గూగుల్ ఎర్త్‌లో వాయు కాలుష్య వివరాలు

|

ప్రపంచ శ్రేయస్సును కోరుతూ గూగుల్ ఎర్త్ మరో ముందడగు వేసింది. వాయు కాలుష్యం పట్ల ప్రజలను అప్రమత్తం చేసే క్రమంలో సరికొత్త సదుపాయాన్ని గూగుల్ ఎర్త్ అందబాటలోకి తీసుకువచ్చింది. ఈ సదుపాయంతో గూగుల్ ఎర్త్ యూజర్లు ప్రాంతాల వారీగా గాలి కాలుష్య స్థాయిలను తెలుసుకునే వీలుంటుంది.

Google Earth now shows air pollution levels

కాలిఫోర్నియా ప్రాంతంలో కాలుష్య లెవల్స్‌ను అంచనా వేసేందుకుగాను పర్యావరణ టెక్ సంస్థ అయిన అక్లైమాతో గూగుల్ ఎర్త్ చేతులు కలిపింది.

ఈ రెండు సంస్థలు ముందుగా శాన్‌ఫ్రాన్సిస్కో బే, లాస్ ఏంజిల్స్, సెంట్రల్ వ్యాలీ ప్రాంతాల నుంచి ఎయిర్ క్వాలిటీ డేటాను సమీకరించాయి. గూగల్ స్ట్రీట్ వ్యూ కార్స్ ఆధారంగా దాదాపు లక్ష మైళ్లను వీళ్లు కవర్ చేసారు. ఇది కేవలం కాలిఫోర్నియాకు మాత్రమే పరిమితం కాదని త్వరలోనే ప్రపంచం మొత్తానికి సంబంధించిన ఎయిర్ పొల్యూషన్ డేటాను గూగుల్ ఎర్త్‌లో పబ్లిష్ చేయటం జరుగుతుందని గూగుల్ ఎర్త్ ప్రోగ్రామ్ వేనేజర్ కరీన్ టుసెన్-బెట్మాన్ తెలిపారు.

శాస్త్రవేత్తలతో పాటు ఎయిర్ క్వాలిటీ స్పెషలిస్టులు ఈ సమాచారాన్ని ఉపయోగించుకుని స్థానిక సంస్థలతో పాటు ప్రభుత్వాలకు వాయు కాలుష్యం పట్ల అవగాహన కలిగించటంతో పాటు ఎయిర్ క్వాలిటీని మెరుగుపరిచే దిశగా పరిష్కార మార్గాలను ఆలోచించే వీలుంటుందని ఆయన తెలిపారు.

రూ. 10 వేల కన్నా తక్కువ ధరలో బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ స్మార్ట్‌ఫోన్లురూ. 10 వేల కన్నా తక్కువ ధరలో బెస్ట్ బ్యాటరీ బ్యాకప్ స్మార్ట్‌ఫోన్లు

ఉపగ్రహ 3డి కోణంతో భూమిపై ఉన్న ప్రకృతిని మెరుగైన చిత్రాలుగా వినియోగదారులకు అందించడంలో సహాయపడుతుంది. దీని ద్వారా యూజర్స్ ఖచ్చితంగా మంచి అనుభవాన్ని సొంతం చేసుకుంటారు. ఇందులో ఉన్న టెక్నాలజీ సహాయంతో నేరుగా వాటిని సవరించే అవకాశం లేకుండా భౌగోళిక ప్రకృతి దృశ్యాలను వినియోగదారులకు ప్రదర్శిస్తుంది.

Best Mobiles in India

Read more about:
English summary
Google has joined hands with environmental technology company Aclima to map air pollution levels on Google Earth.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X