ఆన్‌లైన్‌‌ ఆర్డర్‌కి బిజెపిలో చేరేందుకు లింకేంటి,లబోదిబోమన్న కస్టమర్ !

|

ఆన్‌లైన్‌ కొనుగోళ్లలో ఈ మధ్య మోసాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయనే వార్తలు రోజూ పేపర్లలో చూస్తున్నాం. ఏదైనా వస్తువు ఆర్డర్ చేసినప్పుడు ఎలక్ట్రానిక్‌ వస్తువులను ఆర్డర్‌ చేసినపుడు సదరు వస్తువులకు బదులుగా రాళ్లు, రప్పలు, మరేదో రావడం కస్టమర్లు ఫిర్యాదు చేయడం షరా మాములే. అయితే ఈ వినియోగదారునుకి ఎవ్వరికీ ఎదురుకాని ఓ వింత అనుభవం ఎదురైంది. ఓ ఈ కామర్స్ దిగ్గజ కంపెనీకి హెడ్‌ఫోన్స్‌ కోసం ఆర్డర్‌ చేసిన కస్టమర్‌ ఆ తర్వాత పరిణమాలకు ఒక్కసారిగా షాక్ తిన్నాడు.

 

భారీ ఆఫర్లు, జియో లింక్ పేరుతో కొత్త సర్వీసులు,మళ్లీ ఉచిత సునామిభారీ ఆఫర్లు, జియో లింక్ పేరుతో కొత్త సర్వీసులు,మళ్లీ ఉచిత సునామి

అటు కుటుంబానికి, ఇటు తనకు

అటు కుటుంబానికి, ఇటు తనకు

కలకత్తాకు చెందిన ఓ ఫుట్‌బాల్‌ అభిమానికి ఫుట్‌బాల్‌ పట్ల అమితమైన ప్రేమ ఉంది. అయితే తన అభిమానం ఇంట్లో వాళ్లని ఇబ్బందికి గురి చేస్తుందనే విషయాన్ని గుర్తించిన అతను అటు కుటుంబానికి, ఇటు తనకు ఏఇబ్బందీ లేకుండా మ్యాచ్‌లనుఎంజాయ్‌ చేయాలనుకున్నాడు.

హెడ్‌ఫోన్‌కు బదులుగా ఒక హెయిర్‌ ఆయిల్‌ డబ్బా..

హెడ్‌ఫోన్‌కు బదులుగా ఒక హెయిర్‌ ఆయిల్‌ డబ్బా..

ఇందుకు రెండు టీవీ హెడ్‌సెట్‌లను ప్రముఖ ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా ఆర్డర్‌ చేశాడు. అయితే ఆ ప్యాకేజి అతను ఇంట్లో లేని సమయంలో ప్యాకేజి ఇంటికి రావడంతో ఆ మరుసటి రోజు అతడు ఆ ప్యాకేజి విప్పి చూశాడు. ఎంతో ఆసక్తిగా తన హెడ్‌ఫోన్‌కోసం ఎదురు చూసిన ఆ అభిమాని బాక్స్‌లో ఉన్నదాన్ని చూసి ఒక్కసారిగా షాక్ తిన్నాడు. హెడ్‌ఫోన్‌కు బదులుగా ఒక హెయిర్‌ ఆయిల్‌ డబ్బా దర్శనమిచ్చింది.

బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి స్వాగతం
 

బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి స్వాగతం

దీంతో బాధితుడు బాక్స్‌మీద ఉన్న టోల్‌ ఫ్రీకి (1800) ఫోన్‌ చేశాడు. ఫోన్‌ రింగ్‌ ఒకసారి మ్రోగి.. డిస్‌ కనెక్ట్‌ అయింది. ఆ వెంటనే బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి స్వాగతం అన్న సందేశం వచ్చింది. అయోమయంలోంచి తేరుకోకుండానే బాధితుడు అదే నెంబర్‌కు మళ్లీ డయల్‌ చేశాడు. సేమ్‌ ఎస్‌ఎంఎస్‌ రిపీట్‌.

వాళ్ల స్నేహితులతో షేర్‌ చేస్తే

వాళ్ల స్నేహితులతో షేర్‌ చేస్తే

ఇక ఈ విషయాన్ని వాళ్ల స్నేహితులతో షేర్‌ చేస్తే.. వాళ్లు ఇదే అనుభవాన్ని పంచుకున్నారు. అయితే వారి సలహా మేరకు కంపెనీకి చెందిన అసలైన టోల్‌ ఫ్రీ నెంబరు తెలుసుకుని తన ఫిర్యాదు నమోదు చేశాడు.

మా దగ్గర హెడ్‌ఫోన్‌ సెట్‌ ఒకటి మాత్రమే

మా దగ్గర హెడ్‌ఫోన్‌ సెట్‌ ఒకటి మాత్రమే

ఇంకా ఆసక్తికర అంశం ఏంటంటే ఆయిల్‌ కావాలంటే వాడుకోండి..లేదంటే అవతల పారేయండి. దురదృష్టవశాత్తూ మా దగ్గర హెడ్‌ఫోన్‌ సెట్‌ ఒకటి మాత్రమే ఉంది. రెండో దానికి డబ్బులు వాపస్‌ చేస్తామంటూ షాపింగ్ పోర్టల్ నుండి కాల్‌ వచ్చిందట..

నూనె సీసాను బీరువాలో భద్రంగా దాచిపెట్టి..

నూనె సీసాను బీరువాలో భద్రంగా దాచిపెట్టి..

దీంతో ఈ మొత్తం వ్యవహారంతో తెల్లబోయిన బాధితుడు మాత్రం మళ్లీ ఆన్‌లైన్‌ పోర్టల్‌ వాళ్లు వచ్చి ఆదే బాటిల్‌ వాపస్‌ ఇవ్వమంటే ఎలా అనుకుంటూ.. నూనె సీసాను బీరువాలో భద్రంగా దాచిపెట్టి... ఫుల్‌బాల్‌ మ్యాచ్‌లను మ్యూట్‌లోనే వీక్షిస్తున్నాడుట.

ఈ వ్యవహారంపై స్పందించిన ఆన్‌లైన్‌ పోర్టల్‌

ఈ వ్యవహారంపై స్పందించిన ఆన్‌లైన్‌ పోర్టల్‌

మరోవైపు ఈ వ్యవహారంపై స్పందించిన ఆన్‌లైన్‌ పోర్టల్‌ కస్టమర్‌ కేర్‌ ప్రతినిధి ..అసలు 1800నెంబరు తమకు చెందినది కాదనీ.. మోసగాళ్ల వలలో పడి విలువైన సమాచారాన్ని షేర్‌ చేయొద్దంటూ కోరారు. అలాగే అంశాన్ని తమ పై అధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్టు చెప్పారు.

Best Mobiles in India

English summary
Kolkata Man Dialled Flipkart To Complain About Order, Got SMS To Join BJP More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X