గూగుల్‌లో కొత్త ఫీచర్, ఆండ్రాయిడ్ గురించి షాకింగ్ నిజాలు

సాఫ్ట్‌వేర్ దిగ్గజం గూగుల్, తన సెర్చ్ ఇంజిన్‌లో సరికొత్త అప్‌డేట్‌ను చేర్చింది. ఈ లేటెస్ట్ అప్‌డేట్‌తో గూగుల్ యూజర్లు తమ జీమెయిల్ ఇంకా గూగుల్ ఫోటోస్‌లోని కంటెంట్‌ను సెర్చ్ ఇంజిన్ పేజీలోనే బ్రౌజ్ చేసుకునే వీలుంటుంది.

గూగుల్‌లో కొత్త ఫీచర్, ఆండ్రాయిడ్ గురించి షాకింగ్ నిజాలు

ఈ పర్సనల్ సెర్చ్ methodను మీరు ట్రై చేయాలనుకుంటున్నట్లయితే ముందుగా మీ సొంత అకౌంట్ నుంచి గూగుల్ పేజీలోకి లాగిన్ కావల్సి ఉంటుంది. లాగిన్ అయిన తరువాత గూగుల్ సెర్చ్ పేజీలోని More ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే బుక్స్, ఫ్లైట్స్ ఆప్షన్స్ క్రింద Personal అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్ పై క్లిక్ చేసినట్లయితే మీ జీమెయిల్ ఇంకా గూగుల్ ఫోటోస్‌లోని పర్సనల్ కంటెంట్ ను కీవర్డ్స్ ఆధారంగా బ్రౌజ్ చేసుకునే వీలుంటుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆండ్రాయిడ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..

మైక్రోసాఫ్ట్ విండోస్, ఆపిల్ ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టంలకు ధీటైన పోటినిస్తూ, స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో గూగుల్ ఆండ్రాయిడ్ తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ ముందుకుపోతోంది. సామ్‌సంగ్, హెచ్‌టీసీ, మోటరోలా, లెనోవో, సోనీ వంటి దిగ్గజ బ్రాండ్‌‌లు మొదలుకుని మైక్రమ్యాక్స్, కార్బన్, లావా వంటి దేశవాళీ బ్రాండ్‌ల వరకు ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్ ఆధారితంగానే స్మార్ట్‌ఫోన్లను రూపొందిస్తున్నాయి. మొబైల్ ఆపరేటింగ్ సిస్టం విభాగంలో ప్రపంచాన్ని శాసిస్తోన్న గూగుల్ ఆండ్రాయిడ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..

ఆండ్రాయిడ్‍‌ను గూగుల్ స్థాపించ లేదు

ఆండ్రాయిడ్‍‌ను గూగుల్ స్థాపించ లేదు. ఆండీ రూబిన్, క్రిస్ వైట్, నిక్ సియర్స్, రిచ్ మైనర్ అనే డెవలపర్లు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంను ఆక్టోబర్ 2003లో అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆ తరువాత ఆండ్రాయిడ్ మొత్తాన్ని గూగుల్ $50 మిలియన్లకు కొనుగోలు చేసింది.

ఆండ్రాయిడ్‌ అట్టర్ ఫ్లాప్..

మొబైల్ ఆపరేటింగ్ సిస్టం విభాగంలో సంచలనాలు సృష్టిస్తోన్న ఆండ్రాయిడ్‌కు ఆరంభంలో అడుగుడుగునా అవాంతరాలే ఎదురయ్యాయి. ఆండ్రాయిడ్ అట్టర్ ఫ్లాప్ అవుతుందటూ చాలా మంది క్రిటిక్స్ నుంచి నెగిటివ్ కామెంట్స్ వ్యక్తమయ్యాయి.

బ్లాక్‌బెర్రీకి దగ్గర పోలికలు..

ఆండ్రాయిడ్ మొదటి ప్రోటోటైప్ బ్లాక్‌బెర్రీకి దగ్గరగా ఉండటం విశేషం.

ఆండ్రాయిడ్ 3.0 ఫోన్‌లలో రన్ అవదు

ఆండ్రాయిడ్ నుంచి విడుదలైన 3.0 వర్షన్ ఆపరేటింగ్ సిస్టం ఫోన్‌లలో రన్ అవదు. ఈ ఆపరేటింగ్ సిస్టంను ప్రత్యేకించి టాబ్లెట్‌ల కోసం డిజైన్ చేసారు.

మొదటి ఆండ్రాయిడ్ డివైస్‌లో ఆ ఫీచర్లు లేవు..

మొట్టమొదటి ఆండ్రాయిడ్ డివైస్‌లో వర్చువల్ కీబోర్డ్, 3.5ఎమ్ఎమ్ హెచ్‌సెట్ జాక్ వంటి ఫీచర్లు లేవు.

సోనీ మొదటి స్మార్ట్‌వాచ్ ఆండ్రాయిడ్‌తోనే..

సోనీ తన మొట్టమొదటి ఆండ్రాయిడ్ స్మార్ట్‌వాచ్‌ను 2010లో తయారు చేసింది.

వందల కోట్లలో యూజర్లు.

గూగుల్ ఆండ్రాయిడ్‌ను ఉపయోగించుకునే వారి సంఖ్య ప్రపంచవ్యాప్తంగా వందల కోట్లలో ఉంది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను ప్రపంచవ్యాప్తంగా 190 పై చిలుకు దేశాల్లో వినియోగించుకుంటున్నారు.

తొలత డిజిటల్ కెమెరాల కోసమే డిజైన్ చేసారు..

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంను ఆరంభంలో కేవలం డిజిటల్ కెమెరాల కోసమే అభివృద్థి చేయటం జరిగింది. ఆ తరువాత ఈ ఓఎస్‌ను స్మార్ట్‌ఫోన్‌ల కోసం గూగుల్ ఉపయోగించింది.

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంతో విడుదలైన మొదటి స్మార్ట్‌ఫోన్

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంతో విడుదలైన స్మార్ట్‌ఫోన్ హెచ్‌టీసీ డ్రీమ్. ఈ స్మార్ట్‌ఫోన్ 2008 అక్టోబర్‌లో విడుదలైంది. డివైస్‌లో లైనెక్స్ ఆధారిత ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంను గూగుల్ ఉపయోగించింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Google Makes Your Search Results More Personal. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot