వారి చావు అంత ఘోరంగానా..?
తమ ఆనంద సమయాలు.. మిత్రులతో కలిసిన సందర్భాలు.. ప్రకృతిలో సేదతీరుతున్న దృశ్యాలు ఇలా ఎన్నెన్నో సంగతులను కొత్త కోణంలో సోషల్ మీడియా ప్రపంచంతో షేర్ చేసుకునేందుకు నేటి యువత తహతహ లాడుతోంది. ఈ క్రమంలో సెల్పీ ట్రెండ్ విచ్చలవిడిగా విస్తరిస్తోంది.

Read More : Opera బ్రౌజర్ ఎందుకంత బెస్ట్..?
స్మార్ట్‌ఫోన్ ద్వారా తమ ఫోటోలను తామే స్వయంగా తీసుకుని సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్‌లలో పోస్ట్ చేయటమే ఈ సెల్ఫీ సంస్కృతి. ఒక్కోసారి ఈ సెల్ఫీ సంబరం శృతిమించి ప్రాణాలమీదకు తెస్తోంది. సెల్ఫీల పై వెర్రి వ్యామోహంతో మితిమీరి ప్రవర్తిస్తే అనేక అనర్థాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సెల్ఫీలు చిత్రీకరించుకున్న కొద్ది క్షణాల్లోనే ప్రమాదాలకు గురై ప్రాణాలను కోల్పోయిన పలువురి వివరాలను మీతో షేర్ చేసుకుంటున్నాం...

యూఎస్ హైవే పై...
కౌర్ట్నీ స్టాన్‌ఫోర్డ్ అనే మహిళ ఫేస్‌బుక్‌లో తన సెల్ఫీని పోస్ట్ చేసిన కొద్ది సెకన్లకు కారు ప్రమాదంలో దుర్మరణంపాలైంది. యూఎస్ హైవే పై కారులో ప్రయాణిస్తున్న మహిళ కౌర్ట్నీ స్టాన్‌ఫోర్డ్ ఫేస్‌బుక్‌లో తన సెల్ఫీని పోస్ట్ చేసిన కొద్ది సెకన్లకే ఎదురుగా వెళుతున్న రిసైకిలింగ్ ట్రక్‌ను ఢీకొని మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు.

కారులో ప్రయాణిస్తూ...
కోలెట్ మోరెనో, ఆష్లీ థెయోబాల్డ్ అనే ఇద్దరు మహిళలు కారులో ప్రయాణిస్తూ తీసుకున్న సెల్ఫీ ఇది. ప్రమాదవశాత్తూ వీరు ప్రయాణిస్తున్న కారు వేరొక వాహానాన్ని ఢీకొనటంతో ఇద్దురూ ప్రాణాలను కోల్పోయారు.

మెక్సికన్ పాప్‌స్టార్
మెక్సికన్ పాప్‌స్టార్ జిన్నీ రివిరా తన బృందంతో కలిసి ఓ ప్రైవేట్ జెట్‌లో ప్రయాణించేందుకు తీసుకున్న సెల్ఫీ ఇది. ప్రమాదవశాత్తూ ఆ జెల్ కూలిపోవటంతో అందరూ మరణించారు.

తూర్పు యుక్రెయిన్‌లో ...
తూర్పు యుక్రెయిన్‌లో ప్రమాదానికి గురైన మాలేషియన్ ఎయిర్ లైన్స్ విమానం ఎంహెచ్17లో మరణించిన తల్లీకొడుకులు విమానం బయలుదేరేముందుకు తీసుకున్న సెల్ఫీ ఇది!

రైలు పైకి ఎక్కి ప్రమాదవశాత్తూ..
21 సంవత్సరాల జీన్ సెల్ఫీ తీసుకోవాలన్న తాపత్రయంతో రైలు పైకి ఎక్కి ప్రమాదవశాత్తూ మరణించాడు.

ఇద్దరు ఇరాన్ మహిళలు..
కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు ఇరాన్ మహిళలు సెల్ఫీ తీసుకోవాలని ప్రయత్నించి ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఆ ఇద్దురు మహిళలు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వెళుతూ సెల్ఫీని చిత్రకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.

నది సమీపంలో సెల్ఫీ కోసం ప్రయత్నించి...
కరెన్ హెర్నాండెజ్ అనే మహిళ మెక్సికోలోని ఎల్ ట్యూనల్ నది సమీపంలో సెల్ఫీ తీసుకోవాలనే ప్రయత్నంలో ప్రమాదవశాత్తూ మరణించారు.

కొండపైకి ఎక్కిన దంపతులు
తమ ‘సెల్ఫీ' తీసుకోవాలని ఓ కొండపైకి ఎక్కిన దంపతులు అక్కడి నుంి ప్రమాదవశాత్తు జారీ పడటంతో తమ ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాధ ఘటన పోర్చుగల్‌లో జరిగింది. లిస్బన్ సమీపంలోని ప్రముఖ పర్యాటక స్థలమైన కోబో డి రోకా కొండపై నుంచి పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఎవరూ లేనటువంటి కొండపైకి ఆ దంపతులు చేరుకున్నారు.

ఫేస్‌బుక్‌లో తన స్నేహితులను ఆకట్టుకునేందుకు
ఫేస్‌బుక్‌లో తన స్నేహితులను ఆకట్టుకునేందుకు తాగిన మత్తులో ఆస్కార్ ఒటిరో అనే యువ రెటర్నరీ వైద్యుడు బల్లెట్ లోడ్ చేసిఉన్న తుపాకీని తల దగ్గరగా పెట్టుకుని స్మార్ట్‌ఫోన్‌తో సెల్ఫీను తీసుకునేందుకు ప్రయత్నించాడు. ప్రమాదవశాత్తూ తుపాకీ పేలడంతో ఆస్కార్ తలలోకి బుల్లెట్ దూసుకువెళ్లింది. దీంతో అక్కడికక్కెడే మరణించాడు.

మోటారు సైకిల్ ప్రమాదంలో
రెగ్గాటన్ సంగీతకారుడు జాడియిల్, మోటారు సైకిల్ ప్రమాదంలో మరణించే ముందు తీసుకున్న సెల్ఫీ ఇది.


Click it and Unblock the Notifications








