డిజిటల్ వ్యసనంలో పడితే ఈ భయంకరమైన చిక్కులు తప్పవు

By Gizbot Bureau
|

స్మార్ట్‌ఫోన్స్ వచ్చిన తరువాత మనుషులతో మాట్లాడే రోజులు పోయాయి. అంతా ఆన్ లైన్‌లోనే మాట్లాడేస్తున్నారు.ఫోన్లతోనే గంటల కొద్ది గడిపేస్తున్నారు. క్షణం స్మార్ట్ ఫోన్ స్ర్కీన్ చూడకుండా ఉండలేని పరిస్థితికి చేరుకున్నారు. ఇప్పుడు ఎవరికీ ఆఫ్‌లైన్ అనుబంధాలు అక్కర్లేదు.అన్నీ ఆన్ లైన్ బంధాలే. ఇంకా చెప్పాలంటే స్నేహితులు, బంధువులను కలిసి సరదాగా మాట్లాడుకునే సమయం కూడా దొరకడం లేదు. అంతగా ఫోన్లతో బిజీ లైఫ్‌గా మారిపోయింది. ఎవరితో మాట్లాడాలన్నా ఫోన్లలోనే. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన ఈ ఆధునిక కాలంలో స్మార్ట్ ఫోన్లతోనే కాలాన్ని వెల్లదీస్తున్నారు. ఫలితంగా స్నేహపూర్వక సంబంధాలు దెబ్బతింటున్నాయి.

రోజుకు ఎన్నోసార్లు ఫోన్ చూస్తున్నారు :
 

ఒకవేళ రోజుకు 2,600 సార్లు కంటే ఎక్కువగా ఫోన్ స్ర్కీన్ టచ్ చేస్తుంటే.. మీరు డిజిటల్ వ్యసనానికి గురయినట్టేనని చెప్పాలి. మీరు ఎప్పుడైనా ఫోన్ ఎక్కడైనా పెట్టి మరిచిపోయారా? ఆ సమయంలో మీరు ఎలా రియాక్ట్ అయ్యారు.. భయపడ్డారా? కలవరపాటుకు గురయ్యారా? దీన్నే ‘ఫ్యాంటామ్ వైబ్రేషన్ సిండ్రోమ్' అని అంటారు. ఫోన్లో ఒక మెసేజ్ అలర్ట్ రాగానే కంగారుగా ఏంటా ఓపెన్ చేసి చెకింగ్ చేస్తున్నారా? అయితే మీ జీవితాన్ని నాశనం చేస్తోందని గ్రహించండి. కొన్ని వాస్తవిక సందర్భాల్లో కూడా దీని ప్రభావం తీవ్ర స్థాయిలో కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దీని భారీ నుండి ఎలా దూరమవ్వాలనే విషయాలు ఎక్కువగా ఆలోచన చేయాలి.

ఫోన్ స్క్రీన్లు

మనుషులతో నేరుగా స్పందించకుండా ఫోన్, కంప్యూటర్ స్ర్కీన్ల ద్వారా స్పందించేవారిపై ఏ మేరకు ప్రభావం ఉంటుందో టెక్నాలజీ, కమ్యూనికేషన్స్ రీసెర్చర్ ఒకరు తన అనుభవాన్ని వివరించారు. ఫేస్-టూ-ఫేస్, ఫోన్ స్ర్కీన్, రాయడం సహా ఇతర మార్గాల్లో స్పందన నుంచి ఎలాంటి స్ర్కీన్ల ద్వారా స్పందన భిన్నంగా ఉంటుంది అనేదానిపై కనీసం రెండు దశబ్దాలుగా పరిశోధించినట్టు చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి తన పరిశోధక బృందం ఒక అధ్యయనాన్ని రూపొందించినట్టు తెలిపారు. ఈ పరిశోధనలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది అబద్దాలు చెప్పినట్టు గుర్తించామన్నారు. మరికొంతమంది నెగిటీవ్ (లోయిర్ ఫీడ్ బ్యాక్ రేటింగ్స్) ఇవ్వగా, కొంతమంది పెద్దగా సహకరించేలేదన్నారు.

ఐదేళ్ల లోపు పిల్లల్లోనే ఎక్కువ 

ఐదేళ్ల లోపు పిల్లల్లో డిజిటల్ ప్రభావం వారి మెదడు అభివృద్ధి విషయంలో ప్రమాదకరమైనదిగా పరిగణించినట్టు తెలిపారు. ఫోన్ స్ర్కీన్ ఎక్కువ సమయం చూసే వారిలో చిన్నారులే పెద్ద మొత్తంలో ప్రభావానికి గురికావడం భయాందోళనకు గురిచేస్తోందని పరిశోధక బృందం చెబుతోంది. చిన్నారుల్లో ఎక్కువగా ప్రభావితమయ్యే స్థానాల్లో మానసిక ఆరోగ్యం, వ్యసనం, తమ వైపు ఏం జరుగుతుందో గ్రహించలేకపోవడం వంటి ఈ మూడే ప్రమాద స్థాయిలో ఉన్నట్టు తెలిపారు. ప్రత్యేకించి టీనేజర్లలో సెల్ ఫోన్, మానసిక ఒత్తిడి మధ్య సంభావ్యత సంబంధాలు చాలానే ఉన్నాయి.

వీడియో గేమ్స్‌ మరీ డేంజర్
 

డిజిటల్ వ్యసనానికి మూల కారణం సైకాలజీ పరంగా చూస్తే వీడియో గేమ్ వ్యసనమని గుర్తించారు. ఈ సమస్యను సులభంగా నిర్ధారించవచ్చు. దీనికి పరిష్కారం ఒకటే ఉంది. ముందుగా చిన్నారులను తమ స్నేహితులతో కలిసి మెలిగే వాతావరణం కల్పించాలి. పెద్దలతో కలిసి మంచి విషయాలు తెలుసుకునేలా ప్రోత్సహించాలి. తల్లిదండ్రులే ఇందులో కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అప్పుడే పిల్లల్లో మానసిక ఎదుగుదలకు ఎలాంటి సమస్య ఉండదు. నిద్రలేమి సమస్యలు క్రమంగా తొలిగిపోతాయి కూడా.

మీ పిల్లలపై ఓ కన్నేసి ఉంచండి :

ప్రతిఒక్కరూ రోజు రాత్రి నిద్రపోయే ముందు సెల్ ఫోన్ వాడకూడదని గట్టిగా నిర్ణయించుకోండి. వాహనం నడిపే సమయంలో కావొచ్చు లేదా వీధులు దాటే సమయంలో కావొచ్చు.. ఒకవేళ మీ పిల్లలు ఫోన్ స్ర్కీన్ ఎక్కువ సమయం చూస్తున్నారంటే.. వారిపై ఓ కన్నేసి ఉంచండి. వారికి ఏదైనా పని చెప్పండి లేదా వారితో ఏదొక అంశంపై చర్చించండి. అప్పుడు వారిలో మార్పు మొదలవుతుంది. ఈ విషయంలో కొన్ని టూల్స్, యాప్స్ సాయం కూడా మీరు పొందవచ్చు.

Most Read Articles
Best Mobiles in India

English summary
How to tell if your digital addiction is ruining your life

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X