తెలిపింది.

 

 

10

చైనాకు చెందిన ప్రముఖ టాయ్ మేకర్ వీటెక్ మేజర్ సెక్యూరిటీ సమస్యను ఫేస్ చేయవల్సి వచ్చింది. ఈ సంస్థ పై దాడులకు తెగబడిన హ్యాకర్లు 4.9 మిలియన్ల పేరెంట్ అకౌంట్ లతో పాటు 6.7 మిలియన్ల కిడ్స్ ప్రొఫైల్స్ ను దొంగిలించారు.

 

 

11

టెక్నాలజీ గురించి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write DOD invites you well, some of you to Hack the Pentagon this month
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot