Home
Miscellaneous

గూగుల్ పరిశోధనలు చావును జయించబోతున్నాయా..?

విప్లవాత్మక ఆలోచనలకు పెద్దపీట వేసి వాటికి వాస్తవరూపాన్ని అద్దే పెద్ద బాధ్యతను గూగుల్ ఆల్ఫాబెట్ సంస్థ చేపడుతోంది.

By Sivanjaneyulu Bommu

భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విప్లవాత్మక ఆవిష్కరణలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ 'ఆల్ఫాబెట్'పేరుతో కొత్త హోల్డింగ్ కంపెనీని ప్రారంభించిన విషయం తెలిసిందే. గూగుల్‌తో పాటు ఈ సంస్థ గతంలో కొనుగోలు చేసిన అన్ని కంపెనీలకు Alphabet మాతృసంస్థగా వ్యవహరిస్తుంది.

Read More : జియోకు షాక్, సమ్మర్ సర్‌ప్రైజ్ ఆఫర్ నిలిపివేత

కాలిఫోర్నియా కేంద్రంగా కార్యకాలపాలు..

కాలిఫోర్నియా కేంద్రంగా కార్యకాలపాలు..

కాలిఫోర్నియా కేంద్రంగా కార్యకాలపాలు సాగిస్తోన్న ఆల్ఫాబెట్ కంపెనీకి లారీ పేజ్ సీఈఓగానూ సెర్జీ బ్రిన్ అధ్యక్షుడుగాను వ్యవహరిస్తున్నారు. ఆల్ఫాబెట్ అంటే, కొన్ని అక్షరాల సముదాయం. ఓ భాషను సూచిస్తుంది. మానవులు కనుగొన్న అత్యంత వినూత్నకతల్లో ఇదొకటి. గూగుల్ ఆల్ఫాబెట్ గురించి పలు ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. విప్లవాత్మక ఆలోచనలకు పెద్దపీట వేసి వాటికి వాస్తవరూపాన్ని అద్దే పెద్ద బాధ్యతను గూగుల్ ఆల్ఫాబెట్ తన భుజాన వేసుకుంది.

ప్రాజెక్ట్ లూన్

ప్రాజెక్ట్ లూన్

ప్రాజెక్ట్ లూన్ పేరుతో గూగుల్, బెలూన్ ఇంటర్నెట్ ప్రయోగాన్ని చేపడుతోంది. ఈ ప్రయోగంలో భాగంగా పెద్దపెద్ద ఫ్లోటింగ్ బెలూన్లను భూమికి 20 కిలోమీటర్ల ఎత్తులో ఎగిరేలా చేసి వాటికి అనుసంధానించే వైర్ లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ద్వారా ఇంటర్నెట్ సిగ్నళ్లను పంపిస్తారు.ఇంటి పై ఏర్పాటు చేసిన ప్రత్యేక యంటీనాలు ఈ సిగ్నల్స్‌ను గ్రహించుకుని ఇళ్లలోని కంప్యూటర్లకు ఇంటర్నెట్ సేవలను అందిస్తాయి. ప్రాజెక్ట్ లూన్ టెక్నాలజీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చినట్లయితే టవర్ల సహాయం లేకుండా 4జీ ఇంటర్నెట్ మొబైల్ యూజర్లకు చేరువచేయవచ్చు. ఒక్కో బెలూన్ తనకు 40 కిలోమీటర్ల రేంజ్‌లో ఉన్న మొబైల్ ఫోన్‌లకు ఇంటర్నెట్‌ను చేరువచేయగలదు. ఈ ప్రాజెక్ట్ ఆల్ఫాబెట్ పరిధిలోకి వస్తుంది.

 డ్రైవర్‌లెస్ కారు ప్రాజెక్ట్

డ్రైవర్‌లెస్ కారు ప్రాజెక్ట్

గూగుల్ ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న ప్రాజెక్టులలో డ్రైవర్‌లెస్ కారు ప్రాజెక్ట్ ఒకటి. గూగుల్ తయారు చేసిన ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కారులో స్టీరింగ్ వీల్, బ్రేక్స్, యాక్సిలరేటర్ ఉండవు. ఇవన్నీ కూడా కారులో ఉండే సాఫ్ట్‌వేర్, మెకానిక్స్ ద్వారా కంట్రోల్ చేయబడుతాయి. కారు పైభాగంలో మరియు ముందు వెనుక భాగాల్లో సెన్సార్లు, హెచ్‌డి సరౌండ్ కెమెరాలను ఇందులో ఉపయోగించారు. వీటితో పాటుగా మ్యాప్స్ సాయంతో కారు దానంతట అదే దిశానిర్దేశం చేసుకుంటుంది. ఈ కారులో ఇద్దరికి మాత్రమే చోటు ఉంటుంది. ఇందులో కూర్చున్న వారు చేయాల్సిందల్లా రెండు సీట్లకు మధ్యలో ఉన్న స్టార్ట్/స్టాప్ బటన్‌ను ప్రెస్ చేయటమే. గూగుల్ కారు ఇంటీరియర్స్‌ను చాలా సింపుల్‌గా ఉంచారు. ఇందులో ప్యాసింజర్ సీట్ల ముందు కొంత లగేజ్ ఉంచుకునేందుకు స్థలం ఉంటుంది. కారు ఏ రూట్లో వెళ్తుందో తెలిపేందుకు ఓ పెద్ద స్క్రీన్ ఉంటుంది. ప్రారంభ దశ కావటంతో ఈ డ్రైవర్ రహిత కారును వేగాన్ని గంటకు గరిష్టం 25 మైళ్ల (40 కెఎమ్‌పిహెచ్)కు మాత్రమే పరిమితం చేశారు. అయితే, గూగుల్ కో-ఫౌండర్ సెర్గీ బ్రిన్ తెలిపిన సమాచారం ప్రకారం, భవిష్యత్తులో ప్రొడక్షన్ మోడల్‌ను గరిష్టంగా గంటకు 100 మైళ్ల (160 కెఎమ్‌పిహెచ్) వేగంతో పరుగులు తీసేలా అభివృద్ధి చేయనున్నారు.

స్మార్ట్ కాంటాక్ట్ లెన్స్

స్మార్ట్ కాంటాక్ట్ లెన్స్

గూగుల్, డయాబెటిక్స్ రోగుల కోసం స్మార్ట్ కాంటాక్ట్ లెన్స్ తయారీ పై దృష్టిసారించింది. ఈ లెన్స్ భవిష్యత్‌లో షుగర్ వ్యాధిగ్రస్తులకు మరింత ఉపయోగడనున్నాయి. రోజుకు 10 సార్లు తమ రక్తాన్ని తీుసుకుని పరీక్ష చేసుకోవచ్చు. ప్రస్తుతం నమూనా దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ త్వరలో వాస్తవరూపాన్ని అద్దుకోనుంది. ఈ ప్రాజెక్ట్ ఆల్ఫాబెట్ పరిధిలోకి వస్తుంది.

 ప్రాజెక్ట్ వాల్ట్

ప్రాజెక్ట్ వాల్ట్

గూగుల్ ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న ప్రాజెక్టులలో ప్రాజెక్ట్ వాల్ట్ ఒకటి. మొత్తం ఆపరేటింగ్ సిస్టంను మెమరీ కార్డ్‌లో ఫిట్ చేయాలన్నది ఈ ప్రాజెక్ట్ ప్రధాన సంకల్పం. సెక్యూరిటీ ప్రధాన అంశంగా సాగుతున్న ఈ ప్రాజెక్టు విజయవంతమవ్వాలని ఆకాంక్షిద్దాం. ఈ ప్రాజెక్ట్ ఆల్ఫాబెట్ పరిధిలోకి వస్తుంది.

చేతులు వణకకుండా...

చేతులు వణకకుండా...

తినేటప్పుడు చేతులు వణికే వారిని దృష్టిలో పెట్టుకొని గూగుల్ స్మార్ట్‌స్పూన్‌ను తీసుకువచ్చింది. పరిస్థితులకు అనుగుణంగా ఈ స్పూన్ దిశను మార్చుకునే విధంగా పత్రేక ఫీచర్లున ఈ స్మార్ట్ డివైస్‌లో పొందుపరిచారు. ఈ ప్రాజెక్ట్ ఆల్ఫాబెట్ పరిధిలోకి వస్తుంది.

కాలికో ప్రాజెక్టు..

కాలికో ప్రాజెక్టు..

గూగుల్ సంస్థ 2013లో కాలికో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టు కింద వృద్ధాప్యం కారణంగా వచ్చే వ్యాధులపై గూగుల్ విస్తృత పరిశోధనలు చేస్తోంది. మనిషి జీవితకాలాన్ని పెంచటమనేదే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశ్యం. క్షీణించిన మానవ అవయవాల స్థానంలో త్రీడీ టెక్నాలజీని ద్వారా కృత్రిమ అవయవాలను అమర్చడం, మానవుడి జెనెటిక్ కోడ్‌ను పూర్తిగా మ్యాపింగ్ చేయటం వంటి ఆధునిక అంశాలను గూగుల్ ఈ ప్రాజెక్టులో భాగంగా పరిగణంలోకి తీసుకుంటోంది. ఈ ప్రాజెక్ట్ ఆల్ఫాబెట్ పరిధిలోకి వస్తుంది.

Best Mobiles in India

English summary
Exciting Facts About Google’s Parent Company Alphabet. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X